
సాక్షి, ముంబై: కార్పోరేట్ దిగ్గజం, మహీంద్ర అండ్ మహీంద్ర ఛైర్మన ఆనంద్ మహీంద్రా మరోసారి ఆసక్తికరమైన ట్విట్‌తో వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు ఆసక్తికరమైన, ఇన్నోవేటివ్ అంశాలను షేర్ చేస్తూ వుంటారు. తాజాగా ఒక హిల్లేరియస్ ఫోటోను ట్వీట్ చేశారు. తద్వారా తన సెన్సాఫ్ హ్యూమర్‌ను చాటుకున్నారు. ఒక రోడ్ రోలర్ చక్రంపై బాడీ మసాజ్ ప్రకటన పోస్టర్ నిత్యం బిజీగా ఉండే ఆనంద్ మహీంద్రా కంట పడింది. ఈ ప్రకటనకు సంబంధించిన పోస్టర్ ఒక రోడ్ రోలర్ చక్రం మీద అంటించడమే ఆసక్తికరంగా మారింది. అంతేకాదు బాడీ మసాజ్ కేవలం రూ.499 మాత్రమే అని దానిపై రాసి ఉంది. ఇక ఆయన ఊరుకుంటారా? వెంటనే సోషల్ మీడియాలో షేర్ చేశారు. దానికి చక్కటి కమెంట్ యాడ్ చేశారు. దీంతో ఇది వైరల్ అయింది.
ఇలాంటి మసాజ్ ఒకసారి చేసుకుంటే చాలు...ఇక జీవితంలో మరోసారి దీని అవసరం రాదు. ఈ మసాజ్‌తో శరీరంలోని రుగ్మతలన్నీ మటుమాయమంటూ పేర్కొన్నారు. అంతేకాదు ఈ పోస్టర్ అంటించిన వ్యక్తికి మంచి సెన్సాఫ్ హ్యూమర్ అయినా ఉండాలి లేదంటే ఐక్యూ లెవల్ అయినా తక్కువగా ఉండాలని ట్వీట్ చేశారు. కాగా ట్విటర్‌లో ఆనంద్ మహీంద్రాకు 70 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు.
Hilarious. After this massage, you’ll never need another one; it’ll be a permanent remedy for all ailments... (The guy who plastered that poster either had a delicious sense of humour or a seriously low IQ!) pic.twitter.com/92UIQaCmhq
— anand mahindra (@anandmahindra) June 3, 2019
Comments
Please login to add a commentAdd a comment