
కోమలమైన ముఖానికి...
ఒక స్పూన్ శనగపిండిలో రెండు స్పూన్ల పెరుగు, ఆరస్పూన్ తేనె, ఐదారు చుక్కల గ్లిజరిన్ కలిపి, ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత కడగాలి. వేసవి కాలంలో శనగపిండి సరిపడని శరీర తత్త్వం గలవారు పెసరపిండితో ప్యాక్ వేసుకోవచ్చు.
పుచ్చకాయ రసం, కమలా పండు రసం, మామిడి పండు గుజ్జు, దోసకాయ గుజ్జు... దేనినైనా ముఖానికి పట్టించి మసాజ్ చేస్తే చర్మం లావణ్యంగా ఉంటుంది. జిడ్డు చర్మానికి పుల్లటి పండ్లు వాడితే మంచిది. సాధారణ చర్మం, పొడి చర్మానికి అరటి, మామిడి వంటి తియ్యని పండ్లు వాడాలి.
బంతి, చామంతి, గులాబీ వంటి పూల రెక్కలను మెత్తగా గ్రైండ్ చేసి ముఖానికి ప్యాక్ వేస్తే చర్మం నునుపుదనం సంతరించుకుంటుంది. గులాబీలు అన్ని వయసుల వారూ వాడవచ్చు. చామంతి పూలను టీనేజ్ దాటిన తర్వాత వాడాలి.