రాజేంద్రనగర్: అమ్మా క్షమించు అంటూ ఓ విద్యార్థిని సెల్‌ఫోన్‌కు మెసేజ్ చేసి ఇంటి నుంచి బయటకు వెళ్లి కనిపించకుండాపోయిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంచిరేవుల ప్రాంతానికి చెందిన బుర్రయ్య కూతురు అర్చన(26) డిగ్రీ పాసై వివిధ ఉద్యోగాల పరీక్షలు రాసేందుకు సిద్దమవుతుంది. ఇందులో భాగంగా నగరంలోని ఓ కోచింగ్ సెంటర్‌లో శిక్షణ పొందుతుంది. ఈ నెల 19న ఉదయం 11గంటలకు ఇంటి నుంచి కోచింగ్‌కు వెళ్తున్నానని చెప్పి బయలుదేరింది. అనంతరం 11:58 నిమిషాలకు తల్లి సెల్‌ఫోన్‌కు అమ్మా క్షమించు అంటూ మెసేజ్ పెట్టి సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. దీంతో తల్లి విషయాన్ని కుమారుడికి తెలిపింది. శిక్షణ పొందుతున్న కోచింగ్ సెంటర్‌కు వెళ్లగా అక్కడికి రాలేదని తేలింది. చూట్టు పక్కల ప్రాంతాలు, బంధువులు, స్నేహితుల వద్ద వాకబు చేసిన ఆచూకీ లభించలేదు. దీంతో శుక్రవారం ఉదయం నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment