వయసు పెరిగే కొద్ది ముఖమైనా, శరీరమైనా తగిన కొలతలతో, నాజూగ్గా కనిపించాలంటే.. ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోక తప్పదు. చర్మం వదులుగా మారిపోకుండా.. బుగ్గలు, మెడ భాగాల్లో కొవ్వు పేరుకుపోకుండా, డబుల్ చిన్ ఏర్పడకుండా, కళ్లచుట్టు ముడతలు, వలయాలు పెరిగిపోకుండా జాగ్రత్త వహించాలంటే ఈ స్కిన్ రోలర్ మీ పర్సనల్ బ్యూటీ కిట్‌లో భాగం కావాల్సిందే!
చిత్రంలోని ఈ టూల్‌ని గువా షా ఫేషియల్ రోలర్ అని కూడా పిలుస్తారు. గువా షా అంటే చైనీస్ సంప్రదాయ సౌందర్య సాధనం. తేలికపాటి టూల్‌తో ఫేస్ లేదా బాడీ మీద ఆక్యుప్రెజర్ పాయింట్స్‌ని ఉత్తేజపరిచే పద్ధతి. ఈ రోలర్ అలాంటిదే! ఇన్నోవేటివ్ షేప్ డిజైన్‌తో, అల్ట్రా–స్మూత్ జింక్ అల్లాయ్ మెటీరియల్‌తో రూపొందిన ఈ టూల్.. చర్మ ఆకృతిని బిగుతుగా చేస్తుంది. పోగొట్టుకున్న యవ్వనాన్ని తిరిగి ఇవ్వడంలో సహకరిస్తుంది. చర్మాన్ని తాజాగా మారుస్తుంది.
ఈ టూల్‌లోని రోలింగ్ బాల్ కళ్లు, ముక్కు వంటి భాగాల్లోని సున్నితమైన మూలల్లో బాగా పని చేస్తుంది. చేరుకోలేని చిన్నచిన్న భాగాల్లో అది చక్కగా ఉపయోగపడుతుంది.ఈ ట్రీట్‌మెంట్‌ని దినచర్యలో భాగం చేసుకుంటే.. చర్మం మీద చిన్నచిన్న గీతలు, ముడతలు తగ్గి చర్మం మృదువుగా మారుతుంది. అనవసరమైన కొవ్వు పేరుకుపోదు.
కండరాల్లో ఒత్తిడి కూడా తగ్గి ఉపశమనంగా ఉంటుంది. దీన్ని ఫ్రిజ్‌లో పెట్టుకుని, అవసరమైనప్పుడు తీసి మసాజ్ చేసుకుంటూ ఉండాలి. పని పూర్తి కాగానే క్లీన్ చేసి మళ్లీ ఫ్రిజ్‌లో భద్రపరచుకోవచ్చు.ఈ రోలర్‌లో గుండ్రటి బాల్ 360 డిగ్రీలు రొటేట్ అవుతుంది. మధ్యభాగంలో ఒకవైపు వీపు వెనుక, నుదుట మీద మసాజ్ చేసుకోవడానికి.. మరోవైపు బుగ్గలు, మెడ, కాళ్లు, చేతులు వంటి ఒంపులున్న భాగాల్లో మసాజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక కింది భాగంలో చేప తోకలా కనిపిస్తున్న ఆ భాగంతో గడ్డం చుట్టు మసాజ్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment