గోవా ఫుల్ బాడీ మసాజ్ తో గోవిందా గోవింద | Goan massage fleeces tourists | Sakshi
Sakshi News home page

గోవా ఫుల్ బాడీ మసాజ్ తో గోవిందా గోవింద

Published Wed, Apr 23 2014 2:23 PM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

గోవా ఫుల్ బాడీ మసాజ్ తో గోవిందా గోవింద - Sakshi

గోవా ఫుల్ బాడీ మసాజ్ తో గోవిందా గోవింద

గోవా అంటేనే మందు, విందు, పొందు. గోవా అంటేనే బీచ్ బ్యూటీలు, బికినీ బేబ్ లు. గోవా అంటే భలే భలే పసందైన ఫుల్ బాడీ మసాజ్. కానీ చాలా మందికి ఫుల్ బాడీ మసాజ్ అంటే నిలువు దోపిడీ.

ఇటీవలే ఏడుగురు మిత్రులు గోవాకు వెళ్లారు. అక్కడ మంచి మసాజ్ ఆఫర్ వచ్చింది. మూకుమ్మడి మసాజ్ మహా బాగుంటుందనుకుని వెళ్లారు. అయితే అక్కడ వెళ్లాక ఎక్కడెక్కడో మసాజ్ చేస్తారనుకుంటే ఎక్కడపడితే అక్కడ పిడిగుద్దులు కురిపించి, ఉన్నదంతా దోచేసుకున్నారు. చివరికి గోవిందా గోవిందా అయిపోయింది. కట్టుబట్టలతో లారీల్లో పడి, రైలు కంపార్ట్ మెంట్ బాత్రూముల్లో దాగి ఎలాగోలా ఇల్లు చేరుకున్నారు.

ఫుల్ బాడీ మసాజ్ అంటే గోవాలో నిలువు దోపిడీ అని అర్థం. గోవాలో మూడు బ్రాలు, ముప్ఫై ఆరు బికినీలుగా విస్తరిస్తున్న సెక్స్ టూరిజం టూరిస్టులను దోచేసుకుంటోంది. చాలా మంది కారులో మసాజ్, టెంపోలో మసాజ్ అని ప్రజలను మోసం చేస్తున్నారు. ఏడాదికి 30 లక్షల మంది టూరిస్టులు వచ్చే గోవాకి ఇప్పుడు ఈ మసాజ్ మోసం ఒక మాయని మచ్చగా మారింది. దీంతో ఇప్పుడు గోవా ప్రభుత్వం ఈ మసాజ్ పార్లర్లను నియంత్రించేందుకు, లైసెన్సులు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది.  అయితే సర్కారు ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అన్నది త్వరలోనే తెలుస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement