మారిన లైఫ్ స్టయిల్ వల్ల మన బాడీలో బాగా స్ట్రెయిన్ అవుతున్నవి కళ్లే! కంప్యూటర్, సెల్‌ఫోన్.. కళ్లకు క్షణం తీరికనివ్వడం లేదు. దాంతో ఆ అలసట అందాన్ని ఎఫెక్ట్ చేస్తోంది. దానికి చక్కటి రిలీఫే ఐ మసాజర్. చిత్రంలోని ఈ హీటింగ్ ఫటీగ్ థెరపీ వెల్‌నెస్ డివైస్.. కళ్ల భారాన్ని, ఒత్తిడిని దూరం చేస్తుంది. ఇందులో హై, మీడియం, లో అనే త్రీ మోడ్స్ ఉంటాయి.
‘లో’ ఆప్షన్‌కి 36 డిగ్రీల సెల్సియస్ (97 డిగ్రీల ఫారెన్ హీట్) ప్రభావం ఉంటే.. ‘మీడియం’ ఆప్షన్‌కి 39 డిగ్రీల సెల్సియస్ (102 డిగ్రీల ఫారెన్ హీట్) ప్రభావం ఉంటుంది. ఇక ‘హై’ ఆప్షన్‌లో 42 డిగ్రీల సెల్సియస్ (108 డిగ్రీల ఫారెన్ హీట్) టెంపరేచర్ ఉత్పత్తి అవుతుంది. ఈ డివైస్ చేతిలో ఇమిడిపోయేంత చిన్నగా.. కళ్లకు అమరేంత సౌకర్యవంతంగా ఉంటుంది.
ఇది వేడెక్కడానికి 10 సెకన్ల సమయం పడుతుంది. అలాగే దీనికి చార్జింగ్ పెట్టుకోవడానికి ప్రత్యేకమైన ప్యాడ్ లభిస్తుంది. దాంతో ఈ మసాజర్‌ని వైర్‌లెస్‌గా వినియోగించుకోవచ్చు. ఇది ఒత్తిడిని తగ్గించడంతో పాటు.. అలసటను దూరం చేస్తుంది. కళ్ల చుట్టూ మచ్చలు, ముడతలు ఏర్పడి, కళాహీనంగా మారకుండా సంరక్షిస్తుంది. అలాగే సరికొత్త ఉత్తేజాన్ని ఇచ్చి రిలాక్స్ చేస్తుంది. ఈ పోర్టబుల్ పర్ఫెక్ట్ ఐ మసాజర్‌ని ప్రతిరోజూ వినియోగించుకోవచ్చు.
(చదవండి: ముఖానికి ఫేస్ యోగా! దెబ్బకు మొటిమలు, మచ్చలు మాయం!)
Comments
Please login to add a commentAdd a comment