
బ్యూటిప్స్
మోచేతులు దగ్గర చర్మం పొడిబారి, నల్లగా ఉంటుంది. ఇటువంటి చర్మాన్ని క్యారెట్ మామూలుగా చేయగలదు. దీనికోసం క్యారెట్ జ్యూస్‌లో పంచదార, ఉప్పు కలిపిన మిశ్రమాన్ని ప్రతిరోజు మోచేతిపై మసాజ్ చేస్తుండాలి. మెడ చుట్టూ ఉండే చర్మం అప్పుడప్పుడు నల్లగా మారతుంటుంది. అలాంటప్పుడు క్యారెట్ జ్యూస్, నిమ్మరసం, పంచదార పొడి మూడింటినీ కలుపుకోవాలి. ముందుగా నెక్ అంతటా నూనె అప్లై చేసుకుని తర్వాత క్యారెట్ మిశ్రమంతో మసాజ్ చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది.
కప్పు పాలలో గుప్పెడు ఉసిరికాయల్ని రెండు గంటలపాటు నానబెట్టాలి. ఆ తరువాత పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి రెండు గంటలపాటుంచి తల స్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా అవుతుంది. పెరుగులో మెంతులు వేసి రాత్రంతా నానబెట్టాలి. ఈ మిశ్రమంలో మందారం ఆకులను వేసి పేస్ట్ చేసి జుట్టు కుదుళ్ల నుండి కొసళ్ళ వరకూ పట్టించి అరగంట వరకు పాటు ఉంచుకుని తలస్నానం చేస్తే జుట్టు మెత్తగా, సిల్కీగా ఉంటుంది. ఉల్లిపాయ రసం, తేనె, రాళ్ళ ఉప్పు మూడింటిని కలిపి మొటిమలపై రాసి, 20 నిముషాలకు శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే యాక్నే మచ్చలు తొలగిపోతాయి.