
సాక్షి, హైదరాబాద్ : సరూర్‌నగర్ సిఐ లింగయ్య తన స్టేషన్‌లో హోంగార్డుతో మసాజ్ చేయించుకున్న బాగోతంపై రాచకొండ కమిషనర్ సీరియస్ అయ్యారు. కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీపీ మహేష్ భగవత్ దీనిపై దర్యాప్తు జరిపి సమగ్ర నివేదిక సమర్పించాలని డీసీపీ(అడ్మిన్) ప్రకాష్‌రెడ్డిని సంఘటనపై విచారణ అధికారిగా నియమించారు. వివరాల్లోకి వెళితే... సరూర్‌నగర్ ఇన్‌స్పెక్టర్ సుందరి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. స్టేషన్‌లో పనిచేసే హోంగార్డుతో ఇంటి వద్ద బాడీ మసాజ్ చేయించుకుంటున్న దృశ్యాలు మీడియా ఛానెల్‌లో హల్‌చల్ చేశాయి.
మన్సూరాబాద్‌లోని ఇంటివద్ద సీఐ లింగయ్య యూనిఫామ్‌లో ఉన్న హోంగార్డు సైదానాయక్‌తో బాడీ మసాజ్ చేయించుకుంటున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. అయితే మీడియాలో ప్రసారం అయిన దృశ్యాల్లో ఉన్నది తాను కాదని, తనకు మసాజ్ చేయించుకోవటంకానీ, మద్యం సేవించే అలవాటు అసలే లేదని సీఐ లింగయ్య పేర్కొన్నారు. సైదానాయక్ అనే హోంగార్డు అక్టోబర్ 14న రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో సెలవులో ఉన్నాడని, అనంతరం ఇక్కడినుంచి బదిలీపై వెళ్ళాడని అన్నారు. మూడు నెలలుగా సరూర్‌నగర్‌లో హోంగార్డు లేడని ఆయన స్పష్టం చేశారు. తనపై గిట్టనివాళ్లే ఈ దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment