
కొండచిలువా... మసాజ్ వారెవా...
ఈ కొండ చిలువలు ఈమెను మింగేయడం లేదు.. ఎంచక్కా మసాజ్ చేస్తున్నాయి. తమ మసాజ్ సెంటర్‌కు వచ్చిన వినియోగదారులకు సేవలను అందిస్తున్నాయి. మీరు చాలా రకాల మసాజ్‌లను చేయించుకుని ఉంటారు. ఓసారి.. ఫిలిప్పీన్స్‌లోని సెబూ సిటీ జూకి వెళ్తే.. అక్కడ మీరు ఈ కొండ చిలువల మసాజ్ కూడా చేయించుకోవచ్చు. మసాజ్ లో భాగంగా.. ఒక్కోటి 13 అడుగుల పొడవున్న నాలుగు బర్మీస్ కొండచిలువలను జూ నిర్వాహకులు మన మీద వదులుతారు.
అవి అటూ ఇటూ తిరుగుతూ.. మసాజ్ చేస్తాయి. మొత్తం 15 నిమిషాలపాటు ఈ సేవ కొనసాగుతుంది. ఇంత పెద్దవి కదా.. ఆకలేస్తే మింగేయవా అని డౌటా.. అదే అనుమానం జూ వాళ్ల వద్ద వ్యక్తం చేస్తే.. మసాజ్‌కు ముందు ఒక్కోదానికి 10 కోళ్లను పలహారంగా పెడతారట. కాబట్టి.. భయమక్కర్లేదని చెబుతున్నారు. మొదట్లో ఈ మసాజ్ చేయించుకోవడానికి చాలా మంది జడుసుకున్నా.. చేయించుకున్నవాళ్లు మాత్రం అదుర్స్ అంటున్నారని జూ సిబ్బంది చెబుతున్నారు.