కోమలమైన పాదాలు.. | The soft feet .. | Sakshi
Sakshi News home page

కోమలమైన పాదాలు..

Published Thu, Sep 29 2016 11:18 PM | Last Updated on Mon, Oct 1 2018 5:41 PM

కోమలమైన పాదాలు.. - Sakshi

కోమలమైన పాదాలు..

సరైన శుభ్రత పాటించకపోతే పాదాలు, చేతులు అందవికారంగా కనిపిస్తాయి. ఈ సమస్య దరిచేరకుండా ఉండాలంటే రోజూ సరైన జాగ్రత్తలు పాటించాలి.
* ఉల్లిపాయను నూరి, ఆ ముద్దను మడమల మీద రాసి, 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే కాలి పగుళ్లు తగ్గుతాయి.
* రోజూ రాత్రి పడుకునే ముందు ఆవనూనె పాదాలకు, చేతులకు రాసుకోవాలి.
* అర కప్పు పెరుగులో అర టీ స్పూన్ వెనిగర్ కలిపి పాదాలకు మసాజ్ చేయాలి.
* క్యాండిల్ వ్యాక్స్, ఆవనూనె కలిపిన మిశ్రమాన్ని రాత్రిపూట కాలి పగుళ్లకు రాసి సాక్స్ ధరించాలి. నిద్ర లేచాక  శుభ్రపరుచుకోవాలి.
* తాజా గులాబీ పువ్వులు కప్పు, అరకప్పు పాలు కలిపి మెత్తగా నూరాలి. దీంట్లో టీ స్పూన్ శనగపిండి కలపాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు, చేతులకు పట్టించి పది నిమిషాల తర్వాత శుభ్రపరచాలి.
* పెట్రోలియమ్ జెల్లీలో టీ స్పూన్ విటమిన్ ‘ఇ’ ఆయిల్, టీ స్పూన్ గ్లిజరిన్ కలపాలి. ఈ మిశ్రమాన్ని పట్టించి పది నిమిషాల తర్వాత కడిగేయాలి.
* బొప్పాయి అరకప్పు, పైనాపిల్ అర కప్పు, తేనె నాలుగు టేబుల్‌స్పూన్లు కలిపి పాదాలకు పట్టించాలి. పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement