
బ్యూటిప్స్
ఆముదం, కొబ్బరినూనె సమపాళ్లలో కలిపి వేడిచేయాలి. ఈ నూనె గోరు వెచ్చగా ఉన్నప్పుడు కుదుళ్ల వరకు పట్టించి మసాజ్ చేసుకోవాలి. రెండు గంటల తర్వాత హెర్బల్ షాంపూతో తలంటుకోవాలి. ఈ విధంగా వారానికి రెండుసార్లు చేస్తే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
ఎండ, దుమ్ము, ధూళి వల్ల జుట్టు రాలిపోవడమే కాక, జీవం లేనట్టుగా కనిపిస్తుంటుంది కూడ. కప్పు పాలలో ఒక కోడిగుడ్డు సొన కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత కేశాలను శుభ్రపరుచుకోవాలి. వారానికి ఓసారి ఈ విధంగా చేస్తుంటే శిరోజాలు నిగనిగలాడుతూ కనిపిస్తాయి.