
ఈ కాలపు ఉరుకులు, పరుగుల జీవితంలో ఒక రోజు గడిచిందంటే చాలు.. శరీరం నీరసించి పోతుంది.. ఎప్పుడెప్పుడు నడుం వాలుద్దామా అనిపిస్తూంటుంది. అలాంటప్పుడు చెవులకు ఇంపైన సంగీతం, ఒళ్లునొప్పులు దూరమయ్యేలా సున్నితమైన మసాజ్ ఉంటే ఎలా ఉంటుందంటారూ? ఓహో.. సూపర్ అంటున్నారా? అయితే ఫొటోలో కనిపిస్తున్న ఆరా సెన్స్ హైటెక్ వాలు కుర్చీ మీ కోసమే. లాస్‌వెగాస్‌లోని సీఈఎస్ 2018లో ప్రదర్శితమవుతున్న ఈ ఫ్రెంచ్ స్టార్టప్ కంపెనీ ఉత్పత్తి అక్షరాలా హైటెక్!
అత్యాధునిక హ్యాప్టిక్ టెక్నాలజీల సాయంతో మృదువైన మసాజ్ చేస్తుంది ఇది. శరీరంలోని దాదాపు 32 చోట్ల ఒత్తిడి కలిగించడం ద్వారా పూర్తిగా రిలాక్స్ కావచ్చునని సంస్థ చెబుతోంది. అదే సమయంలో చెవులకు హెడ్‌ఫోన్స్ తగిలించుకుంటే ఇంపైన సంగీతం వినవచ్చునన్నమాట. కాకపోతే.. ఒక్కో ఆరాసెన్స్ కుర్చీ ఖరీదు దాదాపు రూ.12 లక్షల వరకూ ఉంటుంది!
Comments
Please login to add a commentAdd a comment