బరితెగించిన ఏఎస్‌ఐ.. | ASI gets a Massage by female home guard | Sakshi
Sakshi News home page

బరితెగించిన ఏఎస్‌ఐ.. మహిళా హోమ్ గార్డుతో మసాజ్

Published Mon, Nov 13 2017 5:07 PM | Last Updated on Mon, Aug 20 2018 5:11 PM

ASI gets a Massage by female home guard - Sakshi

మహిళా హోంగార్డు మసాజ్‌ చేయించుకుంటున్న ఏఎస్‌ఐ హసన్‌

సాక్షి, జోగుళాంబ: జిల్లాలోని ఓ ఏఎస్‌ఐ బరితెగించాడు. ఏకంగా పోలీస్‌ స్టేషన్‌లోనే ఓ మహిళా కానిస్టేబుల్‌తో మసాజ్‌ చేయించుకుంటూ సిక్రెట్‌గా అమర్చిన కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో పోలీస్‌ వర్గాల్లో కలకలం రేపుతోంది. జోగులాంబ గద్వాల్‌ సాయుధ రిజర్వ్ ఏఎస్ఐగా పని చేస్తున్న హసన్ గత కొద్దికాలంగా కిందిస్థాయి సిబ్బందితో సపర్యలు చేయించుకుంటున్నాడనే ఆరోపణలు వచ్చాయి.

ఈ ఆరోపణలను సాక్ష్యాలతో పట్టుకోవాలనుకున్న కొంతమంది  సీక్రెట్‌ కెమెరాలు అమర్చారు. స్టేషన్‌ విశ్రాంతి గదిలో మహిళా హోంగార్డ్ తో మసాజ్ చేయించుకుంటున్నట్లు ఉన్నఈ వీడియోను సోమవారం మీడియాకు అందజేశారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ విజయ్ కుమార్ వెంటనే విచారణకు ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement