9 పట్టుబడిన రేషన్ బియ్యం
కేటీదొడ్డి (గద్వాల) : పేదల కోసం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యం పక్కదారి పడుతోంది. రెవెన్యూ, విజిలెన్స్ పౌరసరపరా అధికారులు పక్కాగా తనిఖీలు నిర్వహించక పోవడంతో అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. గ్రామాల్లో రేషన్ బియ్యం దందా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. ఎవరైనా సమాచారం అందించినప్పుడు మాత్రమే అధికారులు దాడులు చేసి పట్టుకుంటున్నారు తప్పా స్వతహాగా గ్రామాల్లో తనిఖీలు చేపట్టడంలేదు.
తాజాగా గద్వాల మండలం బీసీ కాలనీకి చెందిన మార్రెన్న, వీరేష్, జగదీష్లు మంగళవారం ర్యాలంపాడులో 23 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తక్కువ దరకు కొనుగోలు చేసి ఆటోలో కర్ణాటక రాష్ట్రం రాయచూర్‌కు తరలిస్తుండగా ఎస్‌ఐ భాగ్యలక్ష్మికి సమాచారం అందింది. ఈ మేరకు ఆమె ఏఎస్‌ఐ రషీద్, కానిస్టేబుల్ బాల్‌రెడ్డి, రెవెన్యూ అధికారులకు అప్రమత్తం చేశారు. వారు ఉదయం 5:30 గంటలకు కాపుకాసి పట్టుకున్నారు. అనంతరం బియ్యంతో పాటు ఆటోను స్వాధీనపరుచుకున్నారు. ఆర్‌ఐ రాజేష్, ఎన్‌పోర్స్‌మెంట్ డీటీ విజయ్‌కుమార్, వీఆర్‌ఓ ఆనంద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment