officials Neglected
-
డిష్యుం.. డిష్యూం..
పిఠాపురం: ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ఇద్దరు అధికారులు వాగ్వాదానికి దిగడంతో పాటు ఒకరిపై ఒకరు దాడిచేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది. కాకినాడ జిల్లా పిఠాపురంలో శనివారం మున్సిపల్ సమావేశం జరుగుతుండగా అందరి సమక్షంలో కమిషనర్ కనకారావు, డీఈఈ భవానీశంకర్‌లు పరస్పరం దాడికి తెగబడ్డారు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా ఉన్న కోల్డ్‌వార్ ఒక్కసారిగా భగ్గుమనడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాలివీ.. పిఠాపురం మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పచి్చమళ్ల జ్యోతి అధ్యక్షతన శనివారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. సమావేశం ప్రారంభం కాగానే అజెండాలోని పలు పనులపై చర్చించారు. ఆ పనులు ఎవరి ఆధ్యర్యంలో నిర్వహిస్తున్నారు.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల చెల్లింపులు ఎవరు చూస్తున్నారంటూ ఓ కౌన్సిలర్ కమిషనర్ కనకారావును ప్రశ్నించారు. దీనిపై కమిషనర్ బదులిస్తూ ఇక్కడ పనిచేస్తున్న డీఈఈ ఎన్నికల ముందు చెప్పాపెట్టకుండా సెలవుపై వెళ్లిపోయారని, దాంతో ఆయన్ని సరెండర్ చేశానన్నారు. అయితే, కోర్టు ద్వారా ఉత్తర్వులు తెచ్చుకుని డీఈఈ భవానీశంకర్ తిరిగి విధుల్లో చేరారన్నారు. కానీ, ఎప్పుడూ అందుబాటులో ఉండరని, ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పడంతో వారి ఆదేశాల మేరకు ఈఈతో సంతకాలు పెట్టించుకుని పనులు పూర్తిచేస్తున్నామని కమిషనర్ డీఈఈపై ఆరోపణలు చేశారు.అసలాయన ఉన్నారో లేదో తెలియని పరిస్థితి ఉందని చెబుతుండగా.. పక్కనే ఉన్న డీఈఈ భవానీశంకర్ ఒక్కసారిగా ఎదురుతిరిగారు. కమిషనర్ అక్రమాలకు తాను సహకరించడంలేదని, ఇలా అబద్ధాలు చెబుతున్నారంటూ డీఈఈ విరుచుకుపడ్డారు. కనకారావు వచ్చినప్పటి నుంచి పలు అక్రమాలు చోటుచేసుకున్నాయని, వాటికి తాను సహకరించకపోవడంతోనే తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రత్యారోపణ చేశారు. దీంతో వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఒక్కసారిగా కొట్లాటకు దిగారు. పరస్పరం కొట్టుకోవడంతో సమావేశంలో సభ్యులు అవాక్కయ్యారు. దీంతో కౌన్సిల్ సభ్యులు, మీడియా ప్రతినిధులు వారిని విడదీసి శాంతింపజేశారు. అనంతరం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు.డీఈఈపై సస్పెన్షన్ వేటు.. ఇక ఈ ఘటనలో డీఈఈ భవానీశంకర్‌ను సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. అధికారుల ఘర్షణకు సంబంధించి కాకినాడ ఆర్డీఓ ఇట్ల కిశోర్, మున్సిపల్ ఆర్డీ నాగ నరసింహారావు విచారణ నిర్వహించి కమిషనర్, డీఈఈలతో పాటు కార్యాలయ సిబ్బంది నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. అనంతరం వారి నివేదిక మేరకు డీఈఈ భవానీశంకర్‌ను సస్పెండ్ చేయాలని ఇంజినీర్ ఇన్ చీఫ్‌కు జిల్లా కలెక్టర్ సూచించడంతో శనివారం రాత్రి ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. -
అలా వదిలేశారేంటి?
ఆయన వస్తారని చెట్లకు, గోడలకు రంగులు పూశారు... రోడ్లపై పడిన గుంతల్లో క్రషర్ బుగ్గి కుమ్మరించారు... నెలల తరబడి రోడ్డు పక్కన పేరుకుపోయిన మట్టి దిబ్బలు తొలగించారు... కాలువల్లో పూడికలు తొలగించారు... అదే కాలువలపై పలకలు వేయించారు... ఇవే గాకుండా పాత రోడ్లపై కొత్త తారు వేయించేందుకు సంకల్పించటం... రోడ్ల మధ్య డివైడర్లలో మొక్కలు నాటించటంలాంటి పనులు చేపట్టేందుకు నిర్ణయించారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఈ నెల 14న జిల్లాకు రావాల్సిన ముఖ్యమంత్రి పర్యటన రద్దు అయిందన్న ప్రకటన అనంతరం చేపట్టిన పనులన్నీ ఎక్కడివి అక్కడే వదిలేశారు. ఇప్పుడవే పట్టణ ప్రజలకు ఇబ్బందులుగా మారాయి. విజయనగరం మున్సిపాలిటీ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాకు వస్తారని... ఆయన వద్ద మార్కులు కొట్టేయడానికి పట్టణంలో అభివృద్ధి పనుల పేరిట హడావుడి చేసిన యంత్రాంగం సీఎం పర్యటన రద్దు అనంతరం ఆ పనులను పట్టించుకోకుండా వదిలేయడం విమర్శలకు తావిస్తోంది. ముఖ్యమంత్రి వస్తేనే పనులు చేపడతారా అన్న ప్రశ్నలు పట్టణ ప్రజల నుంచి తలెత్తుతున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల ప్రగతి, ప్రజా సమస్యల పరిష్కారంపై పట్టించుకోని పాలకులు, అధికార యంత్రాం గం చంద్రబాబు పర్యటన ప్రకటన వెలువడినప్పటి నుంచి చేసిన హడావుడి చర్యలు చూసి పట్టణ ప్రజలే నిర్ఘాంత పోయారు. అర్ధంతరంగా ఆగిన రూ. 3కోట్ల పనులు ఎన్నడూ లేని విధంగా విజయనగరం మున్సిపాలిటీ చేపట్టే అభివృద్ధి పనుల కోసం రూ.3 కోట్లు నిధులు కేటాయించారు. ఈ నిధులతో కేవలం ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో పలు ఆర్భాటపు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా గల మీసేవా కేంద్రానికి బీటీ రోడ్డు నిర్మాణం నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలు ఇచ్చి జోరు వర్షంలో మమ అనిపించేశారు. ఇక ఎల్ఐసీ కార్యాలయం ఎదురుగా ఉన్న పెద్ద చెరువుకు గట్టు ఎక్కేందుకు మెట్ల మార్గం నిర్మాణం అసంపూర్తిగా వదిలేయగా... రామానాయుడు రోడ్డులో నాటేందుకు కడియం నుంచి తెచ్చిన మొక్కలు ఇప్పటికీ తవ్విన గుంతల పక్క నే పడి ఉన్నాయి. ఎత్తుబ్రిడ్జిపై సంతకాల వంతెనకు ఆనుకుని వేయతలపెట్టిన నూతన రోడ్డు నిర్మాణం పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. అవస్థలు పడుతున్న నగరవాసులు ఆర్అండ్బీ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులు మెటల్ వేసిన అనంతరం పట్టించుకోకపోవటం తో ఆ మార్గంలో ప్రయాణం నరకప్రాయంగా మారింది. నిత్యం వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగించే అంతర్రాష్ట్రీయ రహదారి కావటంతో వాహనాల తాకిడికి క్రషర్ ధూళి ఎగసిపడుతుండటం వాహనచోదకులకు ఇబ్బందికరంగా మారుతోంది. ఇదిలా ఉండగా ఎత్తుబ్రిడ్జి నుం చి ముఖ్యమంత్రి బస చేసే ప్రాంగణ సమీపం కలెక్టరేట్ జంక్షన్ వరకు గుంతలు పడిన రోడ్లలో వేసిన క్రషర్ బుగ్గి అప్పుడే తేలిపోయింది. నాలు గు రోజులుగా కురిసిన వర్షాలకు క్రషర్ బుగ్గి పోయి యథావిధిగా గుంతలు దర్శనమిస్తున్నాయి. చేపట్టిన పనులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా ఇదే అభివృద్ధి పనులపై ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకులు ప్రత్యక్షంగానే ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి ఒక్కపూట పర్యటన కోసం కేటాయించిన రూ. 3 కోట్లు నిధుల పనుల్లో భారీ అవినీతి దాగి ఉందని విమర్శిస్తున్నారు. కొద్ది పనులు పెండింగ్‌లో ఉన్నాయి ముఖ్యమంత్రి పర్యటన రద్దు అనంతరం కొద్ది పనులు ముగిసిపోయాయి. డివైడర్లలో మొక్కలు నాటేందుకు లేబర్ దొరకటం లేదు. పెద్ద చెరువు గట్టుపై నూతనంగా నిర్మించిన మెట్ల మార్గం అభివృద్ధి పనుల ప్రణాళిక మారటంతో పనులు నిలిపివేశాం. అచంటా గార్డెన్స్‌గా పిలుచుకుంటున్న గట్టును పూర్తి స్థాయిలో అభివృద్ధికి నిర్ణయించాం. ఇక ఎత్తుబ్రిడ్జిపై రోడ్డు పునఃనిర్మాణం పనులు, గుంతలు కప్పటం ఆర్అండ్బీ అధికారులు చూస్తున్నారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన పనులు రెండు మూడు రోజుల్లో పూర్తి చేస్తాం. – టి.వేణుగోపాల్, కమిషనర్, విజయనగరం మున్సిపాలిటీ -
నిర్లక్ష్యపు చీకటి–వెలుగులు
కంచరపాలెం : జీవీఎంసీ అధికారుల పనితీరు ప్రజలకు విసుగు తెప్పిస్తోంది. విద్యుత్ దీపాల నిర్వహణలో అంతులేని నిర్లక్ష్యం తలెత్తుతుండడంతో నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దానికి జీవీఎంసీ 36, 43 వార్డుల్లో అంతంతమాత్రంగానే ఉన్న వీధి దీపాల నిర్వహణే నిదర్శనం. కంచరపాలెం జోన్ పరిధిలో ట్రాన్స్‌కో అధికారులు మరమ్మతుల పేరిట కరెంట్ కోతలు విధిస్తూ అవస్థల పాలుచేస్తున్నారు. విద్యుత్ దీపాల నిర్వహణలో అధికారులు వైఖరిపై స్థానికులు మండిపడుతున్నారు. 36, 43 వార్డుల్లో.. జీవీఎంసీ 36, 43 వార్డుల్లో వీధి లైట్ల నిర్వహణపై జనం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 36వ వార్డులోని రెడ్డి కంచరపాలెం, శ్రీనగర్, గౌరీనగర్, దేవేంద్రనగర్ ప్రాంతాల్లో పగలూ రాత్రీ అనే తేడా లేకుండా రెండు వారాలుగా వీధి దీపాలు వెలుగుతుంటే.. అదే వార్డులో గొల్లకంచరపాలెం, తోటవీధి, దుర్గానగర్.. 43వ వార్డులోని మల్లసూరివీధి, గవర కంచరపాలెం, దయానంద్‌నగర్ ప్రాంతాల్లో నెల రోజులుగా చీకట్లు రాజ్యమేలుతున్నాయి. ఒకవైపు రాత్రుళ్లు వీధి లైట్లు వెలుగక స్థానికులు, వాహనచోదకులు నానా తంటాలు పడుతుంటే.. మరోవైపు పట్ట పగలు దీపాలు వెలుగుతూనే ఉన్నా.. సం బంధిత అధి కారులు వాటిపై దృష్టి సారించడం లేదు. ఈ స మస్యలపై వారికి ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేద నే ఆరోపణ లున్నాయి. జోన్–4 జోన ల్ కార్యాలయంలో నిర్వహిస్తు న్న ప్రజా వాణి కార్యక్రమానికి ఆయా వార్డుల్లోని సమస్యలపై అందిస్తున్న ఫిర్యాదుల పరిష్కారంలో అధి కారులు నిర్లక్ష్యం వహించడం తగదని ప్రజలు వాపోతున్నారు. మితిమీరుతున్న ఆకతాయిల ఆగడాలు.. ఆయా వీధుల్లో ఆకతాయిల ఆగడాలు నానాటికీ మితిమీరుతున్నాయి. మద్యం తాగి విద్యుత్తు దీపాలపై పడుతున్నారు. స్థానికంగా అందుబాటులో ఉంటున్న కనెక్షన్లను కలిపి పట్టపగలే విద్యుత్తు దీపాలను వెలిగిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. రాత్రిళ్లు మద్యం సీసాలతో విద్యుత్తు దీపాలను పగులగొడుతున్నా రు. దీనిపై పలుమార్లు అ« దికారులకు ఫిర్యాదు చేసి న ఫలితం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి ఆయా వార్డుల్లో నెలకొన్న వీధి లైట్ల సమస్యలను పరిష్కరించి, ఆకా తాయిల ఆగడాలకు అడ్డుకట్టు వేయాలని ప్రజలు కోరుతున్నారు. రాత్రిళ్లు ప్రయాణించలేం తోటవీధి నుంచి దుర్గానగర్ రహదారుల్లో ఆరు గంటలు దాటితే ఆందోళనగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఆకతాయిల ఆగడాలు రోజురోజుకూ శ్రుతిమించుతున్నాయి. ఆయా వీధుల్లో నెల రోజులుగా దీపాలు వెలగక ఇబ్బంది పడుతున్నాం. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి. – తంగేటి అప్పలరాజు, దుర్గానగర్ ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం నెల రోజులగా వీధి లైట్లు వెలగక నానా ఇబ్బంది పడుతున్నాం. మరికొన్ని కాలనీల్లో పట్ట పగలు దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. సమస్యపై జోనల్ కార్యాలయంలో ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు. జీవీఎంసీ విద్యుత్ దీపాల అధి కారులు స్పందించడం లేదు. – కాయిత రత్నాకర్, కంచరపాలెం, 36వ వార్డు -
పేదోడి బియ్యం పక్కదారి
కేటీదొడ్డి (గద్వాల) : పేదల కోసం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యం పక్కదారి పడుతోంది. రెవెన్యూ, విజిలెన్స్ పౌరసరపరా అధికారులు పక్కాగా తనిఖీలు నిర్వహించక పోవడంతో అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. గ్రామాల్లో రేషన్ బియ్యం దందా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. ఎవరైనా సమాచారం అందించినప్పుడు మాత్రమే అధికారులు దాడులు చేసి పట్టుకుంటున్నారు తప్పా స్వతహాగా గ్రామాల్లో తనిఖీలు చేపట్టడంలేదు. తాజాగా గద్వాల మండలం బీసీ కాలనీకి చెందిన మార్రెన్న, వీరేష్, జగదీష్‌లు మంగళవారం ర్యాలంపాడులో 23 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తక్కువ దరకు కొనుగోలు చేసి ఆటోలో కర్ణాటక రాష్ట్రం రాయచూర్‌కు తరలిస్తుండగా ఎస్ఐ భాగ్యలక్ష్మికి సమాచారం అందింది. ఈ మేరకు ఆమె ఏఎస్ఐ రషీద్, కానిస్టేబుల్ బాల్‌రెడ్డి, రెవెన్యూ అధికారులకు అప్రమత్తం చేశారు. వారు ఉదయం 5:30 గంటలకు కాపుకాసి పట్టుకున్నారు. అనంతరం బియ్యంతో పాటు ఆటోను స్వాధీనపరుచుకున్నారు. ఆర్ఐ రాజేష్, ఎన్పోర్స్మెంట్ డీటీ విజయ్‌కుమార్, వీఆర్ఓ ఆనంద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
కాసులు కురిపిస్తున్న ఇసుక రవాణా
ఖానాపూర్ : ఖానాపూర్ పట్టణంలోని పుష్కరఘాట్ ప్రాంతం నుంచి వారం రోజులుగా ఇసుక స్మగ్లర్లు ఇసుకను నిరంతరంగా తరలించుకుపోతున్నారు. నిర్భయంగా పట్టణంలోని ప్రదాన రహదారి గుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇసుకను ట్రాక్టర్లపై రవాణా చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. సంబంధిత అధికారులు ‘మామూలు’గా తీసుకోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఖానాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో సీసీరోడ్లు, డ్రైనేజీలు, ఆయా సాగునీటి కాలువల పనులు, ఇతరాత్ర నిర్మాణాల కోసం ఇసుకను అక్రమంగా తరలించుకుపోయి అందిన కాడికి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ నిర్మాణాల కోసమని కొందరు ప్రజలను పక్కదోవ పట్టిస్తూ ఇసుక దాందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు. ప్రభుత్వ పనులకు సంబంధించి అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇసుకను తరలించే అవకాశం ఉండదు. గత కొద్ది రోజులుగా ఖానాపూర్, పెంబి మండలాల్లోని పల్కేరువాగు, బల్లివాగు, కడెంవాగు, దొత్తివాగు, రిజర్వ్ ఫారెస్ట్‌ల నుంచి ఇసుకను తరలించిన ఇసుకాసురులు ఏకంగా పట్టణంలోనే ఈ దందాకు తెరలేపారు. అయినా సంబంధిత అదికారులు మాత్రం తమకేమీ పట్టదన్నట్లుగా వ్యవహరిస్తూండడం విమర్శలకు తావిస్తోంది. -
కబలిస్తున్న సారా
►అడ్వాలపల్లిలో అంతులేని శోకం ►మత్తులో చిత్తవుతున్న జీవితాలు ►సుమారు ముప్పై మంది మృతి ►దిక్కులేక రోడ్డునపడ్డ కుటుంబాలు ►కన్నెత్తి చూడని అధికారులు, నాయకులు ►మహమ్మారిని తరిమేందుకు చర్యలు శూన్యం మండలంలోని అడ్వాలపల్లి గ్రామాన్ని సారా రక్కసి కబలిస్తోంది. గిరిజనవాడలో చావుడప్పు మోగిస్తోంది. గ్రామంలో వందల సంఖ్యలో సారాకు బానిసలయ్యారు. పొద్దున ఇంటినుంచి బయటకెళ్లిన వ్యక్తి ఏ అర్ధరాత్రో జోగుతూ తిరిగిరావడం నిత్యకృత్యమైంది. దీంతో గ్రామంలో ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇప్పటికే ఈ గ్రామంలో ముప్పై మంది సారాకు బలికావడం ఆందోళన కలిగిస్తోంది. సారా వ్యసనం ఇలాగే కొసాగితే మరికొద్ది రోజుల్లో గ్రామంలోని పచ్చని కుటుంబాలు కుప్పకూలే ప్రమాదముంది. చదువు బంద్‌జేసిన మా నాన్న సారాయి తాగి అనారోగ్యంతో చనిపోయిండు. అప్పటినుంచి మాకు దిక్కులేకుండా అయ్యింది. నేను నాలుగో తరగతితో బడి మానేసిన. చదువుకోవాలని ఉన్నా.. పైసల్లేకు స్కూల్‌కు పోతలేను. అమ్మా, అన్నయ్య, నేను కూలికి పోతేనే పూట గడుస్తుంది. మా ఊర్లో నాలాంటి వాళ్లు చాలా మందే ఉన్నరు. - మందారపు రమ కూలిపని చేసి సదివిత్తాన నా భర్త సారాకు బానిసై ఎనిమిది నెలల క్రితం సచ్చిపోయిండు. నేను, నా ఇద్దరు పిల్లలను ఆగమైనం. కూలిపని చేసుకుంట బిడ్డను సదివిత్తాన. కొడుకు బడికి వెళ్లనంటుండు. చివరివరకు తోడుంటాడనుకున్న నా భర్త మమ్ములను అనాథలను చేసి వెళ్లిపోయిండు. దిక్కులేని మమ్ముల్ని సర్కారే ఆదుకోవాలే. - మందారపు శారద మల్హర్ : గ్రామాల్లో నాటుసారాను అరికట్టేం దుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామంటున్న ప్రజాప్రతినిధులు, అధికారులు మాట లు ఆచరణకు నోచుకోవడం లేదు. అడ్వాలపల్లిలో సారా కాటుకు పదుల సంఖ్యలో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నా ఒక్క రు కూడా ఇటువైపు తొంగిచూడడం లేదు. మండలంలోని మారుమూల గ్రామం అడ్వాలపల్లిలో ఎక్కువగా గిరిజన కుటుంబాలే నివాసం ఉంటున్నాయి. కూలీనాలీ చేసుకుని బతికే ఈ కుటుంబాల్లో చాలామంది పొద్దంతా పనిచేసి సాయంత్రం శారీరక శ్రమనుంచి కాస్త ఉపశమనం పొందేందుకు తాగుడు అలవాటైంది. అది క్రమంగా వ్యవసంగా మారి యువకులు, పెద్దలు, పలువురు మహిళలు సైతం దీనికి బానిసలయ్యారు. గ్రామంలోనే చవకగా సారా లభిస్తుండడంతో నిత్యం తాగి తూలుతున్నారు. ఈ క్రమంలో పలువురు కాయకష్టం చేసి సంపాదించిన డబ్బులను తాగుడుకే తగలేస్తున్నారు. కుటుంబాలను పట్టించుకోకపోవడంతో ఇళ్లలో గొడవలు నిత్యకృతమయ్యాయి. ఇంట్లో డబ్బులు లేని సందర్భాల్లో తిండిగింజలను సైతం పోసి తాగుతున్నారు. వీరి పిల్లలు పాలేర్లుగా, పశువులు, గొర్రెలకాపరులుగా బతుకు బండిని నడుపుతున్నారు. గ్రామంలో పది మంది ఆడపిల్లలు మినహా బడికి వెళ్లేవారు కనిపించడం లేదు. గ్రామంలో మొత్తం నలభై నాయక్‌పోడ్ కుటుంబాలు నివాసం ఉంటుండగా, ఇందులో ముప్పై కుటుంబాలు దిక్కులేనివి అయ్యాయి. ఒక్కో ఇంట్లో ఇద్దరేసి చనిపోయారు. ఇది ఇలాగే కొనసాగితే గ్రామంలో వితంతువులు, పిల్లలు మాత్రమే మిగిలే పరిస్థితి ఉంది. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ గ్రామాన్ని బాగు చేయడానికి ఎన్నడూ పూనుకున్నదిలేదు. సారాను అరికడుతామని చెప్పుకునే నేతలు, అధికారులు అడ్వాలపల్లిని ఒక్కసారి సందర్శించాల్సిన అవసరం ఉంది. పెద్ద దిక్కులేని కుటుంబాలను ఆదుకోని సారా రక్కసిని గ్రామం నుంచి తరిమేయాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. అందరూ సహకరించాలి గ్రామంలో చాలామంది సారాకు బాని సలై చనిపోయారు. మరణించిన వారి కుటుం బాలను, వారి పిల్లలను చూసైనా సారా తయారీదారులు మారాలి. సారాను వదిలేసి ఇతర పనులు చూసుకోవాలి. ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తువీడి సారాను ఆరికట్టాలి. లేదంటే కొద్ది రోజుల్లో ఊర్లో మగమనిషి కనిపించకుండా అవుతుంది. -అడ్వాల మహేష్, ఉపసర్పంచ్ -
కబలిస్తున్న సారా
అడ్వాలపల్లిలో అంతులేని శోకం మత్తులో చిత్తవుతున్న జీవితాలు సుమారు ముప్పై మంది మృతి దిక్కులేక రోడ్డునపడ్డ కుటుంబాలు కన్నెత్తి చూడని అధికారులు, నాయకులు మహమ్మారిని తరిమేందుకు చర్యలు శూన్యం మండలంలోని అడ్వాలపల్లి గ్రామాన్ని సారా రక్కసి కబలిస్తోంది. గిరిజనవాడలో చావుడప్పు మోగిస్తోంది. గ్రామంలో వందల సంఖ్యలో సారాకు బానిసలయ్యారు. పొద్దున ఇంటినుంచి బయటకెళ్లిన వ్యక్తి ఏ అర్ధరాత్రో జోగుతూ తిరిగిరావడం నిత్యకృత్యమైంది. దీంతో గ్రామంలో ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇప్పటికే ఈ గ్రామంలో ముప్పై మంది సారాకు బలికావడం ఆందోళన కలిగిస్తోంది. సారా వ్యసనం ఇలాగే కొసాగితే మరికొద్ది రోజుల్లో గ్రామంలోని పచ్చని కుటుంబాలు కుప్పకూలే ప్రమాదముంది. చదువు బంద్‌జేసిన మా నాన్న సారాయి తాగి అనారోగ్యంతో చనిపోయిండు. అప్పటినుంచి మాకు దిక్కులేకుండా అయ్యింది. నేను నాలుగో తరగతితో బడి మానేసిన. చదువుకోవాలని ఉన్నా.. పైసల్లేకు స్కూల్‌కు పోతలేను. అమ్మా, అన్నయ్య, నేను కూలికి పోతేనే పూట గడుస్తుంది. మా ఊర్లో నాలాంటి వాళ్లు చాలా మందే ఉన్నరు. - మందారపు రమ కూలిపని చేసి సదివిత్తాన నా భర్త సారాకు బానిసై ఎనిమిది నెలల క్రితం సచ్చిపోయిండు. నేను, నా ఇద్దరు పిల్లలను ఆగమైనం. కూలిపని చేసుకుంట బిడ్డను సదివిత్తాన. కొడుకు బడికి వెళ్లనంటుండు. చివరివరకు తోడుంటాడనుకున్న నా భర్త మమ్ములను అనాథలను చేసి వెళ్లిపోయిండు. దిక్కులేని మమ్ముల్ని సర్కారే ఆదుకోవాలే. - మందారపు శారద మల్హర్ : గ్రామాల్లో నాటుసారాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామంటున్న ప్రజాప్రతినిధులు, అధికారులు మాట లు ఆచరణకు నోచుకోవడం లేదు. అడ్వాలపల్లిలో సారా కాటుకు పదుల సంఖ్యలో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నా ఒక్క రు కూడా ఇటువైపు తొంగిచూడడం లేదు. మండలంలోని మారుమూల గ్రామం అడ్వాలపల్లిలో ఎక్కువగా గిరిజన కుటుంబాలే నివాసం ఉంటున్నాయి. కూలీనాలీ చేసుకుని బతికే ఈ కుటుంబాల్లో చాలామంది పొద్దంతా పనిచేసి సాయంత్రం శారీరక శ్రమనుంచి కాస్త ఉపశమనం పొందేందుకు తాగుడు అలవాటైంది. అది క్రమంగా వ్యవసంగా మారి యువకులు, పెద్దలు, పలువురు మహిళలు సైతం దీనికి బానిసలయ్యారు. గ్రామంలోనే చవకగా సారా లభిస్తుండడంతో నిత్యం తాగి తూలుతున్నారు. ఈ క్రమంలో పలువురు కాయకష్టం చేసి సంపాదించిన డబ్బులను తాగుడుకే తగలేస్తున్నారు. కుటుంబాలను పట్టించుకోకపోవడంతో ఇళ్లలో గొడవలు నిత్యకృతమయ్యాయి. ఇంట్లో డబ్బులు లేని సందర్భాల్లో తిండిగింజలను సైతం పోసి తాగుతున్నారు. వీరి పిల్లలు పాలేర్లుగా, పశువులు, గొర్రెలకాపరులుగా బతుకు బండిని నడుపుతున్నారు. గ్రామంలో పది మంది ఆడపిల్లలు మినహా బడికి వెళ్లేవారు కనిపించడం లేదు. గ్రామంలో మొత్తం నలభై నాయక్‌పోడ్ కుటుంబాలు నివాసం ఉంటుండగా, ఇందులో ముప్పై కుటుంబాలు దిక్కులేనివి అయ్యాయి. ఒక్కో ఇంట్లో ఇద్దరేసి చనిపోయారు. ఇది ఇలాగే కొనసాగితే గ్రామంలో వితంతువులు, పిల్లలు మాత్రమే మిగిలే పరిస్థితి ఉంది. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ గ్రామాన్ని బాగు చేయడానికి ఎన్నడూ పూనుకున్నదిలేదు. సారాను అరికడుతామని చెప్పుకునే నేతలు, అధికారులు అడ్వాలపల్లిని ఒక్కసారి సందర్శించాల్సిన అవసరం ఉంది. పెద్ద దిక్కులేని కుటుంబాలను ఆదుకోని సారా రక్కసిని గ్రామం నుంచి తరిమేయాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. అందరూ సహకరించాలి గ్రామంలో చాలామం ది సారాకు బాని సలై చనిపోయారు. మరణించిన వారి కుటుం బాలను, వారి పిల్లలను చూసైనా సారా తయారీదారులు మారాలి. సారాను వదిలేసి ఇతర పనులు చూసుకోవాలి. ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తువీడి సారాను ఆరికట్టాలి. లేదంటే కొద్ది రోజుల్లో ఊర్లో మగమనిషి కనిపించకుండా అవుతుంది. -అడ్వాల మహేష్, ఉపసర్పంచ్ -
అధికారుల నిర్లక్ష్యంతోనే పేలుడు
నగరం(మామిడికుదురు) :గ్యాస్ లీకేజికి నీటి పైపులైన్ తరహాలో సిమెంట్ పూస్తే ఆగుతుందా అని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ ప్రశ్నించారు. ‘అధికారుల నిర్లక్ష్యం వల్లే గ్యాస్ పైపులైన్ పేలిపోయింది. ఈ పేలుడు ఘటనకు ముమ్మాటికీ అధికారుల అసమర్థతే కారణం. దీనిపై పార్టీ తరఫున ఢిల్లీ స్థాయిలో పోరాటం చేస్తాం’ అని పేర్కొన్నారు. మంగళవారం ఆయన పైపులైన్ పేలుడు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. కాలిపోయిన గృహాలను, కొబ్బరి చెట్లను పరిశీలించి, మృతుల కుటుంబాలను పరామర్శించారు. గెయిల్ అధికారులతో మాట్లాడేందుకు ప్రయత్నించగా, అక్కడెవరూ అందుబాటులో లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. గ్యాస్ లీకేజిపై స్థానికులు ఎంతగా మొత్తుకున్నా పట్టించుకోలేదంటే అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో అవగతమవుతోందన్నారు. హై పవర్ కమిటీ విచారణ వల్ల ప్రయోజనం లేదని, సీబీఐతో విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఓఎన్జీసీ, గెయిల్ కార్యాలయాలను జనావాసాలకు దూరంగా సముద్ర తీరానికి తరలించాలని డిమాండ్ చేశారు. నిప్పుల కుంపటిపై బతుకీడుస్తున్నట్టుగా కోనసీమ ప్రజల పరిస్థితి తయారైందన్నారు. దీనిపై ఢిల్లీ స్థాయిలో పోరాటం చేస్తామని పునరుద్ఘాటించారు. ఆయన వెంట రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు, సీపీఐ నాయకులు మీసాల సత్యనారాయణ, మధు, పి.హరినాథరెడ్డి, కిర్ల కృష్ణారావు, దేవ రాజేంద్రప్రసాద్, చెల్లుబోయిన కేశవశెట్టి, పిచ్చుక గంగాధర్ ఉన్నారు. ‘విస్ఫోటం’పై సీబీఐ విచారణ జరపాలి గ్యాస్ పైపులైన్ పేలుడు సంఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం నగరం గ్రామంలో రాస్తారోకో చేశారు. స్థానిక గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్ (జీసీఎస్) ఎదురుగా 216 జాతీయ రహదారిపై పార్టీ నాయకులు బైఠాయించి గెయిల్, ఓఎన్‌జీసీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, ప్ర మాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.50 లక్షలు, క్షతగాత్రులకు రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేలు డు దుర్ఘటనపై సీబీఐ విచారణ జరపాలన్నారు. గెయిల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. అధికారుల సస్పెన్షన్‌తో ఆగిపోకుండా వెంటనే వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కిమ్స్‌లో క్షతగాత్రులకు పరామర్శ అమలాపురం రూరల్ : గెయిల్ పైపులైన్ ఏర్పాటులో ప్రమాణాలు పాటించకపోవడం వల్లే నగరం ఘటన జరిగిందని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు. నగరం ఘటనలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలపై కిమ్స్ వైద్యులను ఆరా తీశారు.