లైట్లు వెలగక చీకటిమయమైన తోటవీధి ప్రాంతం, రెడ్డికంచరపాలెంలో పగలు వెలుగులు విరజిమ్ముతున్న వీధి లైటు
కంచరపాలెం : జీవీఎంసీ అధికారుల పనితీరు ప్రజలకు విసుగు తెప్పిస్తోంది. విద్యుత్ దీపాల నిర్వహణలో అంతులేని నిర్లక్ష్యం తలెత్తుతుండడంతో నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దానికి జీవీఎంసీ 36, 43 వార్డుల్లో అంతంతమాత్రంగానే ఉన్న వీధి దీపాల నిర్వహణే నిదర్శనం. కంచరపాలెం జోన్ పరిధిలో ట్రాన్స్‌కో అధికారులు మరమ్మతుల పేరిట కరెంట్ కోతలు విధిస్తూ అవస్థల పాలుచేస్తున్నారు. విద్యుత్ దీపాల నిర్వహణలో అధికారులు వైఖరిపై స్థానికులు మండిపడుతున్నారు.
36, 43 వార్డుల్లో..
జీవీఎంసీ 36, 43 వార్డుల్లో వీధి లైట్ల నిర్వహణపై జనం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 36వ వార్డులోని రెడ్డి కంచరపాలెం, శ్రీనగర్, గౌరీనగర్, దేవేంద్రనగర్ ప్రాంతాల్లో పగలూ రాత్రీ అనే తేడా లేకుండా రెండు వారాలుగా వీధి దీపాలు వెలుగుతుంటే.. అదే వార్డులో గొల్లకంచరపాలెం, తోటవీధి, దుర్గానగర్.. 43వ వార్డులోని మల్లసూరివీధి, గవర కంచరపాలెం, దయానంద్‌నగర్ ప్రాంతాల్లో నెల రోజులుగా చీకట్లు రాజ్యమేలుతున్నాయి. ఒకవైపు రాత్రుళ్లు వీధి లైట్లు వెలుగక స్థానికులు, వాహనచోదకులు నానా తంటాలు పడుతుంటే.. మరోవైపు పట్ట పగలు దీపాలు వెలుగుతూనే ఉన్నా.. సం బంధిత అధి కారులు వాటిపై దృష్టి సారించడం లేదు. ఈ స మస్యలపై వారికి ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేద నే ఆరోపణ లున్నాయి. జోన్–4 జోన ల్ కార్యాలయంలో నిర్వహిస్తు న్న ప్రజా వాణి కార్యక్రమానికి ఆయా వార్డుల్లోని సమస్యలపై అందిస్తున్న ఫిర్యాదుల పరిష్కారంలో అధి కారులు నిర్లక్ష్యం వహించడం తగదని ప్రజలు వాపోతున్నారు.
మితిమీరుతున్న ఆకతాయిల ఆగడాలు..
ఆయా వీధుల్లో ఆకతాయిల ఆగడాలు నానాటికీ మితిమీరుతున్నాయి. మద్యం తాగి విద్యుత్తు దీపాలపై పడుతున్నారు. స్థానికంగా అందుబాటులో ఉంటున్న కనెక్షన్‌లను కలిపి పట్టపగలే విద్యుత్తు దీపాలను వెలిగిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. రాత్రిళ్లు మద్యం సీసాలతో విద్యుత్తు దీపాలను పగులగొడుతున్నా రు. దీనిపై పలుమార్లు అ« దికారులకు ఫిర్యాదు చేసి న ఫలితం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి ఆయా వార్డుల్లో నెలకొన్న వీధి లైట్ల సమస్యలను పరిష్కరించి, ఆకా తాయిల ఆగడాలకు అడ్డుకట్టు వేయాలని ప్రజలు కోరుతున్నారు.
రాత్రిళ్లు ప్రయాణించలేం
తోటవీధి నుంచి దుర్గానగర్ రహదారుల్లో ఆరు గంటలు దాటితే ఆందోళనగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఆకతాయిల ఆగడాలు రోజురోజుకూ శ్రుతిమించుతున్నాయి. ఆయా వీధుల్లో నెల రోజులుగా దీపాలు వెలగక ఇబ్బంది పడుతున్నాం. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి. – తంగేటి అప్పలరాజు, దుర్గానగర్
ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం
నెల రోజులగా వీధి లైట్లు వెలగక నానా ఇబ్బంది పడుతున్నాం. మరికొన్ని కాలనీల్లో పట్ట పగలు దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. సమస్యపై జోనల్ కార్యాలయంలో ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు. జీవీఎంసీ విద్యుత్ దీపాల అధి కారులు స్పందించడం లేదు. – కాయిత రత్నాకర్, కంచరపాలెం, 36వ వార్డు
Comments
Please login to add a commentAdd a comment