Ration rice misleading
-
పేదల బియ్యంతో కోట్లకు పడగ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రేషన్ బియ్యం దందా ఓ మాఫియాగా తయారైంది. గ్రామాలు, పట్టణాల్లోని బస్తీల నుంచి సేకరించే బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటించాలన్నా, రైస్ మిల్లులకు చేరవేయాలన్నా.. జిల్లాల స్థాయిలో కొందరు వ్యక్తులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. రెండు దశాబ్దాల క్రితం పట్టణ స్థాయిలో రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి, కమీషన్ మీద అమ్ముకునే చిరుదందా సాగించిన ఓ వ్యక్తి ఇప్పుడు ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలను శాసించే బియ్యం లీడర్‌గా మారితే, రైస్ మిల్లులో పార్టనర్‌గా చేరి, ఆ రైస్ మిల్లుతో పాటు పలు ఇతర మిల్లులకు రేషన్ బియ్యం రీసైక్లింగ్ కోసం తరలించే లీడర్‌గా మరో వ్యక్తి మారి దందా సాగిస్తున్నారు. హైదరాబాద్ పక్కనున్న ఓ పారిశ్రామిక జిల్లాలో రేషన్ డీలర్ స్థాయి నుంచి డీలర్ల సంఘానికే నాయకుడిగా ఎదిగిన మరో వ్యక్తి.. రేషన్ బియ్యాన్ని యథేచ్ఛగా కర్ణాటకకు తరలిస్తున్నాడు. ఇలా ప్రతి ఉమ్మడి జిల్లాలో కనీసం ఇద్దరు చొప్పున రేషన్ బియ్యం దందా సాగించే ‘లీడర్లు’రాష్ట్ర పౌరసరఫరాల శాఖ పంపిణీ చేస్తున్న పేదల బియ్యానికి సవాల్ విసురుతున్నారు. ప్రతి నెలా రూ. వందల కోట్ల విలువైన పీడీఎస్ బియ్యాన్ని నల్లబజారుకు తరలిస్తూ ఈ దళారులు కోట్లు కొల్లగొడుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి సహా పాత 10 జిల్లాల్లో కనీసంగా 20 మంది వ్యక్తులు ఈ బియ్యం దందాతో రూ. కోట్లు కూడబెట్టారని తెలుస్తోంది. లక్షల్లో మామూళ్లు .. రేషన్ బియ్యం పక్కదారి పట్టడంలో అన్ని ప్రధాన ప్రభుత్వ శాఖల అధికారుల పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టకుండా చూడాల్సిన పౌరసరఫరాల శాఖలోని జిల్లా స్థాయి అధికారుల నుంచి ఎన్ఫోర్స్మెంట్ విభాగంలోని వివిధ హోదాల్లో ఉన్న వారి వరకు బియ్యం దందా సాగించే వారికి సహకారం అందిస్తున్నట్లు భావిస్తున్నారు. కాగా, మామూళ్లు ఇవ్వలేని గ్రామ, మండల స్థాయిలోని ఆటో ట్రాలీలను అప్పుడప్పుడు సీజ్ చేసి అధికారులు కంటితుడుపు చర్యలు తీసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. రెవెన్యూ అధికారులతోపాటు బియ్యం వాహనాలు రాష్ట్ర సరిహద్దులు దాటే మార్గంలో ఉన్న అన్ని పోలీస్స్టేషన్లను ఈ వ్యాపారులు మేనేజ్ చేస్తున్నట్లు సమాచారం. కాగా, బియ్యం వ్యాపారులను బ్లాక్మెయిల్ చేసే మరికొందరికి కూడా ఏనెలకు ఆనెల ఠంచన్‌గా మామూళ్లు ముడతాయని తెలుస్తోంది. మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి మొదలైన జిల్లాల నుంచి సిరోంచకు బియ్యం రవాణా చేసే ఓ ‘వీరుడు’మామూళ్ల కిందనే నెలకు రూ.10 లక్షలకు పైగా ముట్ట చెపుతాడంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇతనిపై 12 కేసుల వరకు ఉన్నాయి. ఈ వ్యక్తి కాళేశ్వరం, కరీంనగర్, హైదరాబాద్‌లలో ఆస్తులు సంపాదించే స్థాయిలో బియ్యం దందా సాగిస్తున్నాడు. ఆసిఫాబాద్ రెబ్బెనకు చెందిన మరో ‘కిరణం’మీద 22 కేసులు ఉన్నప్పటికీ, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ చుట్టుపక్కల మండలాల నుంచి బియ్యం సేకరించి బల్లార్షా ప్రాంతంలోని వీరూర్‌కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్‌కు చెందిన ఓ రైస్ మిల్లు భాగస్వాములు పీడీఎస్ బియ్యం దందాలో రాష్ట్రంలోనే కీలకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సంగారెడ్డి జిల్లా నుంచి కర్ణాటకకు.. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ రేషన్ దుకాణం యజమాని సంఘం నాయకుడిగా చలామణి అవుతూ పెద్ద ఎత్తున దందా సాగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇతను హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన దందా సాగిస్తూ ‘రాజు’గా వెలిగిపోతున్నాడు. ఈ నాయకుడు తను దందా చేయడమే గాక, బియ్యం దందా సాగించే కొందరు రేషన్ డీలర్లకు అండగా ఉంటున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ జిల్లాల నుంచి సేకరించిన బియ్యాన్ని కర్ణాటక సరిహద్దులు దాటిస్తూ కోట్లకు పడగలెత్తినట్లు ఆరోపణలున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రేషన్ బియ్యం దందాకు మిల్లర్లతో పాటు అధికార పార్టీ నాయకుల అండ ఉన్నట్లు చెపుతున్నారు. మహబూబ్‌నగర్, గద్వాల ప్రాంతంలోని నలుగురు ముఖ్యమైన వ్యక్తులు మక్తల్, నారాయణపేట మీదుగా కర్ణాటకకు బియ్యాన్ని తరలిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో రీసైక్లింగ్‌కే ఎక్కువ నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా రేషన్ బియ్యం దందా సాగించడంలో రైస్‌మిల్లర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. గ్రామాల్లో రేషన్ డీలర్లతోపాటు కొంతమంది ఏజెంట్లు పేదల నుంచి బియ్యాన్ని కొనుగోలు చేసి మహారాష్ట్రకు కొంత మేర తరలిస్తుండగా భారీ ఎత్తున రైస్‌మిల్లులకు చేరవేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ఓ ఎమ్మెల్యేతోపాటు కీలకమైన ఓ రైస్‌మిల్లర్ హస్తముందనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో పండిస్తున్న సన్నరకాలను రైస్‌మిల్లర్లు ఏ గ్రేడ్ రకం కింద సేకరిస్తూ, బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. వాటి స్థానంలో ఏజెంట్లు, రేషన్‌డీలర్ల ద్వారా సేకరించిన ప్రజా పంపిణీ బియ్యాన్ని లెవీ కింద తిరిగి ఎఫ్‌సీఐకి అప్పగిస్తున్నారని తెలుస్తోంది. రైస్‌మిల్లుల ద్వారా ఎఫ్‌సీఐకి, అక్కడి నుంచి రేషన్‌షాపులకు, లబ్ధిదారులకు చేరుతుండగా, తిరిగి వారి నుంచి ఏజెంట్ల ద్వారా మళ్లీ రైస్‌మిల్లులకే చేరుతుండడం గమనార్హం. మహబూబాబాద్‌లో ప్రజా ప్రతినిధి అండతో.. మహబూబాబాద్ పట్టణంలోని ఇల్లందు క్రాస్ రోడ్ వద్ద ఉన్న మిల్లు, మరిపెడ మండలంలోని మరో రైస్ మిల్‌తో పాటు తొర్రూరు, కొత్తగూడ, కేసముద్రం కేంద్రాలుగా రేషన్ బియ్యం దందా సాగుతోందన్న ఆరోపణలున్నాయి. సివిల్ సప్లై శాఖలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఓ అధికారి ఈ వ్యవహారాన్ని చక్కబెడుతూ వాటాలు నిర్ణయించి.. దందా సాఫీగా సాగేలా చూస్తున్నాడని తెలుస్తోంది. పీడీఎస్ డీలర్ల ద్వారా పేదల నుంచి కిలో ఐదు రూపాయల నుంచి పది రూపాయల వరకు కొనుగోలు చేసి మామిడి తోటలు, రైస్ మిల్లులు, గోదాముల్లో దాచిపెడుతూ ఆ బియ్యాన్ని సీఎంఆర్ రూపంలో ఎఫ్‌సీఐకి అప్పగిస్తున్నారని ఆరోపణలున్నాయి. మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ ప్రజా ప్రతినిధి హస్తం ఈ దందాలో ఉన్నట్లు ఆరోపణలున్నాయి. -
‘రేషన్ మంత్రి’ ఇలాకాలోనే రీసైక్లింగ్
సాక్షి, అమరావతి బ్యూరో: పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గం కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ దందా విచ్చలవిడిగా సాగుతోంది.టీడీపీ అధికారంలోకి వచ్చాక రేషన్ బియ్యం అక్రమ రవాణాకు కేరాఫ్ అడ్రస్‌గా చిలకలూరిపేట మారింది. మంత్రి కనుసన్నల్లోనే ఈ దోపిడీ సాగుతుండటంతో అధికారులు సైతం ఏమి చేయలేక చేతులెత్తేస్తున్నారు. రోజుకు సరాసరిన ఈ నియోజక వర్గం నుంచి భారీగా రేషన్ బియ్యాన్ని కాకినాడ పోర్ట్‌కు తరలిస్తున్నట్లు సమాచారం. అక్కడనుంచి విదేశాలకు తరలిస్తున్నారు. ఎన్నికలు ముగిశాక అధికారులు రేషన్ మాఫియాపై దృష్టి సారించారు. వివిధ జిల్లాల బియ్యం ఇక్కడనుంచే.... ఇటీవల చిలకలూరిపేట నియోజకవర్గంలో వారం వ్యవధిలోనే పెద్ద ఎత్తున రేషన్ బియ్యం పట్టుబడటం గమనార్హం. ఈ నెల 6వ తేదీన చిలకలూరిపేట మండలం మానుకొండువారిపాలెంలో 3,245 క్వింటాళ్ల బియ్యం, యడ్లపాడు మండలం కొత్తసొలసలో ఈ నెల 12వ తేదీన 164 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని, మిల్లులు, గోడౌన్లో పౌరసరఫరాల అధికారులు పట్టుకొన్నారు. గతంలో పలు మార్లు ఇక్కడే పట్టుబడటం విశేషం. చిలకలూరిపేట మండలం గణపవరంలో రేషన్ బియ్యం అక్రమ దందా సాగుతున్నట్లు తెలుస్తోంది. పక్కనే ఉన్న ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కాకుమాను మండలంలో సైతం ఇటీవల ఓ మిల్లులో రేషన్ బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. మొత్తం మీద చిలకలూరిపేట నియోజకవర్గం గుంటూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దులో ఉండటంతో రెండు జిల్లాలతోపాటు ఇతర జిల్లాల నుంచి రేషన్ బియ్యం ఇక్కడికి తరలించి రీసైక్లింగ్ చేసి, బియ్యాన్ని ప్లాస్టిక్ సంచుల్లోకి మార్చి కాకినాడ పోర్ట్‌కు తరలించి, అక్కడ నుంచి విదేశాలకు తరలిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ రెండు జిల్లాల నుంచి కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి రేషన్ బియ్యాన్ని చిలకలూరిపేటలోని రేషన్ బియ్యం డంపింగ్ కేంద్రాలకు తరలిస్తున్నట్లు భోగట్టా. గతంలో ఈ ముఠాలకు మంత్రి అండ ఉండటంతో, అధికారులు సైతం ఏమీ చేయలేకపోయారు. ఎన్నికలు ముగిశాక రేషన్ అక్రమ రవాణాపై భారీ ఎత్తున ఫిర్యాదులు రావటంతో, పౌరసరఫరాల శాఖ అధికారులు అక్రమ దందాపై దృష్టి సారించారు. అధికారులు రేషన్ బియ్యం డంపులపై దాడులు చేసినప్పుడు అధికారులపై మంత్రి ఒత్తిడి తీసుకొస్తున్నట్లు పౌరసరఫరాల ఉన్నతాధికారుల్లోనే చర్చ సాగుతోంది. అక్రమ దందా ఇలా... రేషన్ డీలర్లు, కార్డు దారులనుంచి కిలో రూ.7 చొప్పున కొనుగోలు చేసి, చిలకలూరిపేట నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ఉన్న డంపింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. అక్కడ బియ్యాన్ని ప్లాస్టిక్ సంచుల్లోకి మార్చుతారు. ఆ తరువాత మిల్లులో రీ సైక్లింగ్ చేసి చక్కగా ప్యాక్ చేసి కొంతమేర రాష్ట్రంలోనే కిలో రూ.20 నుంచి రూ.25లకు విక్రయిస్తారు. ఎక్కువ మొత్తంలో చెక్ పోస్టుల వద్ద మేనేజ్ చేసి, కాకినాడ సమీపంలోని మిల్లులకు తరలించి, అక్కడి నుంచి వారి బిల్లులతో కాకినాడ పోర్ట్‌కు తరలిస్తారు. -
పేదోడి బియ్యం పక్కదారి
కేటీదొడ్డి (గద్వాల) : పేదల కోసం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యం పక్కదారి పడుతోంది. రెవెన్యూ, విజిలెన్స్ పౌరసరపరా అధికారులు పక్కాగా తనిఖీలు నిర్వహించక పోవడంతో అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. గ్రామాల్లో రేషన్ బియ్యం దందా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. ఎవరైనా సమాచారం అందించినప్పుడు మాత్రమే అధికారులు దాడులు చేసి పట్టుకుంటున్నారు తప్పా స్వతహాగా గ్రామాల్లో తనిఖీలు చేపట్టడంలేదు. తాజాగా గద్వాల మండలం బీసీ కాలనీకి చెందిన మార్రెన్న, వీరేష్, జగదీష్‌లు మంగళవారం ర్యాలంపాడులో 23 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తక్కువ దరకు కొనుగోలు చేసి ఆటోలో కర్ణాటక రాష్ట్రం రాయచూర్‌కు తరలిస్తుండగా ఎస్ఐ భాగ్యలక్ష్మికి సమాచారం అందింది. ఈ మేరకు ఆమె ఏఎస్ఐ రషీద్, కానిస్టేబుల్ బాల్‌రెడ్డి, రెవెన్యూ అధికారులకు అప్రమత్తం చేశారు. వారు ఉదయం 5:30 గంటలకు కాపుకాసి పట్టుకున్నారు. అనంతరం బియ్యంతో పాటు ఆటోను స్వాధీనపరుచుకున్నారు. ఆర్ఐ రాజేష్, ఎన్పోర్స్మెంట్ డీటీ విజయ్‌కుమార్, వీఆర్ఓ ఆనంద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
రేషన్ బొక్కేశారు!
డీలర్లు, అధికారుల మాయాజాలం జనాభా కంటే అధికంగా బియ్యం యూనిట్ల పంపిణీ ఒక్కో డీలర్‌కు 50 నుంచి 100 క్వింటాళ్లు అదనం అభాసుపాలవుతున్న ‘ఆహారభద్రత’ పరిగి : అవినీతిపై యుద్ధం చేద్దామంటోంది ప్రభుత్వం. ఎవరైనా అధికారి చేయిచాపితే ఫోన్ చేయండంటూ టోల్‌ఫ్రీ నంబర్లు సైతం ఇచ్చేస్తోంది. ప్రభుత్వం ఇంత హడావుడి చేస్తున్నా.. కిందిస్థాయి సిబ్బందిలో మాత్రం ఇసుమంత మార్పు కూడా కన్పించడం లేదు. ముఖ్యంగా రేషన్ పంపిణీలో అందినకాడికి బొక్కేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ఆహారభద్రత పథకంలో భాగంగా పంపిణీచేసిన రేషన్‌లో భారీ కుంభకోణమే జరిగింది. అంతా కూడబలుక్కుని వేల క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించారు. పరిగి నియోజకవర్గంలో ఒక్కో డీలర్‌కు 50 నుంచి 100 క్వింటాళ్ల బియ్యం వరకు ఎక్కువగా పంపిణీ అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అధికారుల అండదండలతోనే డీలర్లు ఈ కుంభకోణానికి తెరతీసినట్లు స్పష్టమవుతోంది. ఆహార భద్రత కార్డుల కోసం చేసుకున్న దరఖాస్తుల్లో మండలాలవారీగా 30 నుంచి 40 శాతం వరకు విచారణలో తొలగించినట్లు చూపిస్తున్న అధికారులు.. పంపిణీ చేసిన బియ్యం యూనిట్లు మాత్రం ఆ మండల జనాభా కంటే ఎక్కువ ఉన్నాయి. ఇదే రేషన్ బియ్యం బొక్కేశారనేందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. పథకం ప్రారంభ నెలలోనే ఈ తంతు జరిగితే ఇక మున్ముందు పరిస్థితేంటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 60 వేల యూనిట్లు అదనంగా పంపిణీ పరిగి నియోజకవర్గంలో 2011 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం జనాభా 2,96,750. గత నాలుగేళ్లుగా మరో 40వేల జనాభా పెరిగి ఉంటుందని అంచనా. ఆహార భద్రత కార్డులకోసం ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించడంతో.. తమకు ఎలాగూ కార్డులు రావని ఐదు శాతం మంది దరఖాస్తులు చేసుకోలేదు. వచ్చిన దరఖాస్తుల్లోంచి 35 నుంచి 40 శాతం వరకు విచారణలో అధికారులు తొలగించారు. దీంతో సరాసరిగా జనాభాలో 60 నుంచి 70 శాతం మందికి బియ్యం ఇవ్వాల్సి ఉంటుంది. చివరకు 35 శాతం మంది దరఖాస్తులు కట్ చేసినట్లు భావించినా నియోజకవర్గంలో 90 వేల యూనిట్లకు బియ్యం కట్ అవుతుంది. ఈ లెక్కన 2.5 లక్షల మందికి బియ్యం సరఫరా చేయాల్సి ఉంటుంది. కానీ అధికారులు జనవరిలో ఏకంగా 3,06,627 యూనిట్లకు బియ్యం పంపిణీ చేశారు. ఈ లెక్కన సుమారుగా 55 వేల నుంచి 60 వేల యూనిట్ల బియ్యం అదనంగా సరఫరా చేశారని స్పష్టమవుతోంది. అంటే 3,600 క్వింటాళ్ల బియ్యం అదనంగా సరఫరా అయిందన్నమాట. ఈ లెక్కన రూ.2వేల క్వింటాళ్లు అయినా.. మొత్తం రూ.72 లక్షల అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. ఒక్క పరిగి మండలంలో మాత్రమే జనాభా కంటే తక్కువ యూనిట్ల బియ్యం సరఫరా చేయగా.. మిగతా అన్ని మండలాల్లో జనాభా కంటే అధిక యూనిట్ల బియ్యం పంపిణీ చేసినట్టు ఉండడం గమనార్హం. మండలాల వారీగా పంపిణీ చేసిన బియ్యం.. మండలం జనాభా పంపిణీ చేసిన బియ్యం (క్వింటాళ్లలో) యూనిట్లు.. పరిగి 62,984 3,566 59,207 దోమ 48,224 3,255 54,250 కుల్కచర్ల 70,281 4,319 71,569 పూడూరు 44,884 3,012 48,153 గండేడ్ 70,377 5,205 73,448 మొత్తం 2,96,750 19,357 3,06,627