విటమిన్ స్నానం
బ్యూటిప్స్
జుట్టు పొడవుగా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. అందుకోసం చేయని ప్రయత్నాలు ఉండవు. అలాంటి వారు తలకు రాసుకునే కొబ్బరి నూనెను కొద్దిగా వేడి చేసి అందులో ఒక విటమిన్-ఇ టాబ్లెట్‌ను వేయాలి. ఆ నూనెను రాత్రి నిద్రపోయే ముందు మాడుకు, జుట్టుకు బాగా రాసుకొని ఉదయాన్నే కుంకుడు రసంతో తల స్నానం చేస్తే సరి. కొద్ది రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది.
{Mీములు, రకరకాల సబ్బులు వాడినా మొటిమలు తగ్గట్టేదని బాధ పడేవారు ఈ చిట్కా వాడి మంచి ఫలితాన్ని పొందండి. అందుకు వేరుశనగ(పల్లి) నూనె, నిమ్మరసం సమపాళ్లలో కలుపుకోవాలి. ఆ మిశ్రమంతో వారానికి మూడుసార్లు అంటే రోజు విడిచి రోజు ముఖాన్ని మర్దన చేసుకోవాలి. దాంతో మొటిమలు, నల్లమచ్చలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
చాలామందికి ముఖంపై చర్మం సాగిపోయి లూజ్‌గా ఉంటుంది. అలాంటి వారు ఆపిల్ ప్యాక్ వేసుకుంటే స్కిన్ టైట్ అవుతుంది. దానికి ఆపిల్ పండును పేస్ట్ చేసి అందులో తేనె, వెనిగర్, ముల్తాని మట్టి వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమంతో వారానికోసారి ఫేస్‌ప్యాక్ వేసుకుంటే చర్మం టైట్‌గా అవుతుంది. దాంతోపాటు ముఖంపై ముడతలు తగ్గుతాయి.
అందం అనే సరికి అందరికీ గుర్తొచ్చేది ముఖం మాత్రమే. కానీ కాళ్లు, చేతులు కూడా అంతే ముఖ్యమని గ్రహించాలి. ఎందుకంటే ముఖంపై చూపినంత శ్రద్ధను కాళ్లపై చూపక, వాటిని అలాగే వదిలేస్తూ ఉంటారు. దాంతో వాటి రంగు, ముఖం రంగు వేరుగా ఉంటాయి. కాబట్టి కాళ్ల అందానికి ఒక కప్పు నిమ్మరసంలో రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్, పావుకప్పు పాలు, కొద్దిగా రోజ్ వాటర్ కలిపిన మిశ్రమాన్ని సగం నీళ్లున్న చిన్న టబ్బులో వేసి కలపాలి. రెండు కాళ్లను ఓ 20 నిమిషాల పాటు అందులో పెట్టాలి. తర్వాత కాళ్లను శనగపిండితో రుద్ది కడుక్కుంటే అందంగా తయారవుతాయి.