పిచ్చి పలు రకాలు...
ఈ ఫొటోలో కనిపిస్తున్న దుకాణాలు స్వీడన్‌లోని మాల్మోలో ఉన్నాయి. ఇందులో ఒకదాంట్లో జీడిపప్పు, బాదం, పిస్తా లాంటి బలవర్థకమైన ఆహారాన్ని అమ్ముతుండగా... రెండోదాంట్లో చీజ్, బర్గర్, పిజ్జా లాంటి ఫాస్ట్‌ఫుడ్ అమ్ముతున్నారు. ఏ షాపులో ఏమి అమ్మితే మాకెందుకు అనుకుంటున్నారా? ఏమీ లేదండి.. ఈ షాపులు నిర్మిచింది మనుషుల కోసం కాదు.. ఎలుకల కోసం.. ఏంటి నమ్మలేకున్నారా? ఇది నిజంగా నిజం.. ఎవరో ఆకాశ రామన్న ఎలుకల కోసం ఈ షాపులు నిర్మించాడు.
నిర్మించడమే కాదు.. వీటిలో ఆహారాన్ని కూడా ఉంచుతున్నాడట! సరే అయితే ఇందులో పెద్ద వింతేమి ఉంది ఎవరో దయా హృదయం ఉన్న వ్యక్తి ఈ పనికి పూనుకుని ఉంటాడు. ఈ మాత్రానికే ఇంత బిల్డప్ అవసరమా అనుకోకండి.. ఈ షాపులకు ఒక ప్రత్యేకత ఉంది. వీటిని ఎలుకల కోసం నిర్మించారు కాబట్టి వాటి సైజులు కూడా అంతే పరిమాణంలో ఉండేలా జాగ్రత్త పడ్డాడు. అంటే అత్యంత చిన్నగా (మైక్రో ఆర్ట్) 70సెం.మీ. పొడవుతో 30 సె.మీ. వెడల్పుతో నిర్మించారు. అయితే అక్కడి జనాలు ఎలుకల కోసం ఇంత కష్టపడడం ఏంటబ్బా.. వాడి పిచ్చికాని అని చెవులు కొరుక్కుంటున్నారు.