
బాదం మిల్క్ బాటిల్‌ను పరిశీలిస్తున్న మున్సిపల్ అధికారులు
సాక్షి, రామాయంపేట(మెదక్): బూజుపట్టిన బాదం మిల్క్ బాటిల్‌ను విక్రయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రామాయంపేటలోని హెరిటేజ్ స్టోర్‌ను శుక్రవారం రాత్రి మున్సిపల్ అధికారులు మూసివేయించారు. వినియోగదారుడు స్టాల్‌లో బాదం మిల్క్ బాటిల్‌ను కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లి బాటిల్ మూత ఓపెన్ చేయగా దుర్వాసన వచ్చింది. ఈ విషయాన్ని వినియోగదారుడు మున్సిపల్ అధికారుల దృష్టికి తెచ్చాడు. దీంతో అధికారులు బాటిల్‌ను స్వాధీనం చేసుకొని హెరిటేజ్ స్టాల్‌ను మూసివేయించారు. ఈ విషయంపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ ఇన్స్‌పెక్టర్ ఉదయ్‌కిరణ్ తెలిపారు.
చదవండి: తెలుగు అకాడమీ కేసులో కీలక మలుపు.. ఏసీబీకి బదిలీ
Comments
Please login to add a commentAdd a comment