బాదంతో చర్మకాంతి | beauty tips | Sakshi
Sakshi News home page

బాదంతో చర్మకాంతి

Published Mon, Mar 13 2017 12:03 AM | Last Updated on Tue, Sep 5 2017 5:54 AM

బాదంతో చర్మకాంతి

బాదంతో చర్మకాంతి

బ్యూటిప్స్‌

బాదం పలుకులను గ్రైండ్‌ చేసి కొన్ని చుక్కల తేనె, అర టీ స్పూన్‌ గోరువెచ్చని పాలు కలిపి పేస్ట్‌ చేయాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి ఆరిన తరవాత కడిగేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే చర్మం నిగారిస్తుంది. పాలలో గంటసేపు నానబెట్టిన బాదం పలుకులని పేస్ట్‌ చేయాలి.

దీంట్లో కొన్ని చుక్కల నిమ్మరసం, చిటికెడు పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని శుభ్రపరచిన ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తరవాత కడిగేస్తే నిగనిగలాడే చర్మం మీ సొంతమవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement