పిస్తా కుల్ఫీ | Summer Special Pista Kulfi | Sakshi
Sakshi News home page

పిస్తా కుల్ఫీ

Published Wed, Mar 13 2019 12:45 AM | Last Updated on Wed, Mar 13 2019 12:45 AM

Summer Special Pista Kulfi - Sakshi

కావలసినవి: పాలు – 1 లీటరు, పంచదార – 250 గ్రా., బ్రెడ్‌ – ఒక స్లైస్‌ (చివర్లు కట్‌చేసి వైట్‌ది మాత్రమే తీసుకోవాలి), బాదంపప్పు – 20 (నీళ్లలో నానబెట్టి పై పొట్టుతీసి గ్రైండ్‌ చేసుకోవాలి), పిస్తాపప్పు – అర కప్పు (పైన పొట్టు తీసేసి, పలుకులుగా చేసుకోవాలి), ఏలకులు – 4, కుంకమపువ్వు – రెండు, మూడు రేకలు.

తయారి: పాలు అరలీటర్‌ అయ్యేంత వరకు మరిగించాలి

►పాలు చల్లారాక ఇందులో పంచదార, బ్రెడ్, బాదంపప్పుపొడి, పిస్తాపప్పు, ఏలకులపొడి, కుంకుమపువ్వు వేసి కలపాలి

►కుల్ఫీ చేసే మౌల్డ్‌లో సిల్వర్‌ ఫాయిల్‌సెట్‌ చేసి అందులో పాలమిశ్రమం పోయాలి. ఐస్‌క్రీమ్‌ పుల్లను కూడా అమర్చాలి

►పన్నెండు గంటలపాటు కుల్ఫీమౌల్డ్‌ని ఫ్రీజర్‌లో ఉంచాలి

►కుల్ఫీ మౌల్డ్స్‌ని వేడినీటిలో ముంచితీస్తే ఫ్రీజ్‌ అయిన తర్వాత కుల్ఫీ బయటకు సులభంగా వస్తుంది

►చల్ల చల్లగా పిల్లలకు అందించవచ్చు. 

నోట్‌: కుల్ఫీ మౌల్డ్స్‌ లేకపోతే చిన్న గ్లాసులలో పాలమిశ్రమం పోసి ఫ్రీజర్‌లో పెట్టుకోవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement