ఇంటిప్స్
బిస్కెట్స్ ఉంచే డబ్బాలో అడుగున బ్లాటింగ్ పేపర్ వేసి ఉంచితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. ఆకుకూరలను అల్యూమినియమ్ ఫాయిల్‌లో చుట్టి ఫ్రిజ్‌లో ఉంచితే మూడు- నాలుగు రోజుల వరకు తాజాగా ఉంటాయి.
మాడిన గిన్నెల అడుగు భాగం త్వరగా శుభ్రపడాలంటే తరిగిన ఉల్లిపాయలు, నీళ్లు పోసి 5 నిమిషాలు మరిగించాలి.చిన్న ఇంగువ ముక్క వేసి భద్రపరిస్తే కారం రంగు, రుచి తగ్గదు. కొత్తిమీర ఆకులను ఎండబెట్టి, పొడి చేసి భద్రపరుచుకుంటే పచ్చళ్లు, కూరలల్లో వాడుకోవచ్చు.