
మృతురాలు కవితా గ్రోవర్
న్యూఢిల్లీ : నగరానికి చెందిన 75 ఏళ్ల కవితా గ్రోవర్ హత్య కేసులో ఫ్రిడ్జ్ మీది రక్తపు మరకలు కీలకంగా మారాయి. వాటి ఆధారంగానే పోలీసులు నిందితులను పట్టుకున్నారు. నిందితులు తను, అనిల్ ఆర్యాలు కవితా గ్రోవర్‌ను వాటర్ పైప్‌తో గొంతు బిగించి హత్య చేసిన సంగతి తెలిసిందే. హత్య అనంతరం ఆమె శరీరాన్ని కత్తితో మూడు భాగాలుగా చేశారు. వాటిని స్థానిక కాల్వలో పడేశారు. ఇంట్లో రక్తపు మరకలు లేకుండా పలుమార్లు అంతా శుభ్రం చేశారు. అయితే, మృతురాలిని ముక్కలుగా చేస్తున్నపుడు ఆమె రక్తం పక్కనే ఉన్న ప్రిడ్జ్‌పై పడింది. దీన్ని నిందితులు గమనించలేదు. దర్యాప్తు కోసం వచ్చిన పోలీసులకు ప్రిడ్జ్ మీది రక్తపు మరకలు దారి చూపించాయి. నిందితులను పట్టించాయి. ఒకవేళ ప్రిడ్జ్ మీద రక్తపు మరకలు లేకపోయిఉంటే నిందితులను పట్టుకోవటం చాలా కష్టం అయ్యేదని పోలీసులు చెబుతున్నారు.
కేసు పూర్వాపరాలు.. అనిల్ ఆర్య, అతని భార్య తను ఆర్య ఢిల్లీలోని నజాఫ్‌నగర్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈవెంట్ మేనేజ్‌మెంట్ అధికారిగా పనిచేస్తున్న అనిల్, కవితా గ్రోవర్ వద్ద లక్ష రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అవసరాల నిమిత్తం తీసుకున్న సొమ్మును చెల్లించమంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించేవాడు. ఈ నేపథ్యంలో మృతురాలు తన అప్పు తీర్చాలంటూ ఒత్తిడి చేయసాగింది. అది జీర్ణించుకోలేని అనిల్ దంపతులు ఆమెను ఎలాగైనా మట్టు బెట్టాలని ప్లాన్ వేశారు. ఈ క్రమంలో మరోసారి డబ్బులకోసం ఒత్తిడి చేయడంతో ఆమెపై దాడి చేసి వాటర్ పైప్‌తో గొంతుకు ఉరిబిగించి హత్య చేశారు. జూన్ 30న హత్య జరగగా.. జులై 1న మృతదేహాన్ని మూడు ముక్కలుగా చేసి స్థానిక కాలువలో పడేశారు.
Comments
Please login to add a commentAdd a comment