ఇక బాష్ ప్రిజ్ లు..
♦ వచ్చే నెలలో సిరీ 4 పేరుతో విడుదల
♦ 290-350 లీటర్ల రేంజ్
♦ ధరలు రూ.34,000 నుంచి షురూ
న్యూఢిల్లీ: బాష్ అండ్ సీమెన్స్ హౌస్‌హోల్డ్ అప్లయెన్సెస్(బీఎస్‌హెచ్) భారత రిఫ్రిజిరేటర్ మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. భారత వినియోగదారులు లక్ష్యంగా రూపొందించిన సిరీ 4 రేంజ్ రిఫ్రిజిరేటర్లను వచ్చే నెలలో మార్కెట్లోకి తేనున్నామని బాష్ అండ్ సీమెన్స్ హౌస్‌హోల్డ్ అప్లయెన్సెస్ తెలిపింది. 290 నుంచి 350 లీటర్ల రేంజ్‌లో ఫ్రిజ్‌లు అందించనున్నామని, వీటి ధరలు రూ.34,000 నుంచి ప్రారంభమవుతాయని బీఎస్‌హెచ్ హౌస్‌హోల్డ్ అప్లయెన్సెస్ ఎండీ, సీఈఓ(మాన్యుఫాక్చరింగ్) గుంజాన్ శ్రీవాత్సవ చెప్పారు. మరో 3 నెలల్లో 12-15 మోడళ్లను అందిస్తామని పేర్కొన్నారు.
ఈ ఫ్రిజ్‌లను బాష్ బ్రాండ్ కింద విక్రయిస్తామని వివరించారు. ప్రస్తుతం ఏడాదికి 90 లక్షల ఫ్రిజ్‌లు అమ్ముడవుతున్నాయని, వీటిల్లో 22 లక్షలు డబుల్ డోర్‌వేనని పేర్కొన్నారు. మూడేళ్లలో డబుల్ డోర్ ఫ్రిజ్‌ల మార్కెట్లో 10% మార్కెట్ వాటా సాధించడం లక్ష్యమని పేర్కొన్నారు. భవిష్యత్తులో 210 నుంచి 290 లీటర్ల రిఫ్రిజిరేటర్లను, సైడ్ బై సైడ్ ఫ్రిజ్‌లను, ఇతర ప్రీమియం రేంజ్ ఫ్రిజ్‌లనూ అందుబాటులోకి తెస్తామన్నారు.