జస్ట్ ఛిల్!
కొత్తకొత్తగా
డ్రింక్ కూల్‌గా ఉంటేనే అందరికీ ఇష్టం. అందుకే డ్రింక్‌ను ఫ్రిజ్‌లో పెట్టడమో లేక ఐస్ ముక్కలను అందులో వేసుకోవడమో చేస్తాం. కానీ ఒక్కోసారి సగం తాగేసరికి డ్రింక్ కూలింగ్ తగ్గిపోతూ ఉంటుంది. దానిపై ఇష్టం పోతుంది. ఇకపై అలాంటి బాధ లేదు. ఎందుకంటే మార్కెట్‌లోకి కొత్తగా వచ్చిన గ్లాసులు ఈ సమస్యను తీర్చేస్తాయి. ఈ గ్లాసుల్లో డ్రింక్‌ను పోసుకుంటే చాలు.. అదే కూల్ అవుతుంది. ఎలా అంటే.. ఆ గ్లాసులో రీయూజబుల్ చిల్లర్స్ (అందులో జెల్ లాంటి ద్రవం ఉంటుంది) ఉంటాయి. ఒక గ్లాసు కొనుగోలు చేస్తే రెండు చిల్లర్స్‌ను ఇస్తారు. వీటిని ముందుగా మనం ఫ్రిజ్‌లో అరగంట పెట్టి ఫ్రీజ్ చేసుకుంటే అందులోని ద్రవం వల్ల అది ఐస్‌గా మారుతుంది.
చిల్లర్‌లోని ఐస్ త్వరగా కరగకుండా సిలికాన్ గ్రిప్‌ను ఉపయోగిస్తారు. ఈ చిల్లర్‌సను గ్లాసులకు అమర్చుకుని, ఆపైన గ్లాసుల్లో డ్రింక్ పోయాలి. ఇక ఆఖరి చుక్క వరకు డ్రింక్ కూల్‌గానే ఉంటుంది. మూత ఉండే గ్లాసులు కూడా ఉన్నాయి. అవి కొనుక్కుంటే బైటికెళ్లినప్పుడు చక్కగా బ్యాగ్‌లో వేసుకుని తీసుకెళ్లొచ్చు!