
లైమ్ యాపిల్
ఇంటిప్స్
ఆపిల్ ముక్కలను కోసిన కొద్దిసేపటికే రంగు మారుతాయి. అలా కాకుండా ఉండాలంటే ఆ ముక్కలపై కొద్దిగా నిమ్మరసం చిలకరిస్తేసరి! రంగు మారకుండా తాజాగా ఉంటాయి.బేకింగ్ సోడాలో కొద్దిగా నిమ్మరసం వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ పేస్ట్‌ను వంటింటి సింకు మొత్తానికి పట్టించాలి. రెండు నిమిషాల తర్వాత కొబ్బరి పీచుతో బాగా రుద్ది శభ్రం చేయాలి. ఇలా చేస్తే సింకు అడుగు భాగంలో ఏర్పడ్డ మరకలు తొలగిపోతాయి.
ఒక్కోసారి ఫ్రిజ్‌లో పండ్లు, కూరగాయలు, పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్నప్పుడు దాని డోర్ తీయగానే ఏదో రకమైన వాసన వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఫ్రిజ్‌లోని మధ్య అరలో ఓ చిన్న ప్లేట్‌లో బేకింగ్ సోడా వేసి ఉంచండి. అలా చేస్తే దుర్వాసన రాదు.