బనానా పుడ్డింగ్
హెల్దీ ట్రీట్
కావలసినవి: అరటి పండ్లు – 6 నీళ్లు – 3 కప్పులు పంచదార – 250 గ్రా. ఏలకుల పొడి – 2 టీ స్పూన్లు జీడిపప్పు, బాదం పప్పు – గార్నిష్‌కి కావల్సినంత
తయారి: అరటిపండు పై తొక్క తీసి గుండ్రటి ముక్కలుగా కట్‌చేసి పెట్టుకోవాలి. నీళ్లను వేడి చేసి పంచదార కలిపి మరిగించాలి. పాకం చిక్కగా అయ్యాక దించి, అరటిపండు ముక్కలను వేయాలి. ఏలకుల పొడి, కొద్దిగా ఫుడ్ కలర్ వేసి కలిపాక పైన జీడిపప్పు, బాదంపప్పు వేసి చల్లారాక ఫ్రిజ్‌లో రెండు గంటలు ఉంచాలి. ఆ తర్వాత చల్లటి బనానా ఫుడ్డింగ్‌ని ప్లేట్‌లోకి తీసుకుని సర్వ్ చేయాలి.
ఒక కప్పు బనానా పుడ్డింగ్‌లో పోషకాలు...
క్యాలరీలు : 174.2 కి. క్యా;
కార్బోహైడ్రేట్లు : 22.3గ్రా,
ప్రొటీన్లు – 1.74 గ్రా.;
క్యాల్షియం – 22.4 మి.గ్రా.;
ఐరన్ – 0.6 మి.గ్రా.;
కొవ్వుపదార్థాలు – 2.56 గ్రా.