బ్యూటిప్స్
రెండు మెత్తని అరటిపండ్లను తీసుకుని గుజ్జులా చేసుకోవాలి. ఇందులో రెండేసి చెంచాల చొప్పున తేనె, పెరుగు, ఆలివ్ నూనెల్ని వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని అరగంట పాటు ఫ్రిజ్‌లో ఉంచి... ఆపైన తీసి జుత్తుకి, మాడుకి పట్టించాలి. గంట తర్వాత చల్లని నీటితో కడిగేసుకుని తలంటుకోవాలి. నెలకు రెండుసార్లయినా ఇలా చేస్తే... జుత్తు ఒత్తుగా పెరగడమే కాక కాంతులీనుతుంది. కొబ్బరిపాలు, నిమ్మరసం రెండూ జుత్తుకి మంచివే. ఈ రెండూ కలిస్తే కనుక మంచి కండిషనర్‌లా పని చేస్తాయి.
జుత్తుని బలంగా చేస్తాయి. ఓ అరకప్పు కొబ్బరి పాలలో నిమ్మరసాన్ని కలిపి తలకు పట్టించి, అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలంటుకోవాలి. పొడి జుత్తు కలవారు వారానికి రెండుసార్లు ఇలా చేస్తే కొన్ని వారాల్లోనే డ్రైనెస్ పోయి జుత్తు పట్టులా మెరుస్తుంది.
ఓ చెంచాడు సోయాబీన్ నూనెను, రెండు చెంచాల నువ్వుల నూనెను తీసుకుని బాగా కలపాలి. దీన్ని కాస్త వేడిచేసి చల్లార్చాలి. ఆపైన మాడుకు పట్టించి మసాజ్ చేసి, అరగంట తర్వాత తలంటుకోవాలి. వారానికోసారి ఇలా చేస్తే చుండ్రు బాధ తగ్గడంతో పాటు జుత్తు ఆరోగ్యంగా తయారవుతుంది.