Heating
-
టీని మళ్లీ వేడి చేసి తాగుతున్నారా? డేంజర్లో పడ్డట్లే
పొద్దున లేవగానే ఓ కప్పు గరం చాయ్ గొంతు దిగందే పనిలో దిగరు చాలామంది. అది గ్రీన్ టీ అయినా లెమన్ టీ అయినా సరే ఏదో ఒక టీ గొంతులో పడాల్సిందే. పనిలో అలసిపోయినా, కాస్త సేదదీరాలాన్న ‘‘టీ తాగొద్దాం పద’’ అంటారు స్నేహితులు. ఇలా టీ అనేది దినచర్యలో భాగమైపోయింది. టీని ఫ్రెష్‌గా కాచి తాగితేనే మంచిది. పైగా ఫ్రెష్ టీ ఫ్లేవరు, రుచే వేరు. చాలామంది ఒకేసారి టీ పెట్టేసుకుని ఫాస్కులో పోసుకుని ఆరారగా తాగుతుంటారు. ఇంకొంతమంది టీ కాచి దాన్ని అలాగే ఉంచి వేడి చేసుకుని తాగుతుంటారు. కానీ అలా టీని మళ్లీ మళ్లీ వేడి చేసుకుని తాగటం మంచిది కాదట.. నాలుగు గంటల కంటే ఎక్కువసేపు ఉంచిన తర్వాత టీని మళ్లీ వేడి చేయడం ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని చెబుతున్నారు నిపుణులు. కాచి అలా ఉంచేసిన టీలో ఫంగస్ ఏర్పడుతుంది. బ్యాక్టీరియా కూడా డెవలప్ అవుతుంది. దీంతో రుచి కూడా మారిపోతుంది. కానీ టేస్ట్ మారింది ఏంటో అనుకుంటాం గానీ కారణం మాత్రం ఇదే. కాబట్టి టీని వేడి చేసి తాగటం మంచిది కాదు. అదే హెర్బల్ టీని అయితే మరోసారి వేడి చేసి తాగకూడదు. అలా వేడి చే చడం వల్ల దాంట్లో ఉండే పోషకాలు, ఖనిజాలు నశించిపోతాయి. అది తాగినా తాగకపోయినా ఒక్కటే. గ్రీన్ టీ అయితే వేడి చేసి తాగటం ఏమాత్రం మంచిది కాదు. టీని ఎక్కువసేపు నిల్వ ఉంచితే టానిన్ అధికంగా విడుదల అవుతుంది. ఇది టీని చేదుగా మార్చేస్తుంది. దీంతో అలా వేడి చేసిన టీ తాగితే కడుపు నొప్పి వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాదు అతిసారానికి దాని తీయవచ్చు. కడుపు ఉబ్బరం, వికారం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. అంతేకాదు ఇలా టీని మళ్లీ మళ్లీ వేడి చేసి తాగితే మనకు తెలియకుండానే అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి టీ తాగాలనుకుంటే ఎప్పటికప్పుడు తయారు చేసుకుని తాగితే మంచిది. రుచికి రుచి ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యమూ బాగుంటుంది. ఆరోగ్యం కోసమో ఉల్లాసం కోసమో టీ తాగాలనుకున్నప్పుడు మరిగి పోయి ఉన్న టీ తాగడం వల్ల ఉత్సాహం మాటెలా ఉన్నా, ఉన్న ఆరోగ్యం దెబ్బ తినడం ఖాయం. అటువంటి చెడు ఫలితాలు పడకుండా ఉండాలంటే ఫ్రెష్ టీ తాగడం మేలు. -
వింటర్ జోరు: హీటింగ్ ఉత్పతుల హాట్ సేల్!
న్యూఢిల్లీ: వాటర్ హీటర్లు, గీజర్లు, రూమ్ హీటర్లు తదితర ఉత్పత్తుల అమ్మకాలు ప్రస్తుతం శీతాకాలంలో (వింటర్) జోరుగా ఉంటాయని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గడం అమ్మకాలకు దన్నుగా నిలవనుంది. రెండంకెల స్థాయిలో అమ్మకాలు పెరుగుతాయన్న అంచనాలతో, కంపెనీలు ఇప్పటికే తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవడం గమనార్హం. వింటర్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు కొత్త ఉత్పత్తులను కూడా మార్కెట్‌కు పరిచేయం చేస్తున్నాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) సాంకేతికతతో కూడిన గీజర్లను కూడా తీసుకొచ్చాయి. ట్యాంక్ రహిత ఇన్స్టంట్ వాటర్ హీటర్లను కూడా తీసుకొచ్చాయి. ఆయిల్ ఫిల్డ్ రేడియేటర్లతో కూడిన ఖరీదైన రూమ్ హీటర్లు కూడా మార్కెట్లోకి వచ్చాయి. సామాన్య వినియోగదారుల నుంచి, సంపన్న వినియోగదారుల వరకు అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా.. సౌకర్యం, మన్నిక, డిజైన్లతో కూడిన ఉత్పత్తులను కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. (మీరు ఎస్బీఐ ఖాతాదారులా? అయితే మీకో గుడ్ న్యూస్) 20 శాతం వృద్ధిపై క్రాంప్టన్ కన్ను.. క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జ్యూమర్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (సీజీసీఈఎల్) అయితే, ఇన్స్టంట్, స్టోరేజ్ వాటర్ హీటర్ల అమ్మకాల్లో 20 శాతం మేర వృద్ధి ఉంటుందని అంచనా వేస్తోంది. గతేడాదితో పోలిస్తే రూమ్ హీటర్ల అమ్మకాల్లో 70 శాతం వృద్ధి ఉండొచ్చని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఆనంద్ కుమార్ తెలిపారు. ఈ కంపెనీ ఏడు కొత్త మోడళ్లను పరిచయం చేసింది. సోలారియం క్యూబ్ ఐవోటీ సిరీస్, సోలారియం కేర్ సిరీస్ నుంచి ఈ ఉత్పత్తులు ఉన్నాయి. బేబీ కేర్, హెయిర్ కేర్, హైజీన్ కేర్ అనే ఫీచర్లు వీటిల్లో ఉన్నాయి. ఈ ఏడాది వాటర్ హీటర్ల మార్కెట్ సైజ్ 10 శాతం వృద్ధితో 42.5 లక్షలుగా ఉంటుందని కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ తయారీదారుల సంఘం (సీఈఏఎంఏ) ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగంజా తెలిపారు. రూమ్ హీటర్ల మార్కెట్ 40 లక్షల యూనిట్లు కాగా, ఈ ఏడాది వృద్ధి చలి తీవ్రతపై ఆధారపడి ఉంటుందన్నారు. ముందే సన్నద్ధం.. ‘‘వింటర్ సీజన్‌పైనే వ్యాపార వృద్ధి ఆధారపడి ఉంటుంది. చలి తీవ్రత ఎక్కువైతే ఉత్పత్తులకు డిమాండ్ సహజంగానే అధికమవుతుంది. మార్కెట్లో డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా కొరత ఉండకూడదన్న ఉద్దేశ్యంతో ముందే తయారీ పరంగా తగినంత సన్నద్ధతతో ఉన్నాం’’అని బజాజ్ ఎలక్ట్రికల్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ సీవోవో రవీందర్ సింగ్ నేగి వెల్లడించారు. రూమ్ హీటర్ల విభాగంలో ఆయిల్ ఫిల్డ్ రేడియేటర్లు, కార్బన్ రూమ్ హీటర్లు, ఫ్యాన్ రూమ్ హీటర్లు, హాలోజెన్ రూమ్ హీటర్లు ఇలా అన్ని రకాల ఉత్పత్తులను తాము ఆఫర్ చేస్తున్నట్టు నేగి తెలిపారు. హింద్‌వేర్ హోమ్ ఇన్నోవేషన్ ఈ విభాగంలో గడిచిన రెండేళ్లుగా రెండంకెల వృద్ధిని చూస్తున్నట్టు కంపెనీ సీఈవో రాకేశ్ కౌల్ చెప్పారు. ఈ ఏడాది 20 వరకు వాటర్ హీటర్, రూమ్ హీటర్ మోడళ్లను విడుదల చేయడం ద్వారా తమ ఉత్పత్తుల శ్రేణిని విస్తరించినట్టు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో అమ్మకాల్లో 30 శాతం వృద్ధి కనిపించినట్టు చెప్పారు. (సామాన్యుడికి ఊరట: 11 నెలల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం) -
మరుగుతున్న ఆర్కిటిక్! పెను ప్రమాదానికి సంకేతమా?
వాషింగ్టన్: ప్రపంచ పర్యావరణ సంతులనానికి అత్యంత కీలకమైన ఆర్కిటిక్ ప్రాంతం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గత 20 ఏళ్లుగా ఆ ప్రాంతమంతా గ్లోబల్ వార్మింగ్ కంటే నాలుగు రెట్లు వేగంగా వేడెక్కుతోందని ఓ అధ్యయనంలో తేలింది. దీనికి వాతావరణ మార్పులే ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమని జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం అభిప్రాయపడింది. గత 50 ఏళ్లలో చూసుకున్నా ఆర్కిటిక్ వేడెక్కే వేగం కనీసం రెట్టింపైందని తేల్చింది. ముఖ్యంగా వేడి గాలులతో పాటు మహాసముద్రాల వేడి ఆర్కిటిక్‌పై నేరుగా ప్రభావం చూపుతున్నట్టు వివరించింది. ప్రపంచ వాతావరణాన్ని, తద్వారా మొత్తంగా పర్యావరణ వ్యవస్థను ఆర్కిటిక్ నేరుగా ప్రభావితం చేస్తుందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి భారీ మంచు పలకలు కరుగుతున్న వేగం కూడా క్రమంగా పెరుగుతోందని అధ్యయనానికి నేతృత్వం వహించిన అమెరికాలోని లాస్ అలమోస్ నేషనల్ లేబొరేటరీ వాతావరణ పరిశోధకుడు, భౌతిక శాస్త్రవేత్త పీటర్ షిలెక్ తెలిపారు. ఇది పెను ప్రమాదానికి సంకేతమేనంటూ ఆందోళన వెలిబుచ్చారు. సముద్రమట్టాల పెరుగుదల వేగవంతమై ప్రపంచవ్యాప్తంగా పలు ప్రముఖ తీర పట్టణాలు ముంపు బారిన పడటమే గాక మరెన్నో ఉత్పాతాలకు దారి తీస్తుందని హెచ్చరించారు. -
వంట నూనెను మళ్లీ మళ్లీ వాడుతున్నారా? ఎంత డేంజరో తెలుసా..
పెదవాల్తేరు(విశాఖపట్నం): ఇంట్లోను, హోటళ్లలోను ఒకసారి వినియోగించిన వంట నూనెను పదేపదే ఉపయోగించడం పరిపాటి. కానీ అలా చేయడం ఆరోగ్యానికి హానికరం అన్న విషయం చాలా మందికి తెలియదు. దీనిపై ఇప్పుడిప్పుడే అధికారులు కూడా అవగాహన కల్పిస్తున్నారు. వాడిన వంటనూనెతో తయారైన ఆహారం తీసుకోవడం ద్వారా గుండెజబ్బులు, లివర్ జబ్బులు, హైపర్‌టెన్షన్, అల్జీమర్ వంటి వ్యాధులు సోకుతాయని జిల్లా ఆహార భద్రత శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. చదవండి: మీకు తెలుసా?.. విద్యుత్ శాఖ నుంచి మెసేజ్‌లు రావు కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందిన ఎన్ఎస్ఆర్ ఇండస్ట్రీస్ ఒకసారి వాడిన వంట నూనెను కొనుగోలు చేస్తుంది. ఇప్పటికే విశాఖలోని పలు హోటళ్లలోను, గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్‌మెంట్లలోను వాడిన వంటనూనె సేకరణ కోసం డ్రమ్ములు కూడా ఏర్పాటు చేశారు. లీటర్ అయిల్‌కు రూ.30 వంతున చెల్లిస్తారు. అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, హోటల్ యజమానులు వాడిన వంటనూనె విక్రయాల కోసం సదరు సంస్థను సంప్రదించాలని ఆహార భద్రత శాఖ అధికారులు కోరుతున్నారు. ఈ నూనె సాయంతో బయోడీజిల్ తయారు చేస్తారు. ఫలితంగా పెరుగుతున్న చమురు ధరల నుంచి ఉపశమనం పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. వంట నూనె సేకరణ సంస్థ, ఎన్ఎస్ఆర్ ఇండస్ట్రీస్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 91605–14567 -
బ్యూటిప్స్
రెండు మెత్తని అరటిపండ్లను తీసుకుని గుజ్జులా చేసుకోవాలి. ఇందులో రెండేసి చెంచాల చొప్పున తేనె, పెరుగు, ఆలివ్ నూనెల్ని వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని అరగంట పాటు ఫ్రిజ్‌లో ఉంచి... ఆపైన తీసి జుత్తుకి, మాడుకి పట్టించాలి. గంట తర్వాత చల్లని నీటితో కడిగేసుకుని తలంటుకోవాలి. నెలకు రెండుసార్లయినా ఇలా చేస్తే... జుత్తు ఒత్తుగా పెరగడమే కాక కాంతులీనుతుంది. కొబ్బరిపాలు, నిమ్మరసం రెండూ జుత్తుకి మంచివే. ఈ రెండూ కలిస్తే కనుక మంచి కండిషనర్‌లా పని చేస్తాయి. జుత్తుని బలంగా చేస్తాయి. ఓ అరకప్పు కొబ్బరి పాలలో నిమ్మరసాన్ని కలిపి తలకు పట్టించి, అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలంటుకోవాలి. పొడి జుత్తు కలవారు వారానికి రెండుసార్లు ఇలా చేస్తే కొన్ని వారాల్లోనే డ్రైనెస్ పోయి జుత్తు పట్టులా మెరుస్తుంది. ఓ చెంచాడు సోయాబీన్ నూనెను, రెండు చెంచాల నువ్వుల నూనెను తీసుకుని బాగా కలపాలి. దీన్ని కాస్త వేడిచేసి చల్లార్చాలి. ఆపైన మాడుకు పట్టించి మసాజ్ చేసి, అరగంట తర్వాత తలంటుకోవాలి. వారానికోసారి ఇలా చేస్తే చుండ్రు బాధ తగ్గడంతో పాటు జుత్తు ఆరోగ్యంగా తయారవుతుంది.