రిఫ్రిజ్‌రేటర్లు వచ్చిన తర్వాత నుంచి వేస్ట్ అంటూ ఏమి ఉంచకుండా ప్రతీదీ దాంట్లోకే తోసేస్తున్నాం. ప్రతీ కూర మూడు నుంచి వారం రోజులకు పైనే ఫ్రిజ్‌లో పెట్టుకుని తింటున్నాం. ఇలానే తమిళనాడుకు చెందిన చిన్నారి ఫ్రిజ్‌లో పెట్టిన చికెన్ కర్రీ తిని మృతి చెందింది. ఆమె కుటుంబసభ్యులు కొద్ది పాటి అనారోగ్యానికి గురయ్యారు. ఇంతకీ ఫ్రీజ్‌లో పెట్టిన కూరలు తినొచ్చా? ఎన్ని రోజుల వరకు ఉంచి తింటే మంచిది?
తమిళనాడులోని అరియలూరుకి చెందిన గోవిందరాజులు అనిర్బసి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. వాళ్లు కోడిమాంసం తెచ్చుకుని వండుకుని తినగా మిగిలింది ఫ్రిజ్‌లో పెట్టి మరుసటి రోజు తిన్నారు. అంతే ఇంటిల్లపాది ఆస్పత్రి పాలయ్యారు. కానీ చిన్న కుమార్తె పరిస్థితి విషమించి మృతి చెందింది. ఫుడ్ పాయిజ్ కారణంగా ఇలా జరిగి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. ఇంతకీ వాళ్లు సరిగా నిల్వ చేయలేదా? మరేదైనా అనేది తెలియాల్సి ఉంది. ఇలా అందరం సర్వసాధారణంగా చేస్తాం. కానీ పలు సందర్భాల్లో ఇలాంటి దిగ్భ్రాంతికర ఘటనలు తలెత్తుతున్నాయి. అసలు ఇంతకీ ఫ్రిజ్‌లో ఎలా నిల్వచేయొచ్చు. ఎన్ని రోజుల వరకు ఏ కూర అయినా ఉంచొచ్చు తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందాం!.
కూరల్లో సాధారణంగా టమాట, కొబ్బరి, మసాలా దినుసులు జోడించి ఎక్కువసేపు ఉడికిస్తాం కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. అయితే మనకు నిల్వ ఉండాలనుకుంటే తక్కువ సేపట్లోనే ఉడికిపోయేలా వండుకోవాలి. ముఖ్యంగా నాన్‌వెజ్‌కి సంబంధించిన బటర్ చికెన్, వంటివి ఎక్కువసేపు మంటపై వండకూడదు. తక్కువ టైంలోనే వండేసి, ప్రిజ్‌లో పెట్టాలనుకున్న దాన్ని వేరుగా గాలి చొరబడిన బాక్స్‌లో వేసి ఫ్రిజలో పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పైగా రుచి పాడవ్వదు. అలాగే కూర వండిన రెండు గంటల్లోపే ఫ్రిజ్‌లో నిల్వ ఉంచేలా చేస్తే మంచిది.
అలాగే బట్టర్ చికెన్ వంటి కూరలు వండటానికి ముందే చికెన్‌ని మసాల, కారం పొడులతో చక్కగా మారినేట్ చేసుకుని ఫ్రిజ్ నాలుగు నుంచి ఐదు గంటలు ఉంచి వండుకోండి. అదికూడా జస్ట్ 30 నిమిషాలకు మించి ఉడకనివ్వకండి. అలాగే మటన్ వంటి కొన్ని రకాల నాన్‌వెజ్‌లు ఉడకటానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. అలాంటి వాటిని ప్రెజర్ కుక్కర్ వంటి వాటిల్లో వండుకోండి. త్వరితగతిన ఉడికిపోతాయి. పైగా ఫ్రిజ్‌లో ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు. అలాగే ఫ్రిజ్‌లో పెట్టాలనుకున్న కర్రీలను మంచి టైట్ బాక్స్‌లో ఉంచి పెట్టడం మంచిది.
అలాగే ఫ్రిజ్‌ని కూడా ఎప్పటికప్పుడూ నీటిగా క్లీన్ చేసి ఉంచుకుంటే ఎలాంటి బ్యాక్టీరియాలు దరిచేరవు. ఫుడ్ పాయిజన్‌లు అవ్వడం జరగదు. ఏదైనా గానీ నిల్వ చేసుకోవాలనుకుంటే మాత్రం చల్లటి నీళ్లు పడకుండా ముందుగా వేరొక పాత్రలో తీసుకుని వెంటనే ఫ్రిజ్‌లో పెట్టేయండి. అంతేగానీ ఇష్టం వచ్చినట్లు కర్రీలో గరిటలు పెట్టి వాడేసి, ఆ తర్వాత మిగిలింది కదా అని ఫ్రిజ్‌లో పెట్టేస్తారు. ఆ తర్వాత రెండు మూడు రోజలుకు గానీ ఆ విషయం గుర్తుకు రాదు. అప్పటికే అది పాడైపోయి ఉంటుంది. ఇక పడేయ్యడం ఇష్టం లేక తిని ఆస్పత్రి పాలవ్వుతారు. దయచేసి ఇలాంటి పనులు అస్సలు చేయకండి. వంటకు సంబంధించిన విషయాల్లో కాస్త జాగురకతతో వ్యవహరించండి.
Comments
Please login to add a commentAdd a comment