South Korean Woman Killed Her Newborn Babies, Stored Them In Freezer - Sakshi
Sakshi News home page

ఎంత దారుణం! పుట్టిన పసిపిల్లలని ఫ్రిడ్జ్‌లో దాచిపెట్టిన తల్లి.. కొన్నాళ్ల తర్వాత

Published Mon, Jun 26 2023 5:00 PM | Last Updated on Mon, Jun 26 2023 5:50 PM

Woman Kills Her Newborn Babies, Stores In Freezer South Korea - Sakshi

పిల్లలంటే ఇష్టపడని వారుండరు. అయితే వివాహం తర్వాత కొంత మంది దంపతులకు సంతానం కలగడం ఆలస్యం కావడంతో డాక్టర్లు చుట్టూ తిరుగుతుంటారు. ఈ క్రమంలో కొందరికి పిల్లలు పుడితే.. మరికొందరి ప్రయత్నాలు విఫలమై దత్తత లాంటివి వాటితో పిల్లలను పెంచుకుంటూ ఉంటారు. ఏది ఏమైన పెళ్లైన దంపతులకు పిల్లలు లేకపోతే వారి పడే మనోవేదన వర్ణణాతీతమనే చెప్పాలి. అలాంటిది ఓ తల్లి మాత్రం తనకు పుట్టిన పిల్లలను కిరాతకంగా చంపేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ దారుణ ఘటన దక్షణి కొరియా సిరియా పరిధిలోని సువాల్ ప్రాంతంలో చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెళితే.. సువాన్ సిటీకి చెందిన ఓ మహిళకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత 2018లో ఓ పాపకు జన్మనివ్వగా.. ఆ పసికందుని చంపి ఫ్రిజ్‌లో పెట్టింది. 2019లో మరో పాప పుట్టినప్పుడు కూడా అంతే కఠినంగా వ్యవహరించింది. ఈ విషయాన్ని ఎవరికీ అనుమానం రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఆసుపత్రిలో ప్రసవాలు జరిగిన దాఖలాలు ఉండగా ఆమె తన పిల్లల పేర్లు నమోదు చేయకపోవడంతో అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగడంతో.. తొలుత ఆమె పోలీసుల విచారణకు సహకరించలేదు.

ఫ్రిజ్‌లో రెండు మృతదేహాలు లభ్యం కాగా చివరికి తన పసిపిల్లలను చంపినట్లు ఆ మహిళ అంగీకరించింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అలా చేయాల్సి వచ్చిందని తెలిపింది. ఆ మహిళ మాటలను విన్న ఆమె భర్త, అధికారులు, పోలీసులు అంతా షాక్ గురయ్యారు. ఈ హత్యల గురించి తనకు తెలియదని మహిళ భర్త తెలిపాడు. తన భార్య తనకు రెండుసార్లు అబార్షన్లు చేయించుకున్నట్లు చెప్పిందని అతను చెప్పాడు. చివరికి పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు. 2022లో ఇలాంటి కేసులో, జియోంగ్గి ప్రావిన్స్‌లో చనిపోయిన తమ శిశువు మృతదేహాన్ని  మూడు సంవత్సరాల పాటు కంటైనర్‌లో దాచిపెట్టినందుకు దక్షిణ కొరియాలోని ఒక జంటను పోలీసులు అరెస్టు చేశారు.

చదవండి: మిడిల్‌క్లాస్‌ భర్త.. రేయింబవళ్లు కష్టపడి భార్యని చదివిస్తే.. జాబ్‌ వచ్చాక మరొకడితో

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement