నెయ్యి రాస్తే... సాయంత్రానికీ నిల్వ!
• క్యాబేజీ వండేటప్పుడు కాసిన్ని సోంపు గింజలు వేస్తే పచ్చి వాసన రాకుండా ఉంటుంది.
• బెండకాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే... రెండు వైపులా తొడిమలు కోసేసి, పాలిథీన్ కవర్లో వేసి ఫ్రిజ్‌లో పెట్టాలి.
• మసాలా గ్రైండ్ చేసిన తర్వాత మిక్సీ జార్ అదే వాసన వస్తూ ఉంటే... కొన్ని బ్రెడ్ ముక్కలు కానీ రస్కులు కానీ వేసి రెండు నిమిషాలు గ్రైండ్ చేస్తే సరి.
• టీ మరిగించే పాత్రలు నల్లబడిపోతుంటాయి. అవి మళ్లీ తళతళలాడాలంటే ఉప్పుతో రుద్ది కడగాలి.
• కేక్ కట్ చేసే ముందు చాకుని వేడి నీటిలో ముంచి తీసి, బట్టతో తుడిచి అప్పుడు కోస్తే... కేక్ అందంగా తెగుతుంది.
• చపాతీలు సాయంత్రం వరకూ ఎండిపోకుండా మెత్తగానే ఉండాలంటే... వాటికి కొద్దిగా నెయ్యి రాసి, పాలిథీన్ కవర్‌లో పెట్టి ఉంచాలి.