Bendakaya
-
అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా? ఈ వాటర్ ట్రై చేయండి!
బరువు తగ్గాలనుకునేవారు రకరకాల పద్దతులను ప్రయత్నిస్తూ ఉంటారు. జీవన శైలి మార్పులతోపాటు, కొన్ని ఆహారనియమాలతో అధిక బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. వాటిల్లో ఒకటి ఓక్రా (బెండకాయ లేదా లేడీస్ ఫింగర్ ) వాటర్. పరగడుపున బెండ కాయ నీళ్లు తాగడం వల్ల చాలా ఆరోగ్యప్రయోజనాలున్నాయని పెద్దలు చెబుతారు. బరువు తగ్గడానికి, రక్తపోటు నియంత్రణలో బెండకాయ ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. బెండకాయలో కేన్సర్ నిరోధక లక్షణాలున్నాయి. ముఖ్యంగా పేగు కేన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీని వినియోగం, సమయం వ్యక్తిగత ప్రాధాన్యతలు, జీవనశైలిపై ఆధారపడి ఉంటుందనేది గమనించాలి. ఓక్రా వాటర్ అంటే ఏమిటి? బెండకాయ కూర, వేపుడు, పులుసు ఇలా రకరకాల వంట గురించి తెలుసు.కానీ చాలామంది ఓక్రా వాటర్, దాని ప్రయోజనాల గురించి పెద్దగా తెలియదు. ఓక్రా నీటిని తయారు చేయడం సులభం. 24 గంటలు లేదా రాత్రిపూట నీటిలో నానబెట్టడం ద్వారా తయారు చేయవచ్చు. శుభ్రంగా కడిగిన నాలుగు బెండకాయలను ముక్కలుగా కోసం రాత్రంతా నీటిలో ఉంచాలి. దీని మొత్తం వల్ల పోషకాలు నీటిలోకి చేరతాయి. ఉదయాన్ని ఈ నీటిని సేవించడం వల్ల లభించే పోషకాలు, విటమిన్లు ఇలా ఉంటాయి. పోషకాలు, విటమిన్లు కేలరీలు: 31 కిలో కేలరీలు ప్రోటీన్: 2 గ్రాములు కొవ్వు: 0.2 గ్రాములు పిండి పదార్థాలు: 7 గ్రాములు ఫైబర్: 3 గ్రాములు మాంగనీస్: రోజువారీ విలువలో 33శాతం (DV) విటమిన్ సి: రోజువారీ విలువలో 24శాతం చర్మ సౌందర్యం చర్మానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. విటమిన్ సి, పొటాషియం, ఫోలియేట్ వంటి విటమిన్లు ,యు మినరల్స్‌తో నిండిన ఓక్రా వాటర్ సహజ చర్మ టానిక్‌గా పనిచేస్తుంది, ఆరోగ్యకరమైన , ప్రకాశవంతమైన ఛాయను అందిస్తుంది. యాంటీఆక్సిడెంట్ కంటెంట్ ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. ముఖ్యంగా, ఓక్రాలో ముఖ్యంగా మాంగనీస్ పుష్కలంగా ఉంటుంది, రక్తంలో చక్కెర నియంత్రణకు ఇది కీలకమైన ఖనిజం. అదనంగా, ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది, ఇది యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది , రోగనిరోధక పనితీరుకు మద్దతు ఇస్తుంది. స్త్రీ,పురుషుల్లో లిబిడో(శృంగారేచ్ఛ)ను పెంచడంలో దివ్యమైన ఔషధంలా పనిచేస్తుందని నమ్ముతారు. -
ఇంటిప్స్
►పాలు విరిగిపోతాయని అనుమానంగా ఉంటే కాచేటప్పుడు చిటికెడు వంటసోడా వేస్తే సరి. ►నెయ్యి కాచి దించేముందు కాసిని మెంతులు లేదా తమలపాకు వేస్తే సువాసనగా ఉండటంతోపాటు నెయ్యి ఎక్కువ కాలం నిల్వ ఉన్నా, తాజాగా ఉంటుంది. ►ఇంటికి అతిథులు వచ్చారు. ఆధరువులన్నీ వడ్డించారు కానీ, సమయానికి మజ్జిగ సరిపోవని అనుమానం వచ్చిందనుకోండి, అప్పుడు కాసిని గోరువెచ్చటి పాలలో చిటికెడు ఉప్పు వేసి, నిమ్మ రసం పిండితే సరి. మజ్జిగలా తయారవుతుంది. ►కూరలో ఉప్పు ఎక్కువైందనుకోండి, కంగారు పడకండి, రెండు స్పూన్ల పాలమీగడ కలిపెయ్యండి... ఉప్పదనం కాస్తా పరారైపోయి, యమా టేస్టీగా తయారవుతుంది కూర. ►బెండకాయముక్కల్ని ముందుగా కాస్త వేయించి, ఆ తర్వాత ఉడకబెట్టి వండితే, జిగటగా ఉండకుండా, వేటికవి విడివిడిగా వస్తాయి ముక్కలు. ►క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటివి ఉడికించేటప్పుడు అదొకరకమైన వాసన వేస్తాయి. అలా వాసన రాకుండా ఉండాలంటే, చిన్న బ్రెడ్ ముక్క వేయాలి లేదా స్పూను పంచదార వేయాలి. ►పులిహోర చేసేటప్పుడు, అన్నం పొడపొడలాడుతూ రావాలంటే, అన్నం ఉడికేటప్పుడు కొన్ని చుక్కల నిమ్మరసం, ఒక స్పూను నూనె వేస్తే, అన్నం తెల్లగా మల్లెమొగ్గల్లా, పొడిపొడిగా వస్తుంది. -
తొడిమలు తీస్తే... తాజా!
ఇంటిప్స్ ► మొదలు చివర తుంచేసి, బెండకాయలకు ఒక ప్లాస్టిక్ కవర్లో ఉంచి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇలా చేస్తే అవి తాజాగా ఉంటాయి. ► అల్లం–వెల్లుల్లి పేస్ట్ రంగు మారకుండా ఉండాలంటే, వాటిని మిక్సీలో వేసే ముందు కొద్దిగా వేయించుకోవాలి. ఇలా చేస్తే చాలారోజుల పాటు ఆ పేస్ట్ తాజాగా ఉంటుంది. ► ఆకుకూరలు ఉడకబెట్టిన నీళ్లు పారబోయకుండా వాటిని మరో గిన్నెలోకి తీసుకొని సూప్ తయారీలో వాడుకోవచ్చు. ఇలా చేస్తే అందులోని విటమిన్స్, మినరల్స్ వృథా కావు. ►అప్పడాలు ఉంచిన డబ్బాలో కొన్ని బియ్యపు గింజలు కానీ, సెనగపప్పు కానీ వేయాలి. అలా చేస్తే అప్పడాలు మెత్తబడకుండా ఉంటాయి. -
నెయ్యి రాస్తే... సాయంత్రానికీ నిల్వ!
• క్యాబేజీ వండేటప్పుడు కాసిన్ని సోంపు గింజలు వేస్తే పచ్చి వాసన రాకుండా ఉంటుంది. • బెండకాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే... రెండు వైపులా తొడిమలు కోసేసి, పాలిథీన్ కవర్లో వేసి ఫ్రిజ్‌లో పెట్టాలి. • మసాలా గ్రైండ్ చేసిన తర్వాత మిక్సీ జార్ అదే వాసన వస్తూ ఉంటే... కొన్ని బ్రెడ్ ముక్కలు కానీ రస్కులు కానీ వేసి రెండు నిమిషాలు గ్రైండ్ చేస్తే సరి. • టీ మరిగించే పాత్రలు నల్లబడిపోతుంటాయి. అవి మళ్లీ తళతళలాడాలంటే ఉప్పుతో రుద్ది కడగాలి. • కేక్ కట్ చేసే ముందు చాకుని వేడి నీటిలో ముంచి తీసి, బట్టతో తుడిచి అప్పుడు కోస్తే... కేక్ అందంగా తెగుతుంది. • చపాతీలు సాయంత్రం వరకూ ఎండిపోకుండా మెత్తగానే ఉండాలంటే... వాటికి కొద్దిగా నెయ్యి రాసి, పాలిథీన్ కవర్లో పెట్టి ఉంచాలి.