బరువు తగ్గాలనుకునేవారు రకరకాల పద్దతులను ప్రయత్నిస్తూ ఉంటారు. జీవన శైలి మార్పులతోపాటు, కొన్ని ఆహారనియమాలతో అధిక బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. వాటిల్లో ఒకటి ఓక్రా (బెండకాయ లేదా లేడీస్ ఫింగర్ ) వాటర్. పరగడుపున బెండ కాయ నీళ్లు తాగడం వల్ల చాలా ఆరోగ్యప్రయోజనాలున్నాయని పెద్దలు చెబుతారు.
బరువు తగ్గడానికి, రక్తపోటు నియంత్రణలో బెండకాయ ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. బెండకాయలో కేన్సర్ నిరోధక లక్షణాలున్నాయి. ముఖ్యంగా పేగు కేన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీని వినియోగం, సమయం వ్యక్తిగత ప్రాధాన్యతలు, జీవనశైలిపై ఆధారపడి ఉంటుందనేది గమనించాలి.
ఓక్రా వాటర్ అంటే ఏమిటి?
బెండకాయ కూర, వేపుడు, పులుసు ఇలా రకరకాల వంట గురించి తెలుసు.కానీ చాలామంది ఓక్రా వాటర్, దాని ప్రయోజనాల గురించి పెద్దగా తెలియదు. ఓక్రా నీటిని తయారు చేయడం సులభం. 24 గంటలు లేదా రాత్రిపూట నీటిలో నానబెట్టడం ద్వారా తయారు చేయవచ్చు. శుభ్రంగా కడిగిన నాలుగు బెండకాయలను ముక్కలుగా కోసం రాత్రంతా నీటిలో ఉంచాలి. దీని మొత్తం వల్ల పోషకాలు నీటిలోకి చేరతాయి. ఉదయాన్ని ఈ నీటిని సేవించడం వల్ల లభించే పోషకాలు, విటమిన్లు ఇలా ఉంటాయి.
పోషకాలు, విటమిన్లు
కేలరీలు: 31 కిలో కేలరీలు
ప్రోటీన్: 2 గ్రాములు
కొవ్వు: 0.2 గ్రాములు
పిండి పదార్థాలు: 7 గ్రాములు
ఫైబర్: 3 గ్రాములు
మాంగనీస్: రోజువారీ విలువలో 33శాతం (DV)
విటమిన్ సి: రోజువారీ విలువలో 24శాతం
చర్మ సౌందర్యం
చర్మానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. విటమిన్ సి, పొటాషియం, ఫోలియేట్ వంటి విటమిన్లు ,యు మినరల్స్‌తో నిండిన ఓక్రా వాటర్ సహజ చర్మ టానిక్‌గా పనిచేస్తుంది, ఆరోగ్యకరమైన , ప్రకాశవంతమైన ఛాయను అందిస్తుంది. యాంటీఆక్సిడెంట్ కంటెంట్ ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తుంది.
ముఖ్యంగా, ఓక్రాలో ముఖ్యంగా మాంగనీస్ పుష్కలంగా ఉంటుంది, రక్తంలో చక్కెర నియంత్రణకు ఇది కీలకమైన ఖనిజం. అదనంగా, ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది, ఇది యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది , రోగనిరోధక పనితీరుకు మద్దతు ఇస్తుంది. స్త్రీ,పురుషుల్లో లిబిడో(శృంగారేచ్ఛ)ను పెంచడంలో దివ్యమైన ఔషధంలా పనిచేస్తుందని నమ్ముతారు.
Comments
Please login to add a commentAdd a comment