Okra
-
అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా? ఈ వాటర్ ట్రై చేయండి!
బరువు తగ్గాలనుకునేవారు రకరకాల పద్దతులను ప్రయత్నిస్తూ ఉంటారు. జీవన శైలి మార్పులతోపాటు, కొన్ని ఆహారనియమాలతో అధిక బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. వాటిల్లో ఒకటి ఓక్రా (బెండకాయ లేదా లేడీస్ ఫింగర్ ) వాటర్. పరగడుపున బెండ కాయ నీళ్లు తాగడం వల్ల చాలా ఆరోగ్యప్రయోజనాలున్నాయని పెద్దలు చెబుతారు. బరువు తగ్గడానికి, రక్తపోటు నియంత్రణలో బెండకాయ ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. బెండకాయలో కేన్సర్ నిరోధక లక్షణాలున్నాయి. ముఖ్యంగా పేగు కేన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీని వినియోగం, సమయం వ్యక్తిగత ప్రాధాన్యతలు, జీవనశైలిపై ఆధారపడి ఉంటుందనేది గమనించాలి. ఓక్రా వాటర్ అంటే ఏమిటి? బెండకాయ కూర, వేపుడు, పులుసు ఇలా రకరకాల వంట గురించి తెలుసు.కానీ చాలామంది ఓక్రా వాటర్, దాని ప్రయోజనాల గురించి పెద్దగా తెలియదు. ఓక్రా నీటిని తయారు చేయడం సులభం. 24 గంటలు లేదా రాత్రిపూట నీటిలో నానబెట్టడం ద్వారా తయారు చేయవచ్చు. శుభ్రంగా కడిగిన నాలుగు బెండకాయలను ముక్కలుగా కోసం రాత్రంతా నీటిలో ఉంచాలి. దీని మొత్తం వల్ల పోషకాలు నీటిలోకి చేరతాయి. ఉదయాన్ని ఈ నీటిని సేవించడం వల్ల లభించే పోషకాలు, విటమిన్లు ఇలా ఉంటాయి. పోషకాలు, విటమిన్లు కేలరీలు: 31 కిలో కేలరీలు ప్రోటీన్: 2 గ్రాములు కొవ్వు: 0.2 గ్రాములు పిండి పదార్థాలు: 7 గ్రాములు ఫైబర్: 3 గ్రాములు మాంగనీస్: రోజువారీ విలువలో 33శాతం (DV) విటమిన్ సి: రోజువారీ విలువలో 24శాతం చర్మ సౌందర్యం చర్మానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. విటమిన్ సి, పొటాషియం, ఫోలియేట్ వంటి విటమిన్లు ,యు మినరల్స్‌తో నిండిన ఓక్రా వాటర్ సహజ చర్మ టానిక్‌గా పనిచేస్తుంది, ఆరోగ్యకరమైన , ప్రకాశవంతమైన ఛాయను అందిస్తుంది. యాంటీఆక్సిడెంట్ కంటెంట్ ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. ముఖ్యంగా, ఓక్రాలో ముఖ్యంగా మాంగనీస్ పుష్కలంగా ఉంటుంది, రక్తంలో చక్కెర నియంత్రణకు ఇది కీలకమైన ఖనిజం. అదనంగా, ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది, ఇది యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది , రోగనిరోధక పనితీరుకు మద్దతు ఇస్తుంది. స్త్రీ,పురుషుల్లో లిబిడో(శృంగారేచ్ఛ)ను పెంచడంలో దివ్యమైన ఔషధంలా పనిచేస్తుందని నమ్ముతారు. -
బెండకాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి
రిఫ్రిజిరేటర్లో పెట్టినప్పటికీ ఒకోసారి బెండకాయలు పాడవుతుంటాయి. వర్షాకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. బెండకాయలను తాజాగా ఉంచేందుకు ఇలా చేసి చూడండి... ∙మార్కెట్ నుంచి లె చ్చిన బెండకాయల్లో తాజాగా ఉన్న బెండకాయలను ఏరి పక్కన పెట్టుకోవాలి. ∙తాజా బెండకాయలన్నింటిని స్పూను వెనిగర్ వేసిన నీటిలో వేసి ఇరవై నిమిషాలు ఉంచాలి. తరువాత సాధారణ నీటితో కడిగి, తడిలేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలి. ∙ ఆరిన బెండకాయలను నచ్చిన పరిమాణం, ఆకారంలో ముక్కలుగా తరిగి జిప్‌లాక్ బ్యాగ్‌లో వేసి రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకోవాలి. ∙ ఇలా నిల్వచేసుకుంటే బెండకాయలు ఎక్కువ రోజులపాటు తాజాగా , రుచిగా ఉంటాయి. అవసరమైనప్పుడు జిప్‌లాక్ బ్యాగ్‌ను బయటకు తీసి వేడినీటిలో కొద్దిసేపు ఉంచాలి. కూలింగ్ తగ్గిన తరువాత వాడుకోవాలి. -
యువరైతు ప్లాన్ సక్సెస్.. పచ్చని తోటలో ఎర్ర బెండలు!
ఆలమూరు: వ్యవసాయంపై మక్కువ పెంచుకున్న ఆ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆదర్శంగా నిలుస్తున్నాడు. తనకున్న రెండున్నర ఎకరాల భూమిలో పూలు, కూరగాయలు సాగు చేస్తున్నాడు. ఓ అరెకరం పొలంలో మాత్రం వినూత్నంగా ఎర్రబెండలు సాగుచేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నాడు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంకకు చెందిన భీమాల రాఘవేంద్ర.. సోషల్ మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా జిల్లాలో మరెక్కడా లేని ఎర్రబెండ సాగుకు శ్రీకారం చుట్టారు. ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే శీతాకాలంలోనే దీనిని సాగుచేయాలన్న ఉద్యాన శాస్త్రవేత్తలు ఇచి్చన సలహాతో గత నవంబర్ చివరి వారంలో సాగు చేపట్టాడు. ముదురు ఆకుపచ్చ రంగు స్థానంలో ఎండు మిరప రంగును పోలి ఉన్న ఎర్ర బెండకాయలను ఆయన పండిస్తున్నాడు. విత్తనాలను వారణాశిలోని నేషనల్ సీడ్ కార్పొరేషన్ నుంచి ఆన్లైన్లో తెప్పించి.. అరెకరంలో ప్రయోగాత్మకంగా సాగు చేపట్టాడు. సాధారణ రకం బెండ 60 రోజుల్లో కోతకు వస్తుంది. కానీ ఎర్రబెండ మాత్రం 40 రోజుల్లోనే దిగుబడినిస్తోంది. అది కూడా సాధారణ పంట కంటే 20 శాతం అధికంగా. పచ్చ బెండ మాదిరిగా ఈ ఎర్ర బెండలో జిగురు లేదు. ఆకృతి కూడా ఆకర్షణీయంగా ఉండటంతో శాకాహారులు అమితంగా ఇష్టపడుతున్నారు. అయితే కూర వండాక ఎర్రబెండ ఆకుపచ్చ రంగుకు మారడం విశేషం. పుష్కలంగా పోషకాలు - విటమిన్ సీ, ఏ, బీతో పాటు ఫోలాసిన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. - కాల్షియం, ఫైబర్ సమృద్ధిగా ఉన్నాయి. కేలరీలు తక్కువ మోతాదులో ఉంటాయి. - కంటి చూపును మెరుగుపరచి, చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. - ఎర్ర రక్తకణాల సంఖ్యను, రోగ నిరోధక శక్తిని వృద్ధి చేస్తాయి. - ఎర్రబెండలో ఉండే ఫోలేట్ గర్భిణులకు ప్రయోజనకరంగా ఉంటుంది. - మధుమేహాన్ని అదుపులో ఉంచడం, బరువు తగ్గేందుకు సాయపడుతుంది. ప్రత్యేకతను చాటుకోవాలనే.. సహజ పంటలకు భిన్నంగా నూతన వంగడాల్ని ఈ ప్రాంత ఉద్యాన రైతులకు పరిచయం చేసి, తద్వారా వ్యవసాయ రంగంలో ప్రత్యేకతను చాటుకోవాలనే ఉద్దేశంతోనే ఎర్రబెండ సాగు చేశాను. ఆశించిన దానికంటే దిగుబడి ఎక్కువగా వచ్చింది. మార్కెట్లో గిట్టుబాటు ధర కూడా లభిస్తోంది. ఉద్యాన శాఖ రాయితీలిస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. – బి.రాఘవేంద్ర, రైతు. -
బెండ ... ధర బెంగ...
రైతుకు రూ. రెండే... రైతుబజారులో రూ.7 బహిరంగ మార్కెట్లో రూ.20 పంట దున్నేస్తున్న వైనం నూజివీడు : ఇప్పటి వరకు టమోటాకు ధర లేక పారబోయడం చూశాం. అయితే నేడు బెండకాయ రైతుల పరిస్థితీ అలాగే తయారైంది. ఒకవైపు రైతుబజారులో కిలో రూ.7, బహిరంగ మార్కెట్లో కిలో రూ.20 చొప్పున వ్యాపారులు విక్రయిస్తుండగా, పండిస్తున్న రైతుకు మాత్రం రూ.2 కంటే ఎక్కువ రావడం లేదు. దీంతో కోత ఖర్చులు రాక బెండతోటలను రైతులు దున్నించేస్తున్నారు. ప్రభుత్వాలు వ్యవసాయ ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంలో విఫలం కావడం వల్లనే రైతులు వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి పండించిన పంటలకు ధర లభించడం లేదు. దీంతో పెట్టుబడులు పెట్టి ఏడాదికేడాదికి నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. రైతుల పరిస్థితి ఇలా ఉంటే వ్యాపారులు, కమీషన్ వ్యాపారులు మాత్రం లాభపడుతున్నారు. నియోజకవర్గంలోని నూజివీడు, ముసునూరు, ఆగిరిపల్లి మండలాల్లో దాదాపు 5వందల ఎకరాల్లో బెండతోటలను సాగుచేశారు. వీరిలో ఎక్కువ శాతం మంది కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నవారే. ఎకరాకు రెండు పంటలకైతే రూ.25వేలు, ఒక పంటకైతే రూ.15వేలకు కౌలుతీసుకుని, కూరగాయలను పండిస్తున్నారు. పెట్టుబడితో సహా రూ. 30 వేలకు చేరుకుంటుంది. కాయ దిగుబడి వచ్చే ముందు వరకు కిలో రూ.15నుంచి రూ.25ల వరకు ధర పలికిన బెండకాయలు, దిగుబడి వచ్చేనాటి నుంచి రోజురోజుకు తగ్గుతూ వచ్చి రెండు రోజులుగా కిలో రూ.2కు పడిపోయింది. దీంతో కోతకూలి ఖర్చులు కూడా రావడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ పరిస్థితిలో ముసునూరు మండలం చింతలవల్లి, నూజివీడు మండలం హనుమంతులగూడెం ప్రాంతాల్లో బెండతోటలను దున్నేస్తున్నారు.