polyethylene cover
-
పాలిథిన్ కవర్లో పసికందు
మైలార్‌దేవ్‌పల్లి రంగారెడ్డి : పేగుబంధాన్ని మరిచారు. ఏ తల్లి కన్నబిడ్డో పాపం రోడ్డున పడేశారు. అప్పుడే పుట్టిన పసికందు పాలిథిన్ కవర్లో శవమై కనిపించింది. ఈ సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వట్టెపల్లి ప్రాంతంలో రోడ్డుపైన ఓ ప్లాస్టిక్ కవర్ పడి ఉంది. అక్కడే విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్ధ్య కార్మికులు కవర్‌ను పరిశీలించి చూడగా అందులో పసికందు కనిపించింది. ప్రాణాలతో ఉంటుందని స్థానికులు చూడగా.. అప్పటికే మృతి చెందింది. శిశువు మృతదేహం గురించి స్థానికులను అడిగినా.. ప్రయోజనం లేకుండాపోయింది. శిశువును ప్లాస్టిక్ కవర్లో తీసుకువచ్చి ఎవరో పడవేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ కార్మికుల సాయంతో శిశువును స్థానికంగా ఉన్న శ్మశానవాటికలో కననం చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నెయ్యి రాస్తే... సాయంత్రానికీ నిల్వ!
• క్యాబేజీ వండేటప్పుడు కాసిన్ని సోంపు గింజలు వేస్తే పచ్చి వాసన రాకుండా ఉంటుంది. • బెండకాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే... రెండు వైపులా తొడిమలు కోసేసి, పాలిథీన్ కవర్లో వేసి ఫ్రిజ్‌లో పెట్టాలి. • మసాలా గ్రైండ్ చేసిన తర్వాత మిక్సీ జార్ అదే వాసన వస్తూ ఉంటే... కొన్ని బ్రెడ్ ముక్కలు కానీ రస్కులు కానీ వేసి రెండు నిమిషాలు గ్రైండ్ చేస్తే సరి. • టీ మరిగించే పాత్రలు నల్లబడిపోతుంటాయి. అవి మళ్లీ తళతళలాడాలంటే ఉప్పుతో రుద్ది కడగాలి. • కేక్ కట్ చేసే ముందు చాకుని వేడి నీటిలో ముంచి తీసి, బట్టతో తుడిచి అప్పుడు కోస్తే... కేక్ అందంగా తెగుతుంది. • చపాతీలు సాయంత్రం వరకూ ఎండిపోకుండా మెత్తగానే ఉండాలంటే... వాటికి కొద్దిగా నెయ్యి రాసి, పాలిథీన్ కవర్లో పెట్టి ఉంచాలి. -
ఏ తల్లి కన్నబిడ్డో..!
ఆమదాలవలస : నవమాసాలు మోసి కన్న ఆడశిశువును పాలిథిన్ కవర్లో పెట్టి వదిలి వెళ్లిపోయింది ఓ తల్లి. సంచలనం రేకెత్తించిన ఈ ఘటన బుధవారం ఆమదాలవలసలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి అధికారులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డు వెంగళరావు కాలనీలో రైల్వే ట్రాకు పక్కన ఉన్న పొట్నూరు కృష్ణ ఇంటి వద్ద బాత్రూంలో ముక్కుపచ్చలారని పసికందును బుధవారం తెల్లవారుజామును గుర్తు తెలియని మహిళ విడిచి పెట్టివెళ్లిపోయింది. కృష్ణ భార్య ఉదయాన్నే బాత్ రూం తలుపు తీయగా పసికందు కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులకు, ఇరుగు పొరుగు వారికి విషయం చెప్పి పాపకు స్నానం చేయించింది. తర్వాత వార్డు కౌన్సిలర్ రెడ్డి గౌరి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లగా వెంగళరావు కాలనీకి చెందిన కోటేశ్వరరావు, ఇందిర దంపతులకు పిల్లలు లేరని వారు పెంచుకుంటామని ముందుకొచ్చారు. దీంతో వారికి పసికందును అప్పగించారు. వారు శిశువును శ్రీకాకుళంలో ఒక ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం అందించి తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. ఇంతలో 1098కు గుర్తు తెలియని వ్యక్తులు సమాచారం అందిచడంతో ఐసీడీఎస్, చైల్డ్ లైన్, బాలల సంరక్షణ కార్యాలయాల నుంచి అధికారులు, సిబ్బంది కాలనీకి చేరుకున్నారు. పసి పాపను శిశుగృహకు అప్పగించాలని, లేకుంటే కేసు పెట్టాల్సి వస్తుందని జిల్లా బాలల సంరక్షణాధికారి కె.వి.రమణ హెచ్చరించారు. దీనికి వారు ససేమిరా అనడంతో పోలీసులకు సమాచారం అందించారు. వారి సహాయంతో శిశువును శ్రీకాకుళం శిశుగృహకు తీసుకు వెళ్లిపోయారు. బిడ్డకు రక్షణ కల్పిస్తాం.. బిడ్డకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తామని బాలల సంరక్షణాధికారి తెలిపారు. పిల్లల కోసం శిశుగృహకు దరఖాస్తు చేసుకున్నవారికి బిడ్డను అందిస్తామని పేర్కొన్నారు. పసికందు కన్న తల్లిదండ్రులు పూర్తి ఆధారాలతో వస్తే సమగ్ర దర్యాప్తు జరిపి వారికే అందిస్తామని తెలిపారు. ఆయనతో పాటు ఐసీడీఎస్ సూపర్వైజర్ జె.విజయేశ్వరి, శిశుగృహ మేనేజర్ కె.నరేష్, చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ ఎం. సంతోష్, సిబ్బంది పాల్గొన్నారు. -
గూడు లేక డేరాలో..
అప్పులబాధతో రైతు ఆత్మహత్య.. దిక్కుతోచని కుటుంబం ఎల్లారెడ్డిపేట: బంగారు పంట పండుతుందనే తలంపుతో అప్పు చేశాడు. ఉన్న ఇంటినీ అమ్ముకున్నాడు. చివరికి అప్పు కట్టే పరిస్థితి లేక ఆత్మహత్య చేసుకున్నాడా రైతు. ఇప్పుడా కుటుంబం నిలువ నీడ లేక గ్రామ శివారులో పాలిథిన్ కవర్‌తో డేరా వేసుకొని నివాసముంటోంది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వీర్నపల్లిలో వెలుగుచూసింది. పిట్ల లింగం(58) అప్పుల బాధ తాళలేక సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న రెండెకరాల్లో వరి, పత్తి సాగు చేసేవారు. ఊళ్లో ఉపాధి కరువై రెండేళ్ల క్రితం కుమారుడు నాగరాజును రూ.లక్ష అప్పు చేసి గల్ఫ్ పంపించాడు. కంపెనీలో పనిలేక నాగరాజు ఏడాదికే ఉత్తచేతులతో తిరిగొచ్చాడు. కూతుళ్లు భాగ్యలక్ష్మి, కవిత పెళ్లి కోసం లింగం మరో రూ.2 లక్షలు అప్పు చేశాడు. అప్పులు ఓ వైపు పెరిగిపోతున్నా... భూమినే నమ్ముకుని మరో రూ.3 లక్షలు అప్పు చేసి నాలుగు బోర్లు వేశాడు. వాటిల్లో నీరు పడలేదు. ఈ ఏడాది అప్పు చేసి మరో రెండు బోర్లు వేశాడు. అయినా ఫలితం లేకుండా పోయింది. అప్పులు ఎక్కువ కావడంతో ఉన్న ఇల్లును అమ్మేశాడు. ఆరు బోర్లు వేసినా చుక్కనీరు లేక పంట ఎండిపోవడంతో లింగం తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అప్పులు తడిసి మోపెడు కావడంతో... తీర్చలేననే బెంగతో పొలంలోనే చెట్టుకు ఉరేసుకున్నాడు. లింగం ఆత్మహత్య చేసుకున్న మరుసటి రోజు నుంచి గ్రామశివారులో ఓ చిన్న డేరా వేసుకుని ఆ కుటుంబం తలదాచుకుంటోంది. అయితే, వీర్నపల్లిని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దేందుకు ఎంపిక చేసిన కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ శుక్రవారం గ్రామానికి వెళ్లగా, రైతు కుటుంబం డేరా వేసుకొని జీవిస్తున్న దృశ్యం కనిపించింది. ఆయన కుటుంబాన్ని పరామర్శించి, బాధితులను ఓదార్చారు. ప్రభుత్వ పరంగా లింగం కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.