ప్రతీకాత్మక చిత్రం
శివమొగ్గ(బెంగళూరు): ఫ్రిజ్‌లో చేయి పెట్టేముందు జాగ్రత్తగా ఉండాలి. శివమొగ్గ నగరలోని సహ్యాద్రి నగర లేఔట్ మూడో క్రాస్‌లో ఉన్న ఇంట్లో ఫ్రిజ్‌లో ఓ పాము కనిపించింది. శంకర్ అనే వ్యక్తి ఇంట్లోని ఫ్రిజ్‌లో ఉల్లిగడ్డల ట్రేలో పాము ఉండడంతో స్నేక్ కిరణ్‌కు కాల్ చేశారు. కిరణ్ అక్కడికి చేరుకుని సురక్షితంగా పామును రక్షించి అడవిలో వదిలిపెట్టాడు.
మరో ఘటనలో..
రైతులకు అవగాహన శిబిరం
హోసూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని గురువారం హోసూరు తాలూకా ఎం. కారుపల్లి గ్రామంలో జరిగిన రైతుల శిక్షణా శిబిరంలో డిప్యూటీ డైరక్టర్ రేణుక రైతులకు సూచించారు. వేసవి దుక్కి, సేంద్రియ పద్ధతిలో వ్యవసాయ సాగుపై ఒక్క రోజు శిక్షణా శిబిరం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రైతులకు అందజేస్తున్న రాయితీలు, వేసవి దుక్కి వల్ల ఉపయోగాలను, మట్టి పరీక్షలు, కిసాన్‌కార్డు లాభాలను వివరించారు. సిబ్బంది హరీష్, మురుగేషన్, సుగుణ, మీన, యల్లప్ప పాల్గొన్నారు.
చదవండి: మరో మహిళతో భార్యకు దొరికిపోయిన కేంద్ర మాజీ మంత్రి సోలంకీ
Comments
Please login to add a commentAdd a comment