కారు, ఫ్రిడ్జ్‌, ఏసీ ఉందా? అయితే వాటికి అనర్హులే! | Own a car, fridge or AC? You will get no welfare scheme benefits | Sakshi
Sakshi News home page

కారు, ఫ్రిడ్జ్‌, ఏసీ ఉందా? అయితే వాటికి అనర్హులే!

Published Mon, Aug 7 2017 12:00 PM | Last Updated on Sun, Sep 17 2017 5:16 PM

కారు, ఫ్రిడ్జ్‌, ఏసీ ఉందా? అయితే వాటికి అనర్హులే!

కారు, ఫ్రిడ్జ్‌, ఏసీ ఉందా? అయితే వాటికి అనర్హులే!

పట్టణ ప్రాంతాల్లో ప్రతి 10 మంది గృహదారులలో ఆరుగురు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.. ప్రభుత్వం అందించే ప్రజాసంక్షేమ పథకాలకు వారు అర్హులో కారో?

పట్టణ ప్రాంతాల్లో ప్రతి 10 మంది గృహదారులలో ఆరుగురు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.. ప్రభుత్వం అందించే ప్రజాసంక్షేమ పథకాలకు తాము అర్హులవుతామో కాదోనని... ఎందుకంటే తాజాగా ప్రభుత్వ ప్యానెల్‌ సమర్పించిన నివేదికల్లో నాలుగు రూముల ఇళ్లు లేదా నాలుగు కార్ల వాహనం లేదా ఎయిర్‌కండీషనర్‌ ఏదీ ఉన్న సంక్షేమ పథక ప్రయోజనాల నుంచి తొలగించాలని వెల్లడించింది. అంతేకాక రిఫ్రిజిరేటర్‌, వాషింగ్‌ మెషిన్‌, టూ-వీలర్స్‌ మూడు కలిగి ఉన్న పట్టణ ప్రాంత ప్రజలను ఆటోమేటిక్‌గా సంక్షేమ పథకాలకు అనర్హులు చేయాలని వివేక్ దేబ్రాయ్ కమిటీ ప్రతిపాదించింది. సామాజిక ఆర్థిక సర్వే చేపట్టిన ఈ కమిటీ ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ముందు ఉంచింది. నివాసిత, వృత్తిపరమైన, సామాజిక లేమి వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఆటోమేటిక్‌గా పట్టణ ప్రాంత ప్రజలకు సంక్షేమ పథకాల ప్రయోజనకారులుగా అవకాశం కల్పించాలని కూడా ఈ కమిటీ సూచించింది.  
 
పాలిథిన్‌ గోడ్‌ లేదా రూఫ్‌ కలిగి ఉన్న ఇళ్ల గృహదారులు, లేదా అసలు ఇళ్లు లేని గృహదారులకు ప్రయోజనాలను అందించాలని చెప్పింది. అంతేకాక ఆదాయం లేని వారికి, కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కు లేని వారికి లేదా కుటుంబానికి పెద్దగా పిల్లలే ఉంటున్న వారికి సంక్షేమ పథకాల ప్రయోజనాలను అందించాలని పేర్కొంది. మిగతా ప్రజలు వారు, ప్రజాసంక్షేమ ప్రయోజనాలు పొందుతారో లేదో? అంచనావేసుకోవాలని పేర్కొంది. హసిమ్‌ ప్యానల్‌ ప్రతిపాదల ప్రకారం 41 శాతం పట్టణ ప్రాంత ప్రజలు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలకు అర్హులవుతారో కారో అంచనావేసుకోవాల్సి ఉండగా.. తాజాగా వివేక్‌ దేబ్రాయ్‌ కమిటీ సూచించిన ప్రతిపాదనలో 59 శాతం మంది తమ అర్హతను అంచనావేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని సంబంధిత వర్గాలు చెప్పాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement