ఇంటిప్స్
బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే ఆ డబ్బాలో కరివేపాకు ఆకులు వేసి ఉంచాలి. యాలకుల లోపలి గింజలు వాడాకా పై పొట్టు పొడి చేసి చక్కెరలో కలపాలి. ఈ చక్కరెను టీలోకి వాడుకుంటే రుచిగానూ, సువాసనగానూ ఉంటుంది.కరివేపాకును గాజు సీసాలో వేసి గట్టిగా మూతపెట్టి, ఫ్రిజ్‌లో ఉంచితే ఆకులు ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉంటాయి. మామిడి ఊరగాయ చట్నీ ఎక్కువ రోజులు ఎర్రగా ఉండాలంటే తిరగమాతలో చిటికెడు బేకింగ్ సోడా కలపాలి.
పల్లీలను తరచూ వంటలలో ఉపయోగిస్తుంటారు. వంటకు వాడినప్పుడల్లా వాటిని, వేయించి పొడి చేసుకుంటుంటారు. అలా కాకుండా ఒకేసారి వేయించి, దంచి, డబ్బాలో ఉంచుకుంటే టైమ్, గ్యాస్ రెండూ ఆదా అవుతాయి.ఎండుమిరపకాయల్లో ఉప్పు, మంచి నూనె కలిపి ఉంచితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఉప్పు నీటిని చల్లి వాము(ఓమ)ను కొద్దిగా వేయించితే తినేటప్పుడు ఘాటుగా అనిపించదు.