మన ఇంట్లో ఎక్కువగా వాడే నిమ్మపండు లాంటి సిట్రస్ జాతి పళ్లను ఎక్కువ రోజులు తాజగా ఉంచడం కాస్త సమస్యగా ఉంటుంది. అలాగే పాయాసం, లేదా కిచిడీలో డేకరేషన్‌కి లేదా రుచి కోసం ఉపయోగించే సగ్గుబియ్యం లాంటివి హడావిగా ఆఫీస్‌కి వెళ్లేటప్పడూ వీటిని ఉపయోగించలేక ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే వాడటానికి ముందు ఆ సగ్గబియ్యాన్ని కొంచెంసేపు నీటిలో నాననివ్వాల్సి ఉంటుంది. బిజీబీజీ లేఫ్‌లో ఇలాంటి వాటి ఎన్నింటికో మంచి ఇంటి చిట్కాలు ఉన్నాయి వెంటనే ఫాలోకండి సత్వరమే ఆ ఇబ్బంది నుంచి బయటపడండి. సులువుగా వండేసుకోండి, కూరగాయాలు కూడా మంచిగా నిల్వ చేసుకోండి.
ఈజీ చిట్కాలు
- శుభ్రంగా కడిగి తుడిచిన నిమ్మకాయలకు కొద్దిగా నూనె రాసి టిష్యూపేపర్ వేసిన బాక్స్‌లో పెట్టి రిఫ్రిజిరేటర్‌లో పెడితే ఎక్కువ రోజులపాటు తాజాగా ఉంటాయి.
- గ్లాసు నీళ్లలో కొద్దిగా వెనిగర్ వేసి టూత్‌బ్రష్‌లను నానబెట్టాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో కడిగితే టూత్‌బ్రష్‌లు శుభ్రపడతాయి.
- సగ్గుబియ్యం చక్కగా నానిన తరువాత నీటిని వడగట్టి ఎయిర్ టైట్ కంటైనర్‌లో వేసి రిఫ్రిజిరేటర్‌లో పెట్టాలి. ఇవి నాలుగైదు రోజులపాటు తాజాగా ఉంటాయి. అప్పటికప్పుడు సగ్గుబియ్యం నానపెట్టుకోకుండా ఇలా నిల్వచేసిన సగ్గుబియ్యాన్ని తీసుకుని వెంటనే కిచిడి, పాయసం, ఇడ్లీ, దోశల్లోకి వాడుకోవచ్చు.
(చదవండి: ప్లాస్టిక్ మంచిదికాదని స్టీల్ వాటర్ బాటిల్స్ వాడుతున్నారా?)
Comments
Please login to add a commentAdd a comment