మీ ఫ్రిజ్ లో ఇవిగానీ ఉన్నాయా?!
ఆహారాన్ని దాచుకోవడానికి ఫ్రిజ్ ఉంది కదా అని ప్రతిదాన్నీ అందులో పెట్టేస్తుంటారు కొందరు. అలా చేయడం మంచిది కాదు. ఎందుకంటే
కొన్ని ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఫ్రిజ్ తగిన చోటు కాదు.
ఉల్లిపాయల్ని ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఎందుకంటే అందులోని చల్లదనం ఉల్లిపాయల్ని మెత్తబడిపోయేలా చేస్తుంది. కాఫీ గింజల్ని ఫ్రిజ్‌లో ఉంచితే అవి వాటి సహజ సువాసనను కోల్పోతాయి. చుట్టూ ఉన్నవాటి వాసనను పీల్చేసుకుంటాయి. ఆలివ్ నూనెను ఫ్రిజ్‌లో పెడితే దాని కన్సిస్టెన్సీ మారిపోతుంది. నూనె మరింత చిక్కబడిపోతుంది. తులసి ఆకు ఎంత సువాసన వస్తుందో, అంత త్వరగానూ తన వాసనను కోల్పోతుంది. అందుకే దాన్ని ఫ్రిజ్‌లో పెట్టకూడదు. పెడితే మిగతా పదార్థాల వాసనను సంగ్రహించి వాటి వాసన మారిపోతుంది.
తేనెను పరిమితిని మించిన చల్లదనంలో ఉంచితే అది గట్టిపడిపోయి పలుకులుగా అయిపోతుంది. కాబట్టి కాసిన్ని ఎక్కువ రోజులు దానిని నిల్వ ఉంచాలంటే ఫ్రిజ్‌లో పెట్టకపోవడమే మంచిది. {ఫిజ్‌లోని చల్లదనం బ్రెడ్‌లోని తేమను లాగేసి బిగుసుకుపోయేలా చేస్తుంది. వెల్లుల్లికీ అతి తేమ మంచిది కాదు. కాబట్టి ఫ్రిజ్ దానికి తగిన చోటు కాదు.
బంగాళదుంపల్ని ఫ్రిజ్‌లో ఉంచితే ఆ తేమకి వాటిలోని గంజిపదార్థం చక్కెరగా మారిపోతుంది. కాబట్టి వాటిని పెట్టకూడదు. అలాగే కాస్త పచ్చిగా ఉన్న టొమాటోల్ని ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఎందుకంటే అందులోని చల్లనిగాలి వాటిని పండనివ్వదు. దాంతో అవి ఫ్లేవర్‌ను కోల్పోతాయి.ఇక అరటిపండ్లు. తెలిసిందే. వాటిని ఫ్రిజ్‌లో పెడితే గట్టి పడి వాడికి ఉండే సహజమైన రుచిపోతుంది.
- సమీ