Sammy
-
సామీ, రస్సెల్, బ్రేవోలకు షాక్
సెయింట్ జోన్స్(ఆంటిగ్వా): కొంతమంది సీనియర్ క్రికెటర్లకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు(డబ్యూఐసీబీ) షాకిచ్చింది. 2015-16 సీజన్‌కు సంబంధించిన ఆటగాళ్ల కాంట్రాక్ట్ జాబితా ను 12 నుంచి 15 మందికి పెంచిన విండీస్ బోర్డు... పలువురు కీలక ఆటగాళ్లను తొలగించింది. వీరిలో ట్వంటీ 20 కెప్టెన్ డారెన్ సామీ, ఆల్ రౌండర్ డ్వేన్ బ్రేవో, ఆండ్రూ రస్సెల్ లకు కొత్త జాబితా నుంచి ఉద్వాసన పలికింది. గతేడాది నవంబర్ లో శ్రీలంకతో జరిగిన ట్వంటీ 20 సిరీస్ లో సామీ చివరిసారి ఆడగా, రస్సెల్ మాత్రం అదే సిరీస్ లో వన్డే సిరీస్ తో పాటు, ట్వంటీ 20 సిరీస్ లో ఆఖరిసారి పాల్గొన్నాడు. కాగా, సీనియర్ ఆటగాడు శివనారాయణ్ చంద్రపాల్ కు ఈసారి కూడా కొత్త జాబితాలో చోటు దక్కలేదు. మరోవైపు గతేడాది కాలంగా విండీస్ కాంట్రాక్ట్ జాబితాలో స్థానం కోల్పోయిన క్రిస్ గేల్ కు మరోసారి చుక్కెదురైంది. విండీస్ నూతన కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితా: జాసన్ హోల్డర్, క్రెయిగ్ బ్రాత్ వైట్, రాజేంద్ర చంద్రిక, డారెన్ బ్రేవో, మార్లోన్ శామ్యూల్స్, డేనిష్ రామ్ దిన్, దేవేంద్ర బిషో, షానోన్ గాబ్రియేల్, బ్లాక్ వుడ్, జెరోమ్ టేలర్, షెల్డాన్ కాట్రెల్, షై హోప్, షేన్ డోవ్రిచ్, లీన్ జాన్సన్, రోచ్. -
వన్డే జట్టులోనూ మాలిక్, సమీ
కరాచీ: పాకిస్తాన్ సీనియర్ ఆటగాళ్లు షోయబ్ మాలిక్, సమీ వన్డే జట్టులోనూ చోటు దక్కించుకున్నారు. జింబాబ్వేతో నేటి (మంగళవారం) నుంచి జరిగే మూడు వన్డేల సిరీస్ కోసం 16 మందితో కూడిన జట్టును ప్రకటించారు. చాలాకాలం తర్వాత వీరిద్దరూ ఆదివారం ముగిసిన టి20 సిరీస్‌కు ఎంపిక కాగా ఇద్దరూ బౌలింగ్‌లో విశేషంగా రాణించారు. మాలిక్ బ్యాటింగ్‌లో విఫలమైనా రెండేళ్ల అనంతరం సెలక్టర్లు వన్డేలో చోటు కల్పించారు. పాక్ స్పిన్నర్ హసన్‌పై రెండేళ్ల నిషేధం డోప్ పరీక్షలో విఫలమైన లెఫ్టార్మ్ స్పిన్నర్ రజా హసన్‌పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు రెండేళ్ల నిషేధం విధించింది. డోపింగ్‌పై 14 రోజుల్లో అప్పీల్ చేసుకోవాలని బోర్డు పంపిన షోకాజ్ నోటీసుకు క్రికెటర్ స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన పెంటాంగ్యులర్ టోర్నీ సందర్భంగా నిర్వహించిన రాండమ్ డోప్ టెస్టులో హసన్ విఫలమయ్యాడు. అతను కోకైన్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో మార్చి 24న పీసీబీ షోకాబ్ నోటీసు జారీ చేసింది. అయితే దీనిపై క్రికెటర్ ఎలాంటి అప్పీల్‌కు వెళ్లలేదు. -
మీ ఫ్రిజ్ లో ఇవిగానీ ఉన్నాయా?!
ఆహారాన్ని దాచుకోవడానికి ఫ్రిజ్ ఉంది కదా అని ప్రతిదాన్నీ అందులో పెట్టేస్తుంటారు కొందరు. అలా చేయడం మంచిది కాదు. ఎందుకంటే కొన్ని ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఫ్రిజ్ తగిన చోటు కాదు. ఉల్లిపాయల్ని ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఎందుకంటే అందులోని చల్లదనం ఉల్లిపాయల్ని మెత్తబడిపోయేలా చేస్తుంది. కాఫీ గింజల్ని ఫ్రిజ్‌లో ఉంచితే అవి వాటి సహజ సువాసనను కోల్పోతాయి. చుట్టూ ఉన్నవాటి వాసనను పీల్చేసుకుంటాయి. ఆలివ్ నూనెను ఫ్రిజ్‌లో పెడితే దాని కన్సిస్టెన్సీ మారిపోతుంది. నూనె మరింత చిక్కబడిపోతుంది. తులసి ఆకు ఎంత సువాసన వస్తుందో, అంత త్వరగానూ తన వాసనను కోల్పోతుంది. అందుకే దాన్ని ఫ్రిజ్‌లో పెట్టకూడదు. పెడితే మిగతా పదార్థాల వాసనను సంగ్రహించి వాటి వాసన మారిపోతుంది. తేనెను పరిమితిని మించిన చల్లదనంలో ఉంచితే అది గట్టిపడిపోయి పలుకులుగా అయిపోతుంది. కాబట్టి కాసిన్ని ఎక్కువ రోజులు దానిని నిల్వ ఉంచాలంటే ఫ్రిజ్‌లో పెట్టకపోవడమే మంచిది. {ఫిజ్లోని చల్లదనం బ్రెడ్లోని తేమను లాగేసి బిగుసుకుపోయేలా చేస్తుంది. వెల్లుల్లికీ అతి తేమ మంచిది కాదు. కాబట్టి ఫ్రిజ్ దానికి తగిన చోటు కాదు. బంగాళదుంపల్ని ఫ్రిజ్‌లో ఉంచితే ఆ తేమకి వాటిలోని గంజిపదార్థం చక్కెరగా మారిపోతుంది. కాబట్టి వాటిని పెట్టకూడదు. అలాగే కాస్త పచ్చిగా ఉన్న టొమాటోల్ని ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఎందుకంటే అందులోని చల్లనిగాలి వాటిని పండనివ్వదు. దాంతో అవి ఫ్లేవర్‌ను కోల్పోతాయి.ఇక అరటిపండ్లు. తెలిసిందే. వాటిని ఫ్రిజ్‌లో పెడితే గట్టి పడి వాడికి ఉండే సహజమైన రుచిపోతుంది. - సమీ