కరాచీ: పాకిస్తాన్ సీనియర్ ఆటగాళ్లు షోయబ్ మాలిక్, సమీ వన్డే జట్టులోనూ చోటు దక్కించుకున్నారు. జింబాబ్వేతో నేటి (మంగళవారం) నుంచి జరిగే మూడు వన్డేల సిరీస్ కోసం 16 మందితో కూడిన జట్టును ప్రకటించారు. చాలాకాలం తర్వాత వీరిద్దరూ ఆదివారం ముగిసిన టి20 సిరీస్‌కు ఎంపిక కాగా ఇద్దరూ బౌలింగ్‌లో విశేషంగా రాణించారు. మాలిక్ బ్యాటింగ్‌లో విఫలమైనా రెండేళ్ల అనంతరం సెలక్టర్లు వన్డేలో చోటు కల్పించారు.
పాక్ స్పిన్నర్ హసన్‌పై రెండేళ్ల నిషేధం
డోప్ పరీక్షలో విఫలమైన లెఫ్టార్మ్ స్పిన్నర్ రజా హసన్‌పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు రెండేళ్ల నిషేధం విధించింది. డోపింగ్‌పై 14 రోజుల్లో అప్పీల్ చేసుకోవాలని బోర్డు పంపిన షోకాజ్ నోటీసుకు క్రికెటర్ స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన పెంటాంగ్యులర్ టోర్నీ సందర్భంగా నిర్వహించిన రాండమ్ డోప్ టెస్టులో హసన్ విఫలమయ్యాడు. అతను కోకైన్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో మార్చి 24న పీసీబీ షోకాబ్ నోటీసు జారీ చేసింది. అయితే దీనిపై క్రికెటర్ ఎలాంటి అప్పీల్‌కు వెళ్లలేదు.