bed room
-
బెడ్రూంలో బాంబు
‘జింకను వేటాడేప్పుడు పులి ఓపికగా ఉంటది. అదే పులినే వేటాడాల్సొస్తే?! ఇంకెంత ఓపిక కావాలి?’ ఇది ఓ సినిమాలోని డైలాగ్. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేపై దాడి కోసం ఇజ్రాయెల్ నిఘా విభాగం మొసాద్ కూడా అచ్చం అలాగే ఓపిక పట్టింది. అది కూడా ఒక రోజో, రెండ్రోజులో కాదు.. ఏకంగా రెండు నెలలకు పైగా! ఆయన బస చేస్తారని భావించిన ఇంట్లో అప్పటికే బాంబు అమర్చి ఉంచింది. ఏ బెడ్రూంలోకి వెళ్తాడో పక్కాగా తెలుసుకుని మరీ అందులోనే బాంబును సిద్ధం చేసి పెట్టింది. అలా హనియే కోసం ముందస్తుగానే కాచుకుని కూచున్న మృత్యువు, సమయం రాగానే అమాంతంగా మింగేసింది...!ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో గత బుధవారం తెల్లవారుజామున జరిగిన పేలుడులో హనియే మరణించారు. అత్యంత కచి్చతత్వంతో కూడిన ఇజ్రాయెల్ క్షిపణి దాడే అందుకు కారణమని తొలుత వార్తలొచ్చాయి. క్షిపణిలాంటి వస్తువేదో హనియే గది కిటీకిని తాకడాన్ని ప్రత్యక్ష సాక్షులు చూశారని కొందరు చెప్పారు. అది క్షిపణి దాడేనని ఇరాన్ కూడా ఆరోపించింది. టెహ్రాన్‌లో కట్టుదిట్టమైన రక్షణలో ఉండే గెస్ట్ హౌస్‌ను హనియేకు కేటాయించారు. అలాంటి గెస్ట్ హౌస్‌పై సుదూరం నుంచి అంతటి కచి్చతత్వంతో క్షిపణి దాడి సాధ్యమేనా? పైగా క్షిపణి దాడితో భారీ విధ్వంసం జరుగుతుంది. కానీ ఆ గెస్ట్ హౌస్‌కు అంతటి నష్టమేమీ జరగలేదు. గది, పరిసర భాగాలే బాగా దెబ్బతిన్నాయి. అదే భవనంలో పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ నాయకుడు జియాద్ అల్ నఖలా బస చేసిన పక్క గది కూడా దెబ్బ తినలేదు. కనుక ఎలా చూసినా జరిగింది క్షిపణి దాడి కాదు.వామ్మో ఇజ్రాయెల్! హనియే మృతికి గది లోపలి పేలుడే కారణమని ఇరాన్ అధికారులు ఎట్టకేలకు గుర్తించారు. ఆ గదిలో రెండు నెలల కిందే బాంబు పెట్టారని తెలుస్తోంది. ఇరాన్ భద్రతలోని లోపాలనే అందుకు అనువుగా మార్చుకున్నారు. బాంబు పెట్టి రెండు నెలలపాటు ఓపికగా నిరీక్షించారు. ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారంలో పాల్గొనేందుకు హనియే టెహ్రాన్ చేరుకున్నారు. అది ముగిశాక గెస్ట్‌హౌస్‌కు చేరుకుని ఆ గదిలోకే వెళ్లినట్టు పక్కాగా నిర్ధారించుకున్న తర్వాతే రిమోట్‌తో బాంబు పేల్చారు. పేలుడు ధాటికి భవనం ఒక్కసారిగా కదిలిపోయింది. గోడలో కొంత భాగం కూలింది. కిటికీలు పగిలాయి. పేలుడు తీవ్రతకే హనియే మృతి చెందారు. ఈ కోవర్ట్ ఆపరేషన్ వివరాలన్నింటినీ పాశ్చాత్య అధికారులతో మొసాద్ పంచుకుందని న్యూయార్క్ టైమ్స్ వార్తా పత్రిక పేర్కొంది. దేశం వెలుపల రాజకీయ ప్రత్యర్థులు తదితర టార్గెట్ల ఏరివేతకు మొసాద్ పాల్పడుతోంది. ఇజ్రాయెల్‌పై హమాస్ అక్టోబర్ 7 దాడుల తర్వాత దాని అగ్ర నేతలందరినీ వేటాడతామని ప్రధాని నెతన్యాహూతో పాటు మొసాద్ చీఫ్ డేవిడ్ బరి్నయా కూడా ప్రతిజ్ఞ చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బెడ్ రూంలో నుండి వింత శబ్దాలు.. కట్ చేస్తే
-
బెడ్ రూమ్‌లోని ఫ్రిజ్ ప్రాణాంతకమా? నిపుణులు ఏమంటున్నారు?
కొందరు అర్ధరాత్రి సమయంలోనూ ఆహారం తినాలని అనుకుంటారు. అలాంటివారు రిఫ్రిజిరేటర్‌ను పడకగదికి సమీపంలో ఉంచడానికి ఇష్టపడతారు. మరికొందరు బెడ్రూమ్లోనే ఫ్రిజ్ పెట్టుకుంటారు. బెడ్రూమ్లో ఫ్రిజ్‌ని పెట్టుకున్న వారి లిస్ట్‌లో మీరు కూడా ఉంటే ఈ వార్త మీకోసమే. బెడ్రూమ్లో ఫ్రిజ్ ఉంచడం అత్యంత ప్రమాదకరమని ఓ పరిశోధనలో వెల్లడైంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పడకగదిలో రిఫ్రిజిరేటర్ ఉంచడం సురక్షితం కాదనడానికి పూర్తి స్థాయిలో శాస్త్రీయ ఆధారాలు లభించకపోయినా, ప్రమాదం పొంచివుండవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే ఫ్రిజ్ నుండి వెలువడే రేడియేషన్ గురించి చాలామంది ఆందోళన చెందుతుంటారు. వాస్తవానికి దీని నుంచి వచ్చే రేడియేషన్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే రిఫ్రిజిరేటర్లోని గ్యాస్ కంప్రెసర్లోనే ఉంటుంది. అందువల్ల అది లీకయ్యే ఛాన్స్ ఉండదని నిపుణులు చెబుతున్నారు. రిఫ్రిజిరేటర్ పాడైపోయినప్పుడు ఈ రేడియేషన్‌లో కొంత గదిలోకి లీక్ అయ్యే అవకాశం ఉంది. మరో ఆందోళన కలిగించే అశం ఏమంటే రిఫ్రిజిరేటర్ అగ్ని ప్రమాదాలకు తావిస్తుందని చాలామంది అంటారు. అయితే ఇందుకు చాలా తక్కువ ఆస్కారం ఉంటుంది. కొత్త మోడళ్ల ఫ్రిజ్‌లలో అనేక భద్రతా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. రిఫ్రిజిరేటర్ అదనపు వేడిని కలిగిస్తుంది. ఫ్రిజ్ నుండి వచ్చే వేడి పడకగది ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఫ్రిజ్‌ని బెడ్రూమ్లో ఉంచాలని నిర్ణయించుకుంటే, దాని నుంచి వచ్చేవేడిని బయటకు పంపడానికి దానిని కిటికీ దగ్గర ఉంచాలి. ఆహారాన్ని చల్లగా, తాజాగా ఉంచడానికి రిఫ్రిజిరేటర్ రోజంతా పని చేస్తుంది. కాగా ఫ్రీయాన్ వాయువు ద్రవ రూపంలోకి మారి లీక్ అయితే పలు వ్యాధులకు కలిస్తుంది. అయితే ఇది చాలా అరుదుగా జరుతుంది. దీనిని పీల్చినట్లయితే, ప్రాణాంతకంగా మారే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందుకే రిఫ్రిజిరేటర్‌ను ఎప్పటికప్పుడు సాంకేతిక నిపుణులతో చెక్ చేయించాలి. ఇది కూడా చదవండి: వీధి కుక్కలను చంపడం తప్పుకాదని గాంధీ ఎందుకన్నారు? -
నన్నూ పడక గదికి రమ్మన్నారు
- నటి, 'మరియాన్' ఫేమ్ పార్వతి సంచలన వ్యాఖ్యలు గాయని సుచిత్ర రేపిన కలకలం ఇంకా సద్దుమణగలేదు. దానికి శాఖలు విస్తరిస్తూనే ఉన్నాయి. ఇటీవల వరుసగా ప్రముఖ నటుల రాసలీల దృశ్యాలను తన ట్విట్టర్లో వెల్లడించి సినీ వర్గాల్లో సంచలనం సృష్టించిన సుచిత్ర ఇతర నటీమణుల్లో తెగింపును తెచ్చిపెట్టింది. ఇప్పటికే నటి వరలక్ష్మీ శరత్‌కుమార్, సంధ్య, కస్తూరి లాంటి కొందరు హీరోయిన్లు తమ చేదు అనుభవాలను బహిరంగంగానే వెల్లడిం చారు. తాజాగా నటి పార్వతి గొంతు విప్పారు. పూ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన నటి ఈ మలయాళీ భామ. ఆ తరువాత ధనుష్‌కు జంటగా మరియాన్, ఆర్య, రానా, బాబిసింహాలతో కలిసి బెంగళూర్ డేస్ చిత్రాల్లో నటించారు. ఇక్కడ తను చేసింది తక్కువ చిత్రాలే అయినా మంచి గుర్తింపునే తెచ్చుకున్నారనే చెప్పాలి. మలయాళంలోనూ నటిస్తున్న పార్వతి ఇటీవల ఒక చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో హీరోయిన్లతో చిత్ర పరిశ్రమలో ఎలా ప్రవర్తిస్తారన్న ప్రశ్నకు ప్రస్తుతం పరిశ్రమలో జరుగుతున్న ప్రచారం వాస్తవమేనన్నారు. పడక గదికి రమ్మనే చేదు అనుభవాన్ని తాను ఎదుర్కొన్నానని చెప్పారు. మలయాళంలో అవకాశాల పేరుతో హీరోలు, దర్శకులు తనను పలుమార్లు పడక గదికి రమ్మన్నారని, మరి కొందరు సినిమాల్లో ఇదంతా మామూలే అని ఉచిత సలహాలు ఇచ్చారని అన్నారు. అయితే అలాంటి అవకాశాలు తనకు వద్దని ఖరాఖండిగా చెప్పానని తెలిపారు. తాను తక్కువ చిత్రాలు చేయడానికి ఇదీ ఒక కారణం అని నటి పార్వతి పేర్కొన్నారు. అలా అవకాశాలు లేకుండా తాను చాలా కాలం ఖాళీగానే ఇంట్లో కూర్చున్నానని చెప్పారు. -
బెడ్ రూంలో స్పై కెమెరాలు
నిందితుడి రిమాండ్ హైదరాబాద్ (చాంద్రాయణగుట్ట): ఇంట్లో అద్దెకుంటున్న వారి పడక గదులలో స్పై కెమెరాలు బిగించిన వ్యక్తిని ఛత్రినాక పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. డీఐ సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..గౌలిపురా నల్లపోచమ్మ బస్తీకి చెందిన విజయానంద్ కార్పెంటర్, ఎలక్ట్రిషియన్‌గా పని చేసేవాడు. ఇతను తన ఇంట్లోని మూడు పోర్షన్ల చెందిన బెడ్ రూంలలో మూడు నెలల క్రితం స్పై కెమెరాలు ఏర్పాటు చేసి తన ఇంట్లో ఏర్పాటు చేసుకున్న కంప్యూటర్ ద్వారా వీక్షించేవాడు. దీనిపై కిరాయిదారురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అతని నుంచి కంప్యూటర్, మూడు స్పై కెమెరాలు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. -
నీటిలో బెడ్ రూం..
-
వాస్తు-శుభమస్తు
సాక్షి, హైదరాబాద్: ఉత్తర దిశలో ఉండే పడక గదికి ఉదయం సూర్యకిరణాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఈ గదిలో తలను తూర్పు లేదా దక్షిణ దిశవైపు పెట్టి పడుకోవాలి. చక్కటి నిద్ర పడుతుంది. * కుటుంబ పెద్ద పడుకునే గది నైరుతి దిక్కులో ఉండాలి. ఒకవేళ ఇల్లు మొదటి, రెండో అంతస్తులో ఉంటే కుటుంబ పెద్దకు పడక గది పై అంతస్తులో ఉండడం మేలు. అది కూడా నైరుతీ దిశలోనే ఉండాలి. పెళ్లికాని పిల్లలకు మాత్రం పడక గది నైరుతి దిశలో ఉండకపోవడమే మంచిది. * పిల్లలకు పడక గది పశ్చిమ దిశలో ఉంటే మేలు. పెళ్లి కాని పిల్లలకు, ఇంటికి వచ్చే అతిథుల కోసం తూర్పు దిశగా ఉండే పడక గది అనువుగా ఉంటుంది. కొత్తగా పెళ్లయిన జంట మాత్రం ఈ దిశలోని పడక గదిని ఉపయోగించకపోవడం మంచిది. * ఈశాన్యం దేవతలకు స్థానం కాబట్టి.. ఏ పడక గది కూడా ఈ దిశలో ఉండకూడదు. * పడక గది ఇంటికి ఆగ్నేయ దిశలో ఉంటే.. అకార ణంగా దంపతుల మధ్య కీచులాటలు పెరుగుతాయి. అనవసర ఖర్చులూ అధికమవుతాయి. * నైరుతీ దిశలోనే గదిలో నైరుతీ మూలలో బరువైన వస్తువులు పెట్టాలి. మంచం విషయానికొస్తే పడక గదిలో మంచం దక్షిణం, పశ్చిమం లేదంటే నైరుతి దిశల్లో ఉండొచ్చు. * తూర్పు వైపు కాళ్లు పెట్టుకొని పడుకుంటే పేరు ప్రఖ్యాతలు రావడంతో పాటు ఐశ్యర్య వృద్ధికి అవకాశాలుంటాయి. అదే పశ్చిమం వైపు అయితే ప్రశాంతతో పాటు ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది. ఉత్తర దిశలో అయితే సంపద వృద్ధికి అవకాశాలుంటాయి. ఒకవేళ దక్షిణ దిశవైపు కాళ్లు పెడితే మాత్రం చక్కటి నిద్రకు దూరమవుతారు. * పడక గదిలో డ్రెస్సింగ్ టేబుల్ ఉత్తర దిశకు తూర్పు వైపు ఉండాలి. చదువుకోవటం, రాసుకోవటం వంటివి పడక గదిలో పశ్చిమ దిశలో చేయాలి. తూర్పు వైపు కూడా ఇలాంటి పనులు చేసుకోవచ్చు. -
పట్టపగలే దోచేశారు
నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్ : ఆ ఇంట్లో వారి కదలికలపై నిఘాపెట్టారు. ఇంటి యజమానులతో పాటు పనిమనిషి బయటకెళ్లగానే తలుపులు పగలగొట్టిలోనికి ప్రవేశించారు. బెడ్రూంలోని బీరువా, మంచం అల్మారాలో ఉన్న సుమారు రూ.42 లక్షల విలువైన బంగారు ఆభరణాలను అపహరించారు. నెల్లూరు నగరంలోని వేదాయపాళెం సమీపంలో ఉన్న వెంకటరెడ్డినగర్‌లో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ ఘటన జిల్లాలో కలకలం సృష్టించింది. ఇదే ఇంట్లో కొద్ది నెలల క్రితం చోరీ జరగడం గమనార్హం. పోలీసుల కథనం మేరకు.. కాంట్రాక్టర్ తల్లపనేని చిన్న వెంకటేశ్వర్లు, హైమావతి దంపతులు వెంకటరెడ్డినగర్‌లో నివాసముంటున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన వీరి కుమారుడు శ్రీనివాసులు భార్య స్రవంతి, కుమార్తెతో కలిసి బెంగళూరులో ఉంటున్నారు. గురువారం స్రవంతి సోదరుడు కృష్ణచైతన్య వివాహం కావడంతో నాలుగురోజుల క్రితం కుటుంబసమేతంగా నెల్లూరుకు వచ్చారు. కోడలి సోదరుడి వివాహం కావడంతో బ్యాంకు లాకర్లో ఉన్న నగలను చిన్నవెంకటేశ్వర్లు రెండు రోజుల కిందట ఇంటికి తెచ్చా రు. గురువారం నగరంలోని రమారాయల్ కల్యాణ మండపంలో జరిగిన కృష్ణచైతన్య వివాహానికి అందరూ వెళ్లొచ్చారు. శుక్రవారం వేదాయపాళెంలోని ఎల్ఎల్ఎఫ్ స్కూలు సమీపంలో ఉన్న పుట్టింట్లో సత్యనారాయణ వ్రతం కావడంతో స్రవంతితో పాటు కుటుంబసభ్యులందరూ ఉదయం 11 గంటలకు అక్కడకు వెళ్లారు. వెళ్లే సమయంలో పనిమనిషి షాబు బయట అంట్లు తోముతుండగా పనిపూర్తయిన తర్వాత సందులో పెట్టాలని సూచించారు. షాబు పనిపూర్తి చేసుకుని 12 గంటలకు అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు తలుపులు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. బెడ్రూంలోని బీరువాను పగలగొట్టడంతో పాటు మంచం కింద ఉన్న అల్మారాను తెరిచారు. వీటిలో ఉన్న సుమారు రూ.42 లక్షల విలువైన 175 సవర్ల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. వెండివస్తువులు ఉన్నప్పటికీ అక్కడే వదిలివెళ్లారు. వ్రతం పూర్తయిన తర్వాత హైమావతి కుమారుడు శ్రీనివాసులుతో కలిసి ఇంటికి వచ్చారు. ఇంట్లో సామాన్లన్నీ చిందరవందరగా పడివుండడంతో పాటు బీరువా, అల్మారాలోని నగలు కనిపించకపోవడంతో షాక్‌కు గురయ్యారు. హైమావతి వెంటనే విషయాన్ని భర్తకు తెలియజేయడంతో ఆయన పోలీసులకు సమాచారం అందించారు. సిటీ డీఎస్పీ పి.వెంకటనాథ్‌రెడ్డి, ఐదో నగర ఇన్స్పెక్టర్ ఎస్వీ రాజశేఖరరెడ్డి, ఎస్సైలు విజయకుమార్, వేమయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం వేలిముద్రలను సేకరించగా, డాగ్‌స్క్వాడ్ నిందితుల ఆధారాల కోసం గాలించింది. విభిన్న కోణాల్లో దర్యాప్తు ఈ భారీ చోరీ ఘటనపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. చిన్నవెంకటేశ్వర్లు కుటుంబసభ్యుల కదలికలను దగ్గర నుంచి పరిశీలిస్తున్న వారే ఈ చోరీకి పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. మొదట రెక్కీ నిర్వహిం చినట్లు భావిస్తున్నారు. మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట మధ్యే చోరీ జరిగినట్లుండటంతో దొంగలు ఇంటికి సమీపంలోనే మాటేసినట్లు నిర్ధారణకు వచ్చారు. ఇదే ఇంట్లో కొద్ది నెలల క్రితం దొంగలు చొరబడి సుమారు రూ.45 వేల నగదు, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ అపహరించారు. అప్పట్లో ఆ ఘటనకు పాల్పడిన వారే మళ్లీ ఇప్పుడు తెగబడ్డారా అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులతో పాటు పనిమనిషి షాబును విచారించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ పి.వెంకటనాథ్‌రెడ్డి చెప్పారు. శుభకార్యం కావడంతో... కోడలి అన్న పెళ్లి కావడంతో నగలను లాకరు నుంచి తెచ్చామని బాధితుడు చిన్నవెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం మళ్లీ లాకరులో పెడదామనుకున్నామని, ఇంతలోనే దొంగలు పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.