ఏఐ సాయంతో అరుదైన బట్టమేక పిట్ట పిల్ల జననం | Rare Baby Bird Born from AI | Sakshi
Sakshi News home page

ఏఐ సాయంతో అరుదైన బట్టమేక పిట్ట పిల్ల జననం

Published Wed, Oct 23 2024 9:15 AM | Last Updated on Wed, Oct 23 2024 10:28 AM

Rare Baby Bird Born from AI

జైసల్మేర్: రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో గల సుదాసరి గ్రేట్‌ ఇండియన్‌ బస్టర్డ్‌ బ్రీడింగ్‌ సెంటర్‌లో శాస్త్రవేత్తలు ఏఐ సాయంతో కృత్రిమ గర్భధారణ పద్ధతిని అనుసరించి, అరుదైన బట్టమేక పిట్ట పిల్ల​కు జన్మనిచ్చారు.  

ప్రపంచంలో ఇటువంటి ఘనత సాధించిన దేశంగా భారత్‌ నిలిచిందని, ఇకపై అంతరించి పోతున్న అరుదైన బట్టమేకపిట్ట పక్షి జాతికి రక్షణ లభిస్తుందని  సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బట్టమేక పిట్ట స్మెర్మ్‌ను సేవ్‌ చేసేందుకు బ్యాంకును ఏర్పాటు చేయడం ద్వారా ఈ అరుదైన పక్షి జాతి కాపాడుకోగలుగుతామని శాస్త్రవేత్త  ఆశిష్ వ్యాస్ తెలిపారు.

ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ హౌబారా కన్జర్వేషన్ ఫౌండేషన్ అబుదాబి (ఐఎఫ్‌హెచ్‌సీ)లో టైలర్ పక్షిపై ఈ తరహా పరీక్ష నిర్వహించామని, అది విజయవంతమైందని ఆశిష్ వ్యాస్ తెలిపారు. ఇండియాస్ వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ)కి చెందిన శాస్త్రవేత్తలు  గత ఏడాది అక్కడికి వెళ్లి ఈ టెక్నిక్ నేర్చుకున్నారన్నారు. తదనంతరం బట్టమేక పిట్ట పిల్లను సృష్టించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయన్నారు. సెప్టెంబర్ 20న టోనీ అనే ఆడ బట్టమేక పిట్టకు కృత్రిమ గర్భధారణ చేశామన్నారు.

అది సెప్టెంబరు 24న గుడ్డు పెట్టిందని, ఆ గుడ్డును శాస్త్రవేత్తలు జాగ్రత్తగా పర్యవేక్షించారు. అంతిమంగా శాస్త్రవేత్తల కృషి ఫలించి, అక్టోబర్ 16న గుడ్డులోంచి బట్టమేక పిట్ట పిల్ల బయటకు వచ్చిందని వ్యాస్‌ తెలిపారు.  ఆ పిల్లను వారం రోజుల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచి, అన్ని వైద్య పరీక్షలు చేశారు. ఇప్పుడు  బట్టమేక పిట్ట పిల్ల ఆరోగ్యంగా ఉందని వ్యాస్‌ తెలిపారు. ఈ పద్ధతిని ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ (ఏఐ)గా పిలుస్తారన్నారు. ఈ బట్టమేక పిట్ట పిల్లకు ఏఐ అనే పేరు పెట్టాలకుంటున్నామని వ్యాస్‌ పేర్కొన్నారు. 

ఇది కూడా చదవండి: లోదుస్తులు చోరీ.. పోలీసులకు ఫిర్యాదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement