పేలిన పేపర్ బాంబు
Published Wed, Feb 22 2017 1:33 PM | Last Updated on Tue, Aug 14 2018 3:25 PM
ఇటాలీయన్ పార్లమెంట్‌కు దగ్గరలోనే మంగళవారం పేపర్ బాంబు పేలింది. ఈ విషయంపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆలస్యం చేస్తోంది. దీనికి స్పందించిన కార్ డ్రైవర్లు ఆరు రోజులపాటు సమ్మెకు దిగారు. , ఇటలీ రవాణాశాఖ మంత్రి గ్రజీయానో డెర్లియో ట్యాక్సి డ్రైవర్ల ప్రతినిధులతో మాట్లాడి డ్రైవర్లు సమ్మే విరమించేలా చేయాలని సూచించారు.
ఈ బాంబు ప్రేలుడులో ఏ ఒక రాజకీయ నాయకుడుగాని, పోలీసులు గానీ గాయపడలేదని డ్రైవర్లు తెలిపారు. అంతేకాక పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో ఒక విలేఖరికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కొంతమంది డెమోక్రటిక్ పార్టీ హెడ్‌క్వార్టర్స్ వైపు గూడ్లు విసిరారు. కార్ డ్రైవర్లు మాట్లాడుతూ 2017 చట్టం నమూనాలో కార్ల అద్దె,కార్-షేర్ సేవలు కంట్రోల్ చేయాలని పేర్కొన్నారు. సమ్మే సమయంలో కూడా ఆసుపత్రులకు, గర్భణీలకు ట్యాక్సీ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
Advertisement