ఇటలీలో ప్రేమాయణం | prabhas , pooja hegde movie shooting in italy | Sakshi
Sakshi News home page

ఇటలీలో ప్రేమాయణం

Published Thu, Oct 4 2018 12:53 AM | Last Updated on Thu, Aug 22 2019 9:35 AM

prabhas , pooja hegde movie shooting in italy - Sakshi

కొత్త చిత్రం కోసం ప్రభాస్‌ ఇటలీలో ల్యాండైపోయారు. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా ఓ పీరియాడికల్‌ లవ్‌స్టోరీ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తారు. ఇటీవల ఈ సినిమా సెట్‌ వర్క్‌ ఇటలీలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనడం కోసమే ఇటలీ వెళ్లారట ప్రభాస్‌. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ íపీరియాడికల్‌ లవ్‌స్టోరీ రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెల 6 నుంచి మొదలవుతుందని సమాచారం. వెండితెరపై ప్రభాస్‌ కొత్త ప్రేమాయణం మొదలవడానికి సమయం దగ్గర పడుతోందన్నమాట.
∙డాన్‌ ఆల్వరో, ప్రభాస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement