ప్రఖ్యాత పీసా టవర్ను పేల్చేసేందుకు ఇటలీ మాఫియా కుట్ర పన్నింది. పీసా టవర్తో పాటు ఇటలీలోని ఇతర చారిత్రక కట్టడాలను కూల్చేసేందుకు మాఫియా పథకం వేసింది.
రోమ్: ప్రఖ్యాత పీసా టవర్ను పేల్చేసేందుకు ఇటలీ మాఫియా కుట్ర పన్నింది. పీసా టవర్తో పాటు ఇటలీలోని ఇతర చారిత్రక కట్టడాలను కూల్చేసేందుకు మాఫియా పథకం వేసింది. పీసా టవర్ మరెంతోకాలం ఉండబోదని ఓ మాఫియా నాయకుడు హెచ్చరించినట్టు పోలీసుల దృష్టికి వచ్చింది.
ఇటలీలోని ప్రఖ్యాత చర్చిలు, ఇతర కట్టడాలు మాఫియా హిట్ లిస్టులో ఉన్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. మాజీ పోలీస్ అధికారులు, మాజీ న్యాయమూర్తులు, సీనియర్ రాజకీయ నాయకుల్ని లక్ష్యంగా చేసుకున్నారు. యాంటీ మాఫియా మాజీ ప్రాసిక్యూటర్, ప్రస్తుత ఇటలీ సెనెట్ స్పీకర్ ఫీట్రో గ్రాసోను కూడా హిట్ లిస్టులో ఉన్నారు. జైల్లో ఉన్న మాఫియా బాస్ టోటో రీనాను విచారించిన సందర్భంగా ఈ విషయాలు బయటపడ్డాయి. అతణ్ని ఆరెస్ట్ చేసిన పోలీస్ అధికారిని కూడా మాఫియా టార్గెట్ చేసింది.