Leaning Tower of Pisa
-
Garisenda Tower: వాలుతున్న వెయ్యేళ్ల టవర్
ఇటలీ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది పీసా నగరంలోని ప్రపంచ ప్రఖ్యాత లీనింగ్ టవరే. నాలుగు డిగ్రీల కోణంలో ఒకవైపు వాలిపోయి అందరికీ ఆకట్టుకుంటూ కని్పస్తుందా కట్టడం. అయితే ఇటలీలోనే మరో లీనింగ్ టవర్ కూడా ఉంది. అది కూడా కాస్త అటూ ఇటుగా పీసా టవర్ అంత ఎత్తు ఉంటుంది. అలాంటి టవర్ కాస్తా ఇప్పుడు ఏ క్షణమైనా కుప్పకూలేలా కని్పస్తూ గుబులు రేపుతోంది....! ఇటలీలోని బొలోగ్నా నగరంలో గారిసెండా టవర్ ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. పీసా టవర్ మాదిరిగానే ఇది కూడా నానాటికీ ఓ పక్కకు వాలిపోతుండటమే ఇందుకు కారణం. అలా ఈ టవర్ ఇప్పటిదాకా 4 డిగ్రీల కోణంలో పక్కకు ఒరిగింది. దీనికి తోడు దాని పునాదులు కొంతకాలంగా బాగా బలహీనపడుతూ వస్తున్నట్టు అధికారులు తేల్చారు. దాంతో నగర కౌన్సిల్ హుటాహుటిన సమావేశమై దీని గురించి కూలంకషంగా చర్చించింది. టవర్ ఏ క్షణమైనా కుప్పకూలే ప్రమాదముందని ధ్రువీకరించింది. అదే జరిగితే శిథిలాల ధాటికి పరిసర చుట్టుపక్కల అతి సమీపంలో ఉన్న పలు నివాస, వాణిజ్య సముదాయాలు తీవ్రంగా దెబ్బ తినే ప్రమాదముంది. దీన్ని నివారించేందుకు ముందు జాగ్రత్త చర్యగా టవర్ చుట్టూ యుద్ధ ప్రాతిపదికన 5 మీటర్ల ఎత్తున బారియర్ నిర్మిస్తున్నారు. 2024 ఏప్రిల్ లోపు దాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాంతోపాటు టవర్ చుట్టూ మెటల్ రాక్ ఫాల్ వలలను ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా అది కూలినా పరిసర నిర్మాణాలకు ఎలాంటి నష్టమూ లేకుండా చూసేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ నుంచి టవర్, దాని గ్రౌండ్ ఫ్లోర్‌లోని ప్లాజాలోకి సందర్శకులకు అనుమతి నిరాకరించారు. సందర్శనపై నిషేధం మరికొన్నేళ్ల దాకా (టవర్ కూలని పక్షంలో) కొనసాగుతుందని ఇప్పటికే ప్రకటించారు. బారియర్ నిర్మాణ వ్యయం 37 లక్షల పౌండ్లు(దాదాపు రూ.39.10 కోట్లు)గా అంచనా వేశారు. దీనికోసం ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తుండటం విశేషం! ‘‘నగరవాసులతో పాటు బొలోగ్నా నగరాన్ని, దాని ప్రఖ్యాత పర్యాటక చిహా్నలను కాపాడాలని తపిస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రియులందరూ ఈ బృహత్తర యజ్ఞంలో భాగస్వాములు కావాలి’’ అంటూ నగర కౌన్సిల్ పిలుపునిచి్చంది. నిలబెట్టేందుకు తీవ్ర యత్నాలు గారిసెండా టవర్ కూలిపోకుండా కాపాడేందుకు ఇటలీ శాయశక్తులా ప్రయతి్నస్తోంది. పీసా టవర్ కూడా క్రమంగా మరింత పక్కకు వాలి త్వరలో కూలిపోవడం ఖాయమని కొన్నేళ్ల క్రితం వార్తలొచ్చాయి. కానీ ప్రభుత్వం ఏళ్ల తరబడి నానా ప్రయత్నాలూ చేసి దాని ఒంపును కొంతమేర సరిచేసింది. ప్రస్తుతానికి అది కుప్పకూలే ముప్పు లేదని తేలి్చంది. అలా పీసా టవర్‌ను కాస్త సురక్షితంగా మార్చిన అనుభవాన్నంతా గారిసెండా విషయంలో రంగరిస్తున్నారు. ఇందుకోసం సివిల్ ప్రొటెక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. తొలి దశలో దీన్ని వీలైనంత సురక్షితంగా తీర్చిదిద్దే పనిలో పడ్డారు. సంబంధిత పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. రెట్టింపు ఎత్తైన జంట టవర్ గారిసెండా నిజానికి బొలోగ్నా నగరానికి ప్రధాన ఆకర్షణగా నిలిచిన జంట టవర్లలో ఒకటి మాత్రమే! పైగా చిన్నది. ఎందుకంటే, దీని పక్కనే ఉన్న అసినెల్లీ టవర్ దీనికంటే దాదాపు రెట్టింపు పొడవైంది! అంటే దాదాపు 90 మీటర్లన్నమాట. ప్రఖ్యాత పీసా టవర్ ఎత్తు 56 మీటర్లే. అంటే, ఇది పీసాను తలదన్నేంత ఎత్తుందన్నమాట! అసినెల్లీ టవర్ నిర్మాణం గారిసెండా తర్వాత పదేళ్లకే, అంటే 1,119లో జరిగింది. ఇది కూడా కాస్త పక్కకు ఒరిగే ఉండటం విశేషం. అయితే ఆ ఒంపు మరీ పీసా, గారిసెండా అంతగా లేదు గనుక ప్రస్తుతానికి దీనికి వచి్చన ముప్పేమీ లేనట్టే! దాదాపు వెయ్యేళ్ల నాటిది! ► గారిసెండా టవర్ ఇప్పటిది కాదు. మధ్య యుగానికి చెందినది. ►దీన్ని దాదాపు వెయ్యేళ్ల క్రితం, అంటే క్రీస్తుశకం 1,109 సంవత్సరంలో నిర్మించారు. ►టవర్ ప్రస్తుత ఎత్తు 47 మీటర్లు (154 అడుగులు). ►నిర్మించినప్పుడు ఇది చాలా ఎత్తుండేది. ►200 ఏళ్లకే టవర్ ఒక పక్కకు ఒరగడం మొదలైంది. ►దాంతో 14వ శతాబ్దంలో దాని ఎత్తును బాగా తగ్గించారు. ►డాంటే 1321 సంవత్సరంలో ముగించిన అజరామర పద్య కావ్యం ‘ది డివైన్ కామెడీ’లో కూడా గారిసెండా టవర్ ప్రస్తావన ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ మట్టే ‘పీసా’ను నిలబెట్టింది
ఇటలీ: ప్రఖ్యాత పీసా టవర్ (బెల్ టవర్) నిర్మాణంపై ఇప్పటివరకు అంతుచిక్కకుండా ఉన్నపలు విషయాలను భౌతిక శాస్త్రవేత్తలు కనుగొన్నారు. క్రీ.శ.1173లో నిర్మాణమై, రెండు ప్రపంచ యుధ్దాలకు సాక్షిగా నిలిచిన ఈ భారీ నిర్మాణం ఒకవైపు ఒరిగి ఉంటుందన్న సంగతి తెలిసిందే. నిర్మాణ దశలోనే ఇది భూమిలోకి కుంగటం ప్రారంభమైందట. పునాదిలో కొంత మెత్తటి భూభాగం ఉండడంతో అలా జరిగిందట. మొత్తంగా నిర్మాణం పూర్తయ్యే సరికి టవర్ 5.5 డిగ్రీల మేర ఓ వైపుకు ఒరిగింది. పీసాకు అదే ప్రత్యేకత తెచ్చిపెట్టింది. వందల ఏళ్ల చరిత్ర ఒకవైపు, నిర్మాణంలో లోపం ఉన్నా చెక్కు చెదరకుండా వందల ఏళ్లుగా పర్యాటకుల మన్ననలు పొందుతుండటం మరోవైపు పీసాకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్‌లో స్థానం సంపాదించి పెట్టాయి. కాగా, 1990 నుంచి పదేళ్లపాటు పీసా టవర్ పునరుద్ధరణ పనులు జరిగాయి. టవర్ ఒంపును 5.5 డిగ్రీల నుంచి 3.9 డిగ్రీలకు సరిచేశారు. నాలుగు భారీ భూకంపాలను తట్టుకుని.. ఎంతో ఆధునిక నిర్మాణ పద్ధతులు పుట్టుకొచ్చిన నేటికాలంలో.. చిన్న పాటి భూ ప్రకంపనలకే భారీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన భవనాలు పేకమేడల్లా నేలమట్టం అవుతున్నాయి. అలాంటిది నిర్మాణ లోపంతో ఓ వైపు కుంగిపోయిన పీసా టవర్ ఇప్పటి వరకు 4 భారీ భూకంపాలకు గురైంది. అయినా, చెక్కు చెదరకుండా నిలబడింది. ప్రజలను, శాస్త్రవేత్తలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 6 కి పైగా నమోదైన పరిస్థితులను సైతం తట్టుకొని ఈ టవర్ నిలిచివుండడం పట్ల శాస్త్రవేత్తలు ఆశ్చర్యానికి లోనయ్యారు. దీని వెనక గల కారణాలను శోధించడం మొదలుపెట్టారు. ఎన్నో ఏళ్లుగా శాస్త్రవేత్తలను తొలుస్తున్న ప్రశ్నలకు సమాధానం దొరికింది. ఏ మెత్తటి భూభాగం కారణంగా పీసా టవర్ ఓవైపు ఒరిగిందో.. అదే మెత్తటి మట్టి ఈ నిర్మాణానికి బలాన్ని, భవిష్యత్తును ఇచ్చింది. టవర్ ఎత్తు, దృఢత్వం, పునాది మట్టిలోని మృదుత్వం టవర్‌కు వైవిధ్యమైన లక్షణాలను అందించాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ మట్టి కారణంగా భూకంప ప్రకంపనలతో ప్రతిబింబించని విధంగా టవర్‌కు ప్రత్యేక పరిస్థితులు ఏర్పడ్డాయినీ, వందల ఏళ్లుగా టవర్ దర్జాగా నిలిచివుండడాని కారణమిదేనని వారు వెల్లడించారు. కాగా, మరో 200 ఏళ్లపాటు పీసా టవర్ చెక్కు చెదరకుండా ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. పీసా అంటేనే ప్రత్యేకం.. ఇప్పుడు అద్వితీయం..!! -
పీసా టవర్‌పై దాడికి కుట్ర!
ప్రపంచ వింతలలో ఒకటైన పీసా టవర్ మీద దాడికి కుట్ర జరిగిదట! ఈ దాడికి కుట్ర పన్నినట్లు చెబుతున్న ట్యునీషియన్ దేశస్థుడిని వెంటనే బహిష్కరిస్తూ ఇటాలియన్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బిలెల్ చియాహొయి (26) అనే వ్యక్తి యూరప్‌లో జీహాదీల దాడులను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో మెసేజిలు పోస్ట్ చేయడంతో అతడిని అరెస్టు చేశారు. అతడు పీసా టవర్ మీద దాడి చేయడానికి కుట్రలు పన్నుతున్నట్లు పోలీసులు తెలిపారు. అతడికి జీహాదీ ఉగ్రవాదులతోను, ఐఎస్ఐఎస్తోను సంబంధాలున్నట్లు సాక్ష్యాలు లభించడంతో అతడిని దేశం నుంచి బహిష్కరించాలని ఓ జడ్జి ఆదేశించారు. అయితే, దాడి కుట్ర గురించిన ఇతర వివరాలేవీ లభించలేదు. ఇప్పటికే ఫ్రాన్స్, బెల్జియం దేశాలలో ఉగ్రవాద దాడులు జరగడంతో.. ఆ తర్వాత ఇటలీలోనే దాడులు జరగొచ్చన్న ఆందోళన ఇప్పటికే ఉంది. దాంతో ఆ దేశ హోం శాఖ మంత్రి యాంజెలినో అల్ఫానో ఆదేశాల మేరకు కొంతమంది అనుమానిత ఇస్లామిక్ ఉగ్రవాదులను దేశం నుంచి బహిష్కరించారు. -
పీసా టవర్‌ను పేల్చేందుకు మాఫియా కుట్ర
రోమ్: ప్రఖ్యాత పీసా టవర్‌ను పేల్చేసేందుకు ఇటలీ మాఫియా కుట్ర పన్నింది. పీసా టవర్‌తో పాటు ఇటలీలోని ఇతర చారిత్రక కట్టడాలను కూల్చేసేందుకు మాఫియా పథకం వేసింది. పీసా టవర్ మరెంతోకాలం ఉండబోదని ఓ మాఫియా నాయకుడు హెచ్చరించినట్టు పోలీసుల దృష్టికి వచ్చింది. ఇటలీలోని ప్రఖ్యాత చర్చిలు, ఇతర కట్టడాలు మాఫియా హిట్ లిస్టులో ఉన్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. మాజీ పోలీస్ అధికారులు, మాజీ న్యాయమూర్తులు, సీనియర్ రాజకీయ నాయకుల్ని లక్ష్యంగా చేసుకున్నారు. యాంటీ మాఫియా మాజీ ప్రాసిక్యూటర్, ప్రస్తుత ఇటలీ సెనెట్ స్పీకర్ ఫీట్రో గ్రాసోను కూడా హిట్ లిస్టులో ఉన్నారు. జైల్లో ఉన్న మాఫియా బాస్ టోటో రీనాను విచారించిన సందర్భంగా ఈ విషయాలు బయటపడ్డాయి. అతణ్ని ఆరెస్ట్ చేసిన పోలీస్ అధికారిని కూడా మాఫియా టార్గెట్ చేసింది.